త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సుడిగాలి సుధీర్? కాబోయే భార్య ఎవరంటే?

సాధారణ మేజిషియన్ నుంచి స్టార్ సెలబ్రిటీగా ఎదిగారు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ ద్వారా పరిచయమైన ప్రతిభావంతుల్లో సుధీర్ కూడా ఒకడు. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి మనోడు చేసిన స్కిట్స్ ప్రేక్షకులను అలరించాయి. తన టాలెంట్‌తో బుల్లితెర నుంచి సినిమాలలో హీరో స్థాయికి ఎదిగాడు సుధీర్. అయితే తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో వినిపించే పేరు సుడిగాలి సుధీర్. 40కి చేరువ అవుతున్నా ఇంత వరకు ఇతను పెళ్లి మాట ఎత్తడం లేదు. తాజాగా తన పెళ్లిపై సుధీర్ ఓపెన్ అయ్యాడు. ఈ వివరాల్లోకి వెళితే.

చాలా తక్కువ సమయంలోనే బుల్లితెరపై స్టార్‌గా ఎదిగాడు సుడిగాలి సుధీర్. విజయవాడకు చెందిన ఈ కుర్రాడు తొలుత మ్యాజిక్ షోలు చేసుకుంటూ తన జీవితాన్ని ప్రారంభించాడు. ఈ దశలో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం సుధీర్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. తొలుత వేణు వండర్స్ టీమ్ ద్వారా ఈ మెగా కామెడీ షోలోకి అడుగుపెట్టిన సుధీర్.. షార్ట్ గ్యాప్‌లోనే టీమ్ లీడర్ స్టాయికి ఎదిగాడు. తన ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్‌లతో కలిసి అల్లరి చేశాడు. తన కామెడీ టైమింగ్, నటన, పంచ్‌లతో సుధీర్ రెచ్చిపోయాడు.

Sudigali Sudheer Finally Breaks Silence on His Marriage Plans

ఇక రష్మి గౌతమ్‌తో తన లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. జబర్దస్త్‌తో పాటు పలు కార్యక్రమాలలో పదే పదే రష్మి- సుధీర్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లుగా చూపించడంతో జనంలో ఈ జోడీకి విపరీతమైన క్రేజ్ దక్కింది. అలా సుధీర్ కెరీర్‌కు రష్మి గౌతమ్ ప్లస్‌గా మారారు. జబర్దస్త్‌లో చేస్తున్న సమయంలోనే సుధీర్‌కు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. హీరో ఫ్రెండ్‌గా, ఇతర చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చాడు సుధీర్. రేసుగుర్రం, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో మెరిశాడు. ఈ దశలో సుధీర్‌కు ఏకంగా సినిమాల్లో హీరోగా అవకాశం దక్కింది. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. తర్వాత త్రీమంకీస్, కాలింగ్ సహస్రా, గాలోడు వంటి సినిమాల్లో హీరోగా నటించి సత్తా చాటుకున్నాడు.

సినిమాలు, టీవీ షోలు, ఓటీటీలో కార్యక్రమాలు, యాంకరింగ్ ద్వారా నెలకు లక్షల్లో ఆర్జిస్తున్నాడు సుధీర్. కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్నప్పటికీ సుధీర్ పెళ్లి చేసుకోకపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు షాక్ అవుతున్నారు. రష్మి గౌతమ్‌తో పెళ్లి జరగాలని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు సుధీర్. మే 19న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో సుధీర్ సరసన బిగ్‌బాస్ ఫేమ్ ఆయేషా జీనత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిరామి, మురళీశర్మ, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువలు నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా సుడిగాలి సుధీర్ తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. అన్నా పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు అని అడిగాడు. దానికి సుధీర్ సమాధానం ఇస్తూ.. పుట్టినరోజు నాడు హ్యాపీగా ఉండే ప్రశ్నలు అడగాలి. హ్యాపీగా ఉండొద్దన్నా బాధ ఎప్పుడు పడతావు అన్నట్లుగా అడిగారు. పెళ్లి ప్రస్తుతానికి తెలియదు. కానీ జరిగితే మాత్రం త్వరలో నేనే అధికారికంగా అనౌన్స్ చేస్తానని సుధీర్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సుధీర్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. యాంకర్ రష్మిని పెళ్లి చేసుకుంటాడా? లేక ఎవరితోనైనా సుధీర్ రిలేషన్‌లో ఉన్నాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి పెళ్లిపై సుధీర్ హింట్ ఇవ్వడంతో త్వరలోనే తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read more about: sudigali sudheer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X