For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sudigali Sudheer Engagement: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన సుధీర్.. వాళ్ల ముందే రింగ్ తొడిగేసి!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో అందరూ సక్సెస్ కావడం లేదు. కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో పాటు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. బుల్లితెరపైకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన అతడు.. వరుస ఆఫర్లతో తెగ సందడి చేస్తున్నాడు. ఇక, ఇతగాడి పెళ్లి గురించి చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతడు షడన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో మీరూ చూడండి!

  అలా వచ్చి.. ఇలా పాపులర్

  అలా వచ్చి.. ఇలా పాపులర్

  మెజీషియన్‌గా కెరీర్‌ను ఆరంభించిన సుధీర్.. ఎన్నో ఛానెళ్లలో స్పెషల్ షోలు చేస్తూ బుల్లితెరపై సందడి చేశాడు. అలాంటి సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో అందులోకి ఆర్టిస్టుగా అడుగు పెట్టారు. అలా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకున్నాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ కల్పించారు.

  Bigg Boss Non Stop: షోలో శృతి మించిన అశ్లీలత.. టాప్ విప్పేసిన బ్యూటీ.. ఆ కుర్రాళ్లు ఏం చేశారంటే!

  రష్మీ వల్ల మరింత ఫేమస్

  రష్మీ వల్ల మరింత ఫేమస్

  తక్కువ టైంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన సుడిగాలి సుధీర్ భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ లవర్సే అని అంతా అనుకుంటున్నారు.

  హీరోగానూ బిజీ అయ్యాడు

  హీరోగానూ బిజీ అయ్యాడు

  సుదీర్ఘ కాలంగా తన కామెడీతో సుధీర్ తిరుగులేని ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు. అలాగే హీరోగానూ మారి చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' నిరాశ పరిచాయి. ఇప్పుడు సుధీర్ హీరోగా 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' మూవీలతో బిజీగా ఉన్నాడు.

  బీచ్‌లో బ్రాతో కరీనా కపూర్ ఫోజులు: తల్లైన తర్వాత కూడా మరీ ఇంత దారుణంగా!

  యాంకర్‌గా సందడి చేస్తూ

  యాంకర్‌గా సందడి చేస్తూ

  సుడిగాలి సుధీర్ కొన్నేళ్ల క్రితం 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. దీంతో హోస్టుగానూ తన మార్క్‌ను చూపించి అలరించాడు. కానీ, ఆ షోతో యాంకరింగ్‌ను ఆపేశాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. అందులో తనదైన శైలిలో హోస్టింగ్ సత్తా చాటుతూ మజా ఇస్తున్నాడు.

  ఉమెన్స్ డే కోసం స్పెషల్

  ఉమెన్స్ డే కోసం స్పెషల్

  రాబోయే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. గతంలో జరిగిన వాటి మాదిరిగానే ఈ ఎపిసోడ్ కూడా ఎంతో సందడిగా సాగినట్లు ప్రోమోలో చూపించారు. ఉమెన్స్ డే స్పెషల్‌గా రాబోతున్న ఈ ఎపిసోడ్‌లో కొంత మంది కమెడియన్ల తల్లులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లకు అందరూ సన్మానాలు వంటివి చేశారు.

  Bigg Boss Non Stop: వారం కాకముందే ఆగిపోయిన తెలుగు బిగ్ బాస్.. మళ్లీ అప్పుడే మొదలు.. కారణం ఏంటంటే!

  సుధీర్ నిశ్చితార్థం వీడియో

  సుడిగాలి సుధీర్ తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్‌లో పాపులారిటీని సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి లేడీ ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు. ఇంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న అతడి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌తో పాటు అందరికీ కోలుకోలేని షాక్ ఇచ్చేశాడు.

  ఆ అమ్మాయికి రింగ్ తొడిగి

  ఆ అమ్మాయికి రింగ్ తొడిగి


  'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన కొత్త ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఎవరో ఒక అమ్మాయితో సుడిగాలి సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగింది. అందరి ముందే అతడు ఆమె చేతికి ఉంగరం తొడిగేశాడు. దీంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ ఎంగే‌జ్‌మెంట్ షో కోసమా? లేక నిజంగా జరిగిందా? అన్నది చర్చనీయాంశంగా మారిపోయింది.

  English summary
  Telugu Actor and Comedian Sudigali Sudheer Paticipated in Sridevi Drama Company. In Upcoming Episode.. His Engagement Will be Highlighted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X