Just In
- 50 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- News
viral video: కూతకు వెళ్లిన ఎమ్మెల్యే రోజా: కబడ్డీ ఆడుతూ సందడి
- Finance
పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్, క్యాష్ డిపాజిట్స్, ఉపసంహరణపై కొత్త రూల్స్
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుడిగాలి సుధీర్ ఖాతాలో ఊహించని రికార్డ్: తెలుగు నుంచి ఎంపికైన ఏకైక యాక్టర్‌గా ఘనత
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది తమ టాలెంట్లను బయటకు తీసుకొచ్చి ఫేమస్ అయ్యారు. వారిలో కొందరు మాత్రం ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు సుడిగాలి సుధీర్‌దే. కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే మరెవరికీ సాధ్యం కాని విధంగా క్రేజ్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

అందరూ మెచ్చిన బుల్లితెర ఆల్‌రౌండర్
వేణు వండర్స్ అనే టీమ్‌లో సభ్యుడిగా జబర్ధస్త్‌లోకి ప్రవేశించాడు సుడిగాలి సుధీర్. ఆ తర్వాత తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి తన హవా చూపిస్తోన్న అతడు.. ఎన్నో స్టేజ్ షోలు, ఈవెంట్లలో మ్యాజిక్‌లు చేశాడు. అలాగే, డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ బుల్లితెర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడీ టాలెంటెడ్ యంగ్ స్టార్.

ఆమెతో ప్రేమాయణంతో మరింత ఫేమస్
సుడిగాలి సుధీర్ తన టాలెంట్‌తో ఎంతగా ఫేమస్ అయ్యాడో.. అంతకు మించి యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలతో మరింతగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు, ఆమెను వివాహం కూడా చేసుకోబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వీళ్లిద్దరి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.

వాళ్లతో ప్రేమాయణం... చెడ్డ పేరు కూడా
జబర్ధస్త్ కమెడియన్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు సుడిగాలి సుధీర్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. దీంతో యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. అదే సమయంలో రష్మీ గౌతమ్ కాకుండా పలువురు యాంకర్లలతో అతడు ప్రేమాయణం సాగిస్తున్నాడన్న టాక్ వచ్చింది. దీంతో ఈ కమెడియన్‌కు చెడ్డ పేరు కూడా వచ్చింది.
టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

నటుడిగా సక్సెస్.. హీరోగా ఫెయిల్యూర్స్
బుల్లితెరపై తనదైన శైలి టైమింగ్‌తో కామెడీని పండిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లోనూ అడుగెట్టాడు. ఈ క్రమంలోనే ‘రేసు గుర్రం', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', ‘సర్దార్ గబ్బర్ సింగ్', ‘బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ అతడికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి.

సుడిగాలి సుధీర్ ఖాతాలో ఊహించని రికార్డ్
దాదాపు ఏడేళ్లుగా బుల్లితెరపై తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోన్నాడు సుడిగాలి సుధీర్. ఈ క్రమంలోనే ఏ కమెడియన్‌కూ సాధ్యం కాని ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నాడు. దీంతో పలుమార్లు దేశ వ్యాప్తంగా హట్ టాపిక్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

తెలుగు నుంచి ఎంపికైన ఏకైక యాక్టర్‌గా
దేశ వ్యాప్తంగా బుల్లితెరపై ఉత్తమ నటులను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా తాజాగా 2020 సంవత్సరానికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తమ ఎంటర్‌టైనర్ విభాగంలో తెలుగు నుంచి సుడిగాలి సుధీర్ (ఢీ షో) ఎంపికయ్యాడు. అలాగే, హిందీలో కపిల్ శర్మ, తమిళంలో పుగజ్, బెంగాళీలో అభిర్ చటర్జీ, మరాఠీలో భానూ కదమ్ అనే ఆర్టిస్టులు ఎంపికయ్యారు.