ఆ యాంకర్‌తో సుడిగాలి సుధీర్ డేటింగ్ ? సీక్రెట్ రిలేషన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా!

టాలీవుడ్ బుల్లితెరలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). ఇటు సినిమాలు, అటు టీవీ షోలతో ఎప్పుడు బిజీబిజీగా ఉంటే సుడిగాలి సుధీర్ పేరు వినగానే చాలా మందికి వెంటనే యాంకర్ రష్మి గౌతమ్ గుర్తుకు వస్తుంది. ఈ జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో సుధీర్-రష్మి నిజ జీవితంలో కూడా జంట అవుతారని, భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇద్దరూ పలుమార్లు స్పందిస్తూ, తమ మధ్య కేవలం మంచి స్నేహమే ఉందని స్పష్టంగా చెప్పారు. ఇదిలా ఉండగా, తాజాగా సుడిగాలి సుధీర్‌ రిలేషన్ కు సంబంధించిన మరో కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెట్టింట్లో మరోసారి చర్చకు దారితీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఫోటోవైరల్
సుడిగాలి సుధీర్ మరోసారి సోషల్ మీడియాలో రూమర్లతో వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా మరో యాంకర్ దీపిక పిల్లి (Deepika Pilli)తో రిలేషన్ లో ఉందన్న ప్రచారం ఒక్కసారిగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించే ఒక ఫోటో వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఆ ఫోటో దీపికా పిల్లి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కనిపించడంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో నెటిజన్లు ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలుపెట్టారు.

Sudigali Sudheer Dating Rumours Deepika Pilli Reveals Truth Behind Viral Photo

క్లారిటీ ఇచ్చిన దీపికా పిల్లి
అయితే ఈ వైరల్ ప్రచారంపై దీపికా పిల్లి వెంటనే స్పందిస్తూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, అందులో పోస్ట్ అయిన ఫోటో పూర్తిగా AI ద్వారా రూపొందించిన ఫేక్ ఇమేజ్ అని స్పష్టం చేసింది. 'నా అనుమతి లేకుండా ఎవరో ఆ ఫోటోను షేర్ చేశారు. గత 24 గంటల్లో నా ఖాతాలో కనిపించిన కంటెంట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు' అని ఆమె స్పష్టంగా తెలిపింది. ఇక అభిమానులకు ఆమె ఒక కీలక విజ్ఞప్తి కూడా చేసింది. ఇలాంటి ఫోటోలను నమ్మవద్దని, షేర్ చేయవద్దని కోరింది. ప్రస్తుతం తన అకౌంట్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నానని కూడా వెల్లడించింది.

సుధీర్‌పై తరచూ వస్తున్న రూమర్లు
సుడిగాలి సుధీర్ విషయంలో ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా రష్మితో అతని ప్రేమ, పెళ్లి గురించి ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే ప్రతి సారి వీరిద్దరూ "మేము కేవలం మంచి స్నేహితులం మాత్రమే" అంటూ క్లారిటీ ఇచ్చినా, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కారణంగా ఆ వార్తలు ఆగలేదు. ఇప్పుడు అదే విధంగా దీపికా పిల్లి పేరుతో కొత్త గాసిప్ రావడం గమనార్హం. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఊహాగానాలు సృష్టించడం ఇటీవలి కాలంలో మరింత పెరిగింది.

ఈ సంఘటన మరో కీలక అంశాన్ని కూడా హైలైట్ చేస్తోంది. AI టెక్నాలజీ దుర్వినియోగం. డీప్‌ఫేక్ ఫోటోలు, ఫేక్ స్టోరీలు సృష్టించి సెలబ్రిటీల ఇమేజ్‌ను దెబ్బతీయడం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీపికా పిల్లి కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించాలే గానీ ఇలా తప్పుదోవ పట్టించడం తగదని పేర్కొంది.

ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరికొందరు 'ఇలాంటి రూమర్లు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తాయి' అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇలా సుడిగాలి సుధీర్ - దీపికా పిల్లి మధ్య రిలేషన్ ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇది పూర్తిగా హ్యాకింగ్, AI ఫేక్ కంటెంట్ కారణంగా వచ్చిన గాసిప్ మాత్రమే తేలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X