ఎందుకు బతికున్నానా అనుకున్నా.. తన సమస్యను చెప్పుకుని ఏడ్చిన సుధీర్
తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్టు.. బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒక పక్క టీవీ షోలు చేస్తూ.. మరోవైపు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే, కొన్ని సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సుధీర్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు.
సాఫ్ట్‌వేర్ అయిపోయిన సుధీర్
ఇన్ని రోజులు బుల్లితెరపై సందడి చేసిన సుడిగాలి సుధీర్.. పలు సినిమాల్లో కూడా నటించాడు. ఈ క్రమంలోనే అతడు ‘సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే సినిమా ద్వారా హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త కే శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల తెరకెక్కించాడు. ఇందులో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ నటిస్తోంది.

మనసు విప్పి మాట్లాడాడు
హీరోగా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సుడిగాలి సుధీర్ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ‘ఢీ' ఛాంపియన్స్ టీమ్‌తో కలిసి ట్రైలర్ రిలీజ్ చేయించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్.. తాజాగా ప్రముఖ కమెడియన్ అలీ షోకు గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా కొన్ని రహస్యాలు చెప్పాడు. అంతేకాదు, చాలా విషయాల గురించి మాట్లాడాడు.

రష్మీనే హగ్ చేసుకుంటా
ఈ షోకు సంబంధించిన ప్రోమోను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. ఇందులో అలీ.. సుధీర్‌ను ‘దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రాలో ఎవరిని హగ్ చేసుకుంటావు' అని చిలిపిగా ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా అతడు ‘నేను వాళ్లిద్దరినీ హగ్ చేసుకోను. నన్ను ఎవరైతే అడుగుతారో వాళ్లను రష్మీ లేదా అని అడుగుతాను' అని చెప్పాడు.
రష్మీనే టార్గెట్ చేశాను
ఇదే షోలో యాంకర్ అలీ.. సుధీర్ వద్ద రష్మీ గురించి కూడా ప్రస్తావించాడు. ఇందులో భాగంగా మీ ఇద్దరి మధ్య ఏముంది అని అడిగాడు. దీనికి ‘ఏడేళ్ల నుంచి మా గురించి అనుకుంటున్నారు. జబర్ధస్త్‌లో ఆమె మీద పంచులు వేయడం.. తర్వాత ‘ఢీ'లో కంటిన్యూ అవడంతో మా ఇద్దరి మధ్య ఏదో ఉందనేది అందరికీ కనెక్ట్ అయిపోయింది' అని సుధీర్ సమాధానం ఇచ్చాడు.
Recommended Video

ఎందుకు బతికున్నానా అనుకున్నా
తాజాగా ఈ షోకు సంబంధించిన మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుధీర్ తన ఆరోగ్య సమస్య గురించి వెల్లడించాడు. ‘నాకెందుకు వచ్చిందో తెలియదు కానీ, ఆ నొప్పులకు ఎందుకు బతికున్నానా అనిపించింది. కదిలితే షాక్ కొట్టినట్లు అయ్యేది. డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ఆపరేషన్ చేయాలి. తేడా వస్తే కాళ్లు పని చేయవు అని చెప్పారు' అని సుధీర్ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











