సుడిగాలి సుధీర్ గురించి క్రేజీ న్యూస్ లీక్: ఏకంగా ఏడు గంటలు అదే పనంటే నమ్ముతారా.!

By Manoj

టెలివిజన్ రంగంలోకి ఏ ముహూర్తాన అడుగు పెట్టాడో కానీ... తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు వాళ్లకు పరిచయం అయిన అతడు... తనలోని అద్భుతమైన టాలెంట్‌తో టీమ్ లీడర్ అయిపోయాడు. అప్పటి నుంచి తనను తాను నిరూపించుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సుధీర్ గురించి ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఆ ఫొటోలు బయటకు రావడంతో అంతా అవాక్కవుతున్నారు. పూర్తి వివరాలు మీకోసం.!

సుడిగాలి సుధీర్.. బుల్లితెర ఆల్‌రౌండర్

సుడిగాలి సుధీర్.. బుల్లితెర ఆల్‌రౌండర్

కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్. కేవలం కమెడియన్‌గానే కాకుండా కొన్ని షోలలో డ్యాన్సర్, సింగర్‌గానూ ఆకట్టుకున్నాడు. అన్నింటి కంటే ముందు మెజీషియన్‌ అయిన అతడు... అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లలో మ్యాజిక్‌లు చేస్తుంటాడు. ఇవన్ని విద్యలతో ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

రష్మీతో ప్రేమ.. సుధీర్‌కు కెరీర్‌కు బూస్ట్

రష్మీతో ప్రేమ.. సుధీర్‌కు కెరీర్‌కు బూస్ట్

తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆమె... సుడిగాలి సుధీర్‌ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడింది. రష్మీతో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలతోనే అతడు మరింత పాపులర్ అయ్యాడు. అంతేకాదు, ఈ కారణంగానే ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నాడీ యంగ్ కమెడియన్.

ప్లేబాయ్‌గా పేరు.. ఆ యాంకర్లతో ఎఫైర్లు

ప్లేబాయ్‌గా పేరు.. ఆ యాంకర్లతో ఎఫైర్లు

సుడిగాలి సుధీర్‌కు బుల్లితెర ప్లేబాయ్‌గానూ పేరుంది. నిజ జీవితంలో ఎంతో స్క్రిక్ట్‌గా ఉండే అతడు... స్క్రీన్ మీద మాత్రం అమ్మాయిల పిచ్చోడిలా కనిపిస్తుంటాడు. ఈ కారణంగానే అతడిపై పంచుల వర్షం కురిపిస్తుంటారు తోటి కమెడియన్లు. ఇలాంటి పేరు తెచ్చుకోవడం వల్లే సుధీర్‌కు పలువురు యాంకర్లతో ఎఫైర్లు ఉన్నట్లు ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అందులోనూ ఎంట్రీ.. మంచి పేరొచ్చింది

అందులోనూ ఎంట్రీ.. మంచి పేరొచ్చింది

బుల్లితెరపై సత్తా చాటుతూ ఎదురులేని ఆర్టిస్టుగా దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్. అదే సమయంలో సినిమా రంగంలోకీ అతడు అడుగు పెట్టాడు. ‘అడ్డా' అనే మూవీతో తెరంగేట్రం చేసిన అతడు... వరుస పెట్టి ఎన్నో చిత్రాల్లో నటించాడు. సుధీర్ నటించిన సినిమాల్లో ‘రేసు గుర్రం', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', ‘సర్దార్ గబ్బర్ సింగ్', ‘బంతిపూల జానకీ' చిత్రాలు పేరు తెచ్చి పెట్టాయి.

అలా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు

అలా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు

కమెడియన్‌గా, మెజీషియన్‌గా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా సూపర్ సక్సెస్ అయిన సుడిగాలి సుధీర్... హీరోగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు... ఆ వెంటనే ‘త్రీ మంకీస్' అనే సినిమాలోనూ నటించాడు. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. అయినా మరిన్ని ఆఫర్లు అందుకుంటున్నాడు సుధీర్.

సుడిగాలి సుధీర్ గురించి క్రేజీ న్యూస్ లీక్

టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని సాగిపోతోన్న సుడిగాలి సుధీర్.. భవిష్యత్‌లో వీలైనని సినిమాల్లో నటించాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే వరుసగా ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడు ‘కాలింగ్ సహస్ర' అనే మూవీ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

Recommended Video

Hero Sudheer Babu Special Interview On 'V' Movie
 ఏకంగా ఏడు గంటలు అదే పనిలో సుధీర్

ఏకంగా ఏడు గంటలు అదే పనిలో సుధీర్

అరున్ విక్కిరాలా తెరకెక్కిస్తోన్న ‘కాలింగ్ సహస్ర' ద్వారా సుడిగాలి సుధీర్ హీరోగా రీలాంఛ్ అవుతున్నాడు. దీంతో ఈ మూవీలో అతడు రెండు డిఫరెంట్ లుక్‌లతో దర్శనమివ్వనున్నాడట. అందులో ఒకటి గుబురు గెడ్డంతో ఉన్నది కాగా, రెండోది ఫుల్ ఫిట్ బాడీతో అని తెలుస్తోంది. అందుకోసమే సుధీర్ రోజుకు ఏడు గంటల పాటు జిమ్‌లో చెమటోడ్చుతున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X