రష్మీపై ప్రేమను మరోసారి బయటపెట్టిన సుధీర్: ఎనిమిదేళ్లుగా జరుగుతుందంటూ ఎమోషనల్.!

By Manoj

తెలుగు బుల్లితెరపై తరచూ హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో యాంకర్ రష్మీ గౌతమ్... కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రేమ వ్యవహారం ఒకటి. దాదాపు ఐదేళ్లుగా ఇదే టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అవుతూ వస్తోంది. దీంతో ఎవరి నోట విన్నా వీళ్లిద్దరూ ప్రేమికులే అన్న మాటలే వినిపిస్తున్నాయి. ఈ విషయంపై వీళ్లిద్దరూ చాలా సార్లు వివరణ ఇచ్చుకున్నప్పటికీ వాటికి మాత్రం బ్రేక్ పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సుడిగాలి సుధీర్.. రష్మీపై ఉన్న ప్రేమను బయట పెట్టేశాడు. అంతేకాదు, ఎనిమిదేళ్లుగా కొనసాగుతుందని వివరించాడు. ఆ వివరాలు మీకోసం.!

 జబర్ధస్త్ షో కలిపింది ఈ ఇద్దరిని

జబర్ధస్త్ షో కలిపింది ఈ ఇద్దరిని

జబర్ధస్త్ అనే షో ద్వారా కలుసుకున్నారు రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్. వాళ్లిద్దరి యాంకర్, టీమ్ లీడర్ బంధమే అయినా.. లవ్ ట్రాక్ నడుపుతున్నారన్న వార్తలతో బాగా పాపులర్ అయ్యారు. ఈ కామెడీ షోలో రష్మీపై సుధీర్ పంచులు వేస్తుండడంతో ఈ ట్రాక్‌కు పునాది పడింది. అప్పటి నుంచి వీళ్లను మిగతా టీమ్ లీడర్లు కూడా టార్గెట్ చేయడంతో వీళ్ల బంధం బలపడింది.

ఇలానే ఎక్కువ ఫేమస్ అయ్యారు

ఇలానే ఎక్కువ ఫేమస్ అయ్యారు

యాంకరింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది రష్మీ గౌతమ్. అదే సమయంలో బుల్లితెరపై వైవిధ్యమైన నటనతో పాటు డ్యాన్స్, సింగింగ్, మ్యాజిక్ ఇలా ఎన్నో విధ్యలను ప్రదర్శిస్తూ స్టార్‌గా పేరొందాడు సుధీర్. తమ తమ రంగాల్లో సత్తా చాటుతున్నప్పటికీ.. ప్రేమ వ్యవహారంతోనే వీళ్లిద్దరూ ఎనలేని గుర్తింపును అందుకున్నారు.

రష్మీ సుధీర్... యూట్యూబ్ జోడీ

రష్మీ సుధీర్... యూట్యూబ్ జోడీ

రష్మీ గౌతమ్‌పై సుడిగాలి సుధీర్ లవ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. దీనిపై వీళ్లిద్దరూ స్పందించలేదు. దీంతో ఈ బుల్లితెర జంట ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఇక, అప్పటి నుంచి రష్మీ సుధీర్‌పై ఎన్నో వార్తలు ప్రసారం అయ్యాయి. అంతేకాదు, యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు ప్రత్యేక్షమయ్యాయి. ఆ సమయంలోనే వీళ్లకు యూట్యూబ్ జోడీ అనే వచ్చింది.

వీళ్లను బాగా వాడుకుంటున్నారు

వీళ్లను బాగా వాడుకుంటున్నారు

రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ జంటగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వీళ్ల పేరును వాడుకునేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో ఈ జంటపై ప్రత్యేకమైన స్కిట్లు, డ్యాన్స్‌లు రూపొందించి క్యాష్ చేసుకుంటున్నారు. దీంతో వీళ్లు మరింత హైలైట్ అవుతున్నారు.

రష్మీపై ప్రేమను బయటపెట్టిన సుధీర్

తమ మధ్య ఏమీ లేదంటూనే తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు రష్మీ సుధీర్. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు చిన్న కామెంట్ చేసినా అది బాగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల సుధీర్‌తో పెళ్లిపై రష్మీ గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే జబర్ధస్, ఢీ షోలో కూడా తరచూ ఏదో ఒక యాక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుధీర్ తన ప్రేమను మరోసారి బయటపెట్టాడు.

ఎనిమిదేళ్లుగా జరుగుతుందని కామెంట్

ఎనిమిదేళ్లుగా జరుగుతుందని కామెంట్

వచ్చే వారంతో ఎక్స్‌ట్రా జబర్ధస్త్ 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోనుంది. దీన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు షో నిర్వహకులు. ఈ సందర్భంగా రోజా... సుధీర్, రష్మీని ఒకరిపై ఒకరి అభిప్రాయాలు చెప్పమని కోరింది. దీనికి స్పందించిన సుధీర్ ‘నా జీవితంలో రష్మీ చాలా ఇంపార్టెంట్. ఆమె వల్లే ఫేమస్ అయ్యాను. రష్మీ సుధీర్‌ అంటేనే ఎక్కువగా గుర్తిస్తున్నారు' అని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Kajal Aggarwal's Fiency Gautam Kitchlu's Net Worth Details
ఎమోషనల్ అయిన సుడిగాలి సుధీర్

ఎమోషనల్ అయిన సుడిగాలి సుధీర్

సుధీర్ తర్వాత రష్మీని కూడా మాట్లాడమని కోరగా ఆమె సిగ్గు పడిపోయింది. ఇక, ఆ వెంటనే మరోసారి మైక్ అందుకున్న అతడు... ‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అంటారు. అలాగే నేను సాధించే ప్రతి విజయం వెనుక రష్మీ పాత్ర ఉంది' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఈ జంటపై ప్రత్యేకమైన పాటను కూడా చూపించారు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X