సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీ.. ఊరికే లింకులు పెడతారు కదా! అందుకే అంటూ ఓపెన్

ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన పర్సనాలిటీ సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కమెడియన్‌గా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందిస్తున్న సుధీర్.. హీరోగా వెండితెరపై కూడా కాలుమోపుతున్నాడు. ఈ సందర్బంగా తాజాగా ఆలీతో సరదాగాలో ప్రాగ్రాంలో పాల్గొన్న ఆయన తన చిన్నతనంలోని లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి పోతే..

సరదా సరదాగా.. ఆలీతో సరదాగా

సరదా సరదాగా.. ఆలీతో సరదాగా

ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో సినీ నటీనటులను సరదా సరదా ముచ్చట్లలో ముంచెత్తుతూ వారివారి వ్యక్తిగత విషయాలు, జీవితంలోని ఆసక్తికర సంఘటనల గురించి రాబడుతుంటాడు ఆలీ. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ షోలో సుడిగాలి సుధీర్ చేత ఆయన చిన్ననాటి ముచ్చట్లను చెప్పించాడు ఆలీ. ఈ ప్రోగ్రామ్ సరదా సరదాగా సాగిపోయింది.

 ఊరికే లింకులు పెట్టేవారు కదా! అందుకే..

ఊరికే లింకులు పెట్టేవారు కదా! అందుకే..

ఈ సందర్బంగా సుధీర్ తన చిన్నతనంలో జరిగిన క్యూట్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. తానూ 5వ తరగతిలోనే ఓ అమ్మాయికి లైన్‌ వేశానని తెలిపాడు సుధీర్. చిన్నప్పుడు ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే ఊరికే లింకులు పెట్టేవారు కదా! అందుకే నేను ఓ అమ్మాయితో మాట్లాడటం మొదలు పెట్టానని, అది 4 సంవత్సరాల పాటు నడిచిందని అన్నాడు.

అనుకున్నట్లుగానే ఆటపట్టించారు.. చివరకు ఇష్టపడ్డా

అనుకున్నట్లుగానే ఆటపట్టించారు.. చివరకు ఇష్టపడ్డా

అనుకున్నట్లుగానే ఎప్పుడైతే తాను.. ఆ అమ్మాయితో మాట్లాడటం ప్రారంభించానో అప్పటి నుంచే తనను ఫ్రెండ్స్ ఆటపట్టించడం ప్రారంభించారని అన్నాడు సుధీర్. ఆ తర్వాత కొంతకాలానికి నిజంగానే తాను ఆ అమ్మాయిని ప్రేమించానని అన్నాడు. అలా 5వ తరగతిలో ఇష్టపడితే, 9వ తరగతిలో ఆ అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుందని సుధీర్ అన్నాడు.

అమ్మాయి ఇంట్లో గొడవలు.. ఆ వెంటనే

అమ్మాయి ఇంట్లో గొడవలు.. ఆ వెంటనే

ఆ తర్వాత ఇది తెలిసి ఆ అమ్మాయి ఇంట్లో గొడవలు కావడం.. ఆ వెంటనే స్కూల్ లో అమ్మాయిలను, అబ్బాయిలను వేరు వేరు తరగతి గదుల్లో కూర్చోబెట్టం ప్రారంభించారని సుధీర్ చెప్పుకొచ్చాడు. అలా తన బాల్యంలో ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయని ఆయన తెలిపాడు.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
 సుడిగాలి సుధీర్.. ఇక సాఫ్ట్‌వేర్ సుధీర్

సుడిగాలి సుధీర్.. ఇక సాఫ్ట్‌వేర్ సుధీర్

ఇక సుడిగాలి సుధీర్ కెరీర్ విషయానికొస్తే.. ఇన్నాళ్లు బుల్లితెరపై హంగామా చేసిన ఇతను ఇక వెండితెరపై కూడా జోష్ చూపించబోతున్నాడు. శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సాఫ్ట్‌వేర్ సుధీర్' సినిమాతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X