సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం: వాళ్ల దెబ్బకు బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు చుక్కలు.!
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది సెలెబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ... వారిలో కొంత మందికి మాత్రమే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాంటి ప్రముఖుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ యంగ్‌స్టర్... చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. తద్వారా వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుధీర్‌ను ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఘోరంగా అవమానించాడు. దీనికి దారుణమైన ప్రతిఫలం ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

సుడిగాలి సుధీర్.. బుల్లితెర ఆల్‌రౌండర్
జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు సుడిగాలి సుధీర్. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. అంతకంటే ముందు మెజీషియన్‌గా కెరీర్‌ను ఆరంభించాడు. పాపులారిటీ వచ్చిన తర్వాత మంచి మంచి డ్యాన్స్‌లు వేస్తూ, అప్పుడప్పుడూ పాటలు పాడుతూ తనలోని ఒక్కో టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. దీంతో బుల్లితెర ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతున్నాడు.

ఆ యాంకర్ వల్ల విపరీతమైన గుర్తింపు
టాలెంట్ ద్వారా ఎంత ఫేమస్ అయ్యాడో... యాంకర్ రష్మీ గౌతమ్ కారణంగా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షోలో కలిసి పని చేయడంతో సదరు యాంకర్‌తో అతడు ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎఫైర్లతో హైలైట్.... ప్లేబాయ్ అనే పేరు
సుడిగాలి సుధీర్ తన కెరీర్ పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అదే సమయంలో కొన్ని పరిణామాల కారణంగా ప్లేబాయ్ అనే పేరును కూడా తెచ్చుకున్నాడు. దీనికి కారణం అతడు.. యాంకర్ రష్మీ గౌతమ్, విష్ణు ప్రియతో పాటు పలువురితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు రావడమే. అంతేకాదు, జబర్ధస్త్ స్కిట్లలో తరచూ అతడిని అదే తరహా పాత్రల్లో చూపిస్తుండడమే.

సినిమాల్లో సక్సెస్... హీరోగా ఫెయిల్
బుల్లితెరపై టాప్ సెలెబ్రిటీగా ఓ వెలుగు వెలుగుతోన్న సుడిగాలి సుధీర్... సినిమాల్లో హీరోగా మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయాడు. ‘రేసు గుర్రం', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', ‘సర్దార్ గబ్బర్ సింగ్', ‘బంతిపూల జానకీ' వంటి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, హీరోగా చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీ మంకీస్' మాత్రం నిరాశనే మిగిల్చాయని చెప్పాలి.

మరో ప్రయత్నం... సరికొత్తగా సుధీర్
అరున్ విక్కిరాలా తెరకెక్కిస్తోన్న ‘కాలింగ్ సహస్ర' ద్వారా హీరోగా రీలాంఛ్ అవుతున్నాడు సుడిగాలి సుధీర్. దీంతో ఈ మూవీ కోసం అతడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతేకాదు, లుక్‌తో పాటు ఫిజిక్‌ను పర్‌ఫెక్ట్‌గా ఉంచేందుకు బాగా శ్రమిస్తున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం సుధీర్ ఏకంగా ఏడు గంటల పాటు జిమ్‌లో చెమటోడ్చుతున్నాడని చెబుతున్నారు.

సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం
సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు ఢీ అనే షోలోనూ చేస్తున్నాడు. ఇందులో ఓ టీమ్‌కు లీడర్‌గా ఉన్న అతడు.. ఫన్నీ టాస్కులు చేస్తూ అలరిస్తున్నాడు. తద్వారా షో సక్సెస్‌కు కారణం అవుతున్నాడు. ఇదిలాఉండగా... రెండు మూడు ఎపిసోడ్లలో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ జడ్జ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సుధీర్‌ను ఘోరంగా అవమానిస్తున్నాడు.
Recommended Video

సుధీర్‌తో పెట్టుకుంటే అలాగే ఉంటుంది
ఢీ షోలో బాబా భాస్కర్.. సుధీర్‌ను వేస్ట్ అంటూ కామెంట్ చేస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అతడి ఫ్యాన్స్ మాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో ఓ ఈవెంట్‌లో రాహుల్ సిప్లీగంజ్‌కు సైతం ఇలాగే కామెంట్లు చేశాడు. అప్పుడు కూడా సుధీర్ ఫ్యాన్స్ ఇలానే స్పందించారు.


Click it and Unblock the Notifications











