సుడిగాలి సుధీర్ పెళ్లిపై తండ్రి షాకింగ్ రియాక్షన్: అమ్మాయిని చూసుకున్నాడంటూ షాకిచ్చాడుగా!

సుడిగాలి సుధీర్.. తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా అతడు చాలా కాలంగా బుల్లితెరపై తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో వెండితెరపైనా సందడి చేస్తూ సత్తాను నిరూపించుకుంటున్నాడు. తద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకోవడంతో పాటు వరుస అవకాశాలను దక్కించుకుంటూ ముందుకెళ్తున్నాడు. అలాగే, పర్సనల్ లైఫ్ విషయంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సుధీర్ పెళ్లి గురించి ప్రస్థావన వచ్చింది. దీనిపై అతడి తండ్రి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే...

 బుల్లితెర ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ

బుల్లితెర ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ

మెజీషియన్‌గా తన కెరీర్‌ను ఆరంభించాడు సుధీర్. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌ కమెడియన్ల దృష్టిలో పడి అందులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుని టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అదే సమయంలో డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, హీరోలను ఇమిటేట్ చేస్తూ ఆల్‌రౌండర్‌గా పేరొందాడు.

 రష్మీతో ప్రేమాయణంతో యమ పాపులర్

రష్మీతో ప్రేమాయణంతో యమ పాపులర్

సుడిగాలి సుధీర్ ఇంత పేరు సంపాదించుకోడానికి అతడిలోని టాలెంట్ కారణం అయితే... భారీ స్థాయిలో పాపులారిటీ దక్కడానికి మాత్రం అతడి వ్యవహార శైలినే కారణం అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలు అతడిని మరింతగా హైలైట్ చేశాయి. అందుకే తన ఎదుగుదలకు ఆమెనే ప్రధానం కారణం అంటూ చెప్పాడు సుధీర్.

 అలాంటి పాత్రలతో.. ప్లేబాయ్‌గా బిరుదు

అలాంటి పాత్రలతో.. ప్లేబాయ్‌గా బిరుదు

సుడిగాలి సుధీర్ రష్మీతో మాత్రమే కాదు.. పలువురు యాంకర్లతోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే జబర్ధస్త్ స్కిట్లలో అతడిని అమ్మాయిలా పిచ్చోడిలా చూపిస్తున్నారు. దీంతో సుడిగాలి సుధీర్ అంటే ప్లేబాయ్ అనేలా ఫేమస్ అయ్యాడు. అదే సమయంలో తనపై తానే పంచులు వేసుకుంటూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు.

సినిమాల్లోనూ సత్తా చాటుతున్నాడుగా

సినిమాల్లోనూ సత్తా చాటుతున్నాడుగా

సుడిగాలి సుధీర్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అందులో 'రేసు గుర్రం', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాలు పేరు తెచ్చాయి. అయితే, హీరోగా మారి చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం అతడిని ఘోరంగా నిరాశ పరిచాయి. ఇక, ఇప్పుడు 'కాలింగ్ సహస్ర', 'గాలోడు' వంటి చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.

యాంకర్‌గా మారిన జబర్ధస్త్ కమెడియన్

యాంకర్‌గా మారిన జబర్ధస్త్ కమెడియన్

జబర్ధస్త్ షోలో టాప్ కమెడియన్‌గా చాలా కాలంగా కడుపుబ్బా నవ్విస్తోన్న సుడిగాలి సుధీర్.. ఆ మధ్య 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇలా హోస్టింగ్ కూడా చేస్తూ వచ్చాడు. కానీ, ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా మారిపోయాడు.

సుడిగాలి సుధీర్ పెళ్లిపై తండ్రి రియాక్షన్

వచ్చే వారం ప్రసారం కానున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో ఫాదర్స్ డే స్పెషల్‌గా కమెడియన్ల తండ్రులను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ తండ్రితో వీడియో కాల్ మాట్లాడాడు. అప్పుడు అతడు మాట్లాడుతుండగా.. హైపర్ ఆది వచ్చి 'అంకుల్.. మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు. మనోడి తర్వాత నేను రెడీగా ఉన్నా' అని అనగా ఆయన షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు.

సుధీర్‌పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్

సుధీర్‌పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆది అలా అడగగానే సుధీర్ తండ్రి మాట్లాడుతూ.. 'ముందు నువ్వు చేసుకో. నువ్వు చేసుకుంటేనే చేసుకుంటా అంటున్నాడు' అంటూ చెప్పుకొచ్చారాయన. అప్పుడు హైపర్ ఆది మాట్లాడుతూ.. 'నేను చేసేసుకుందామని ఒక అమ్మాయిని చూసేసుకున్నాను. ఆ అమ్మాయిని మనోడు చూసేసుకున్నాడు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X