సుధీర్‌ని బాధపెట్టిన జబర్దస్త్ ఇమేజ్.. స్నేహితుల వద్ద ఓపెన్ కాక తప్పలేదు
Recommended Video
బుల్లితెర కామెడీ షోల్లో 'జబర్దస్త్' ని మించిన కామెడీ కిక్కు ఏదీ ఇవ్వదనడంలో అతిశయోక్తి లేదు. యాంకర్ అనసూయ మొదలుకొని పార్టిసిపెంట్స్ వరకు అందరూ పంచులతో పరేషాన్ చేసే వారే. తమపై తామే పంచులేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో బాగా సక్సెస్ అయింది జబర్డస్త్ టీమ్. ఈ ఒక్క షో ద్వారానే అందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ మంచి పాపులారిటీ దక్కింది. తమ తమ స్కిట్స్ ద్వారా ఒక్కొక్కరూ ఒక్కో ట్యాగ్‌తో క్రేజ్ కొట్టేశారు. అయితే అదే ట్యాగ్ ఇప్పుడు సుడిగాలి సుధీర్ కి సమస్యగా మారిందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

'జబర్దస్త్' షో.. సుదీర్ ఫాలోయింగ్
'జబర్దస్త్' షో ద్వారానే పరిచయమైన సుదీర్.. ఆ తర్వాత ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇందులో సుడిగాలి సుదీర్ గా ఆయన చేసిన కామెడీకి మంచి క్రేజ్ లభించింది. ఈ షో తో వచ్చిన పాపులారిటీ ఆయనకు పలు బుల్లితెర కార్యకమాల్లో ఆఫర్ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో అంతకంతకూ ఆయన ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది.

బుల్లితెర ప్లేబాయ్ సుదీర్
సుదీర్ స్మైలీ లుక్స్, జబర్దస్త్ ఫేం కారణంగా ఆయనకు బుల్లితెర ప్లేబాయ్ అనే ఇమేజ్ వచ్చేసింది. దీంతో ఆయన ఏ కార్యక్రమంలో కనిపించినా అమ్మాయిల పేర్లతో సుదీర్ పై బాంబులు పేలుతుండటం గమనించవచ్చు. యాంకర్స్, తోటి పార్టిసిపెంట్స్ సుదీర్ తో సరదా సరదాగానే ఉంటూ ప్లేబాయ్ అని కామెంట్ చేస్తుంటారు.

సుదీర్ పై పంచులే పంచులు
'జబర్దస్త్' లో పంచులేసుకోవడమే ప్రత్యేక ఆకర్షణ. దీంతో సుదీర్ పై పంచులేస్తే చాలా లైట్ అనే కోణంలో ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లినా పంచులు మీద పంచులు విసురుతున్నారు సదరు నిర్వాహకులు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇతర కార్యక్రమాల్లోని యాంకర్లు, హోస్ట్‌లు.. సుధీర్ కనిపిస్తే చాలు అమ్మాయిల టాపిక్ తీసి ఆటపట్టిస్తుంటారు. ఆ రకంగా సుధీర్ అంటేనే బుల్లితెర ప్లేబాయ్ అనే ఇమేజ్ పాతుకుపోయింది జనాల్లో.

పాపం హర్ట్ అయ్యాడట సుదీర్
ఎలాగోలా సుడిగాలి సుదీర్ బాగా పాపులర్ అయి పబ్లిక్ ఫిగర్ కావడంతో పలు ఈవెంట్ లకు హోస్ట్ గా వెళ్లడం లేదా గెస్ట్ గా వెళ్లడం జరుగుతోంది. అయితే ఆ ఈవెంట్స్ లో అతన్ని కాస్త అనుమానంగా చూశారట అక్కడున్న వారంతా. ఇటీవలే ఇలాంటి సంఘటన ఎదురుకావడంతో హర్ట్ అయిన సుదీర్.. తప్పని పరిస్థితుల్లో తన భాధను స్నేహితుల వెళ్ళగక్కాడట.


Click it and Unblock the Notifications