రష్మీ లేకపోతే నేను లేను.. ఆ రోజు ఫోన్‌లో చెప్పా: ఫస్ట్ టైం మనసు విప్పి మాట్లాడిన సుధీర్

Recommended Video

Sudigali Sudheer Reveals Sensational Facts About His Relation With Rashmi || Filmibeat Telugu

రష్మీ - సుధీర్.. తెలుగు వారికి ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదేళ్లుగా వీళ్లపై వచ్చినన్ని రూమర్స్ మరే జంటపై వచ్చి ఉండవు. జంటగా షోలు చేయడం.. అప్పుడప్పుడు స్పెషల్ షోలు చేయడంతో వీళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికితోడు, గత సంవత్సరం ఓ పండుగ సందర్భగా మిగిలిన ఆర్టిస్టులంతా కలిసి వీళ్లిద్దరికీ పెళ్లి చేశారు. అది షోలో భాగమే అయినా అప్పట్లో సంచలనం అయిపోయింది. తాజాగా రష్మీతో ఉన్న బంధం గురించి సుధీర్ మనసు విప్పి మాట్లాడాడు.

యూట్యూబ్ జోడీ

యూట్యూబ్ జోడీ

రష్మీ - సుధీర్‌ను యూట్యూబ్ జోడీగా పిలుస్తుంటారు. సామాన్య ప్రజలే కాదు.. చాలా మంది ఫ్రెండ్స్ కూడా వాళ్లను ఇలాగే అంటుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరిపై యూట్యూబ్‌ చానెళ్లలో వచ్చినన్ని రూమర్లు మరే జోడీపై రాకపోవడమే. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.

క్లారిటీ ఇచ్చినా ఆగలేదు

క్లారిటీ ఇచ్చినా ఆగలేదు

ఒకవైపు సుధీర్.. మరోవైపు రష్మీ తమ మధ్య ఏమీ లేదని ఎన్నో సార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో పలుమార్లు వీళ్లకు ఇదే తరహా ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడే దీనిపై స్పష్టత ఇచ్చారు. ఒకానొక సందర్భంలోనైతే రష్మీ ఓ నెటిజన్‌తో గొడవ కూడా పెట్టుకుంది. అయినా, వీళ్లపై వచ్చే పుకార్లు ఆగడం లేదు.

‘ఢీ' షోలో సుధీర్ స్పందన

‘ఢీ' షోలో సుధీర్ స్పందన

ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ‘ఢీ' షోలో సుధీర్ తమ బంధంపై స్పందించాడు. ‘రష్మీ అనే అమ్మాయి లేకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. సుధీర్ అంటే నా టాలెంట్ గురించి మాట్లాడరు. సుధీర్ - రష్మీ అంటారు. ఈ అమ్మాయి నా లైఫ్‌లో లేకపోతే నాకు లైఫే లేదు. ఆమె ప్రభావం నాపై ఎంతో ఉంది' అని చెప్పుకొచ్చాడు.

ఫోన్‌లో మాట్లాడుకోము

ఫోన్‌లో మాట్లాడుకోము

అలాగే, తమ మధ్య ఫోన్ సంభాషణల గురించి కూడా ప్రస్తావించాడు. ‘రష్మీకి నాకు ఏడు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. కానీ, ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకున్నది లేదు. రీసెంట్‌గా నాలుగైదు రోజుల క్రితం రెండున్నర గంటలు మాట్లాడుకున్నాం. అది కూడా మా ప్రొఫెషన్ గురించే మాట్లాడుకున్నాం' అని వెల్లడించాడు.

వాలంటైన్స్ డే రోజు విష్ చేశా

వాలంటైన్స్ డే రోజు విష్ చేశా

ఒకసారి ప్రేమికుల రోజున మొదటి విష్ తానే చేశానని చెప్పాడు. ‘ఒకసారి ఇద్దరం ఆహా నా పెళ్లంట అనే ప్రోగ్రాం చేశాం. ఆ ఈవెంట్‌కు ముందు ఒకసారి మాట్లాడాం. అది కూడా ఫిబ్రవరి 13న. రాత్రి 11.30 గంటలకు స్టార్ట్ చేశాం. అలా 14 తేదీకి వచ్చేశాం. అప్పుడే హ్యాపీ వాలంటైన్స్ డే అని ఫస్ట్ టైం చెప్పా' అని వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X