సుడిగాలి సుధీర్ భారీ మోసం.. సాక్ష్యాలతో బయటపెట్టిన మెగా డాటర్..
సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస టీవీ మరియు ఓటీటీ షోలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమవుతున్న 'ఆట' షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో నటి రాధిక, నిహారిక కొణిదెల, రఘు మాస్టర్ జడ్జీలుగా కొనసాగుతున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన కొత్త ఎపిసోడ్ ప్రోమో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ చేసిన మోసాన్ని సాక్ష్యాలతో బయటపెడుతూ మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆసక్తికరంగా ప్రశ్నలు వేయడం హైలైట్‌గా నిలిచింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇంతకీ సుధీర్ చేసిన తప్పులు ఏంటీ?
స్టేజ్‌పై నిహారిక ఆగ్రహం
తాజాగా విడుదలైన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో జరిగిన సరదా డ్రామా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రోమోలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక్కసారిగా స్టేజ్‌పైకి వచ్చి 'నా రక్తం తాగండి' అంటూ కోపంతో మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేతిలో కొన్ని బిల్లులు పట్టుకుని స్టేజ్‌పైకి రావడంతో ఏం జరిగిందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఈ సమయంలో హోస్ట్ సుడిగాలి సుధీర్ స్పందిస్తూ 'ఏంటండీ నిహారిక గారు ఇలా మాట్లాడుతున్నారు? మీ చేతిలో ఉన్నవి ఏంటి?' అని ప్రశ్నించాడు.

బిల్లులతో సుధీర్‌ను ఇరికించిన నిహారిక
దానికి సమాధానంగా నిహారిక మాట్లాడుతూ.. 'ఇవి మీ థ్రిల్‌కు వచ్చిన బిల్లులు... నా అకౌంట్‌కు పడ్డ చిల్లు. ఇవన్నీ మీరు పెట్టిన ఖర్చులే' అంటూ సుధీర్‌ను నిలదీశారు. అయితే సుధీర్ మాత్రం ఏమీ తెలియనట్టుగా నటిస్తూ 'ఇవి బిల్లులా? ఎవరు పెట్టారు? ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో ఎంత కోపరేటివ్‌గా ఉండాలో తెలియదా?' అంటూ పక్కనే ఉన్న వారిని ప్రశ్నించడం హైలైట్‌గా నిలిచింది.
అప్పుడు నిహారిక 'ఆ బిల్లులు పెట్టింది నువ్వే'అంటూ సుధీర్‌ను అడ్డంగా పట్టేసింది. ఒక్కొక్క బిల్లును చదువుతూ 'చెట్టులో వందమందికి భోజనాలు పెట్టించావా?' అని అడిగింది. దీనికి సుధీర్ సరదాగా 'ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి భోజనం పెట్టించా' అని చెప్పాడు. వెంటనే నిహారిక 'అయితే వాళ్లు సెట్‌లోకి ఎందుకు రాలేదు?' అని ప్రశ్నించగా, 'తిన్నాక తెలిసింది... వాళ్లు ఫ్యాన్స్ కాదు, భోజనం కోసం వచ్చినవాళ్లు'అని సుధీర్ చెప్పడంతో స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగింది.
కావ్య, వంశీ సమాధానాలు వైరల్
ఆ తర్వాత సీరియల్ నటి కావ్యను పిలిచి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ బిల్లును చదవడంతో ఆమె 'మేడం వద్దు మేడం'అంటూ తడబడింది. ఎందుకని అడగగా 'నా బ్యూటీ సీక్రెట్స్ బయటపడతాయి'అని చెప్పింది. దానికి నిహారిక 'ఇది బ్యూటీ కాదు... నా అకౌంట్‌కు మీరు చేసిన పెద్దలూటీ'అంటూ పంచ్ వేసింది.
ఇక డైరెక్టర్ వంశీని పిలిచి కరెంట్ బిల్లు గురించి అడగగా ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. 'మీరు పవర్ స్టార్ కూతురు కదా... పవర్ బిల్లు కట్టలేరా?' అంటూ చెప్పడంతో స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. తర్వాత సినిమా కోసం రెండు లక్షలు ఖర్చు పెట్టిన బిల్లుపై ప్రశ్నించగా, 'మన ఫ్రెండ్స్ అందరిని గోవాకు తీసుకెళ్లి సినిమా చూపించా' అని చెప్పడంతో నిహారిక షాక్ అయింది.
విష్ణుపై సుధీర్ సెటైర్
ఇంకా ఒక బిల్లులో బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం లక్ష రూపాయలు ఖర్చు చేశారని తెలిసి నిహారిక ఆశ్చర్యపోయింది. దానికి విష్ణు సరదాగా 'ఈ షో మొత్తం నా అందం మీదే నడుస్తోంది కదా'అని చెప్పింది. వెంటనే సుధీర్ 'లక్ష ఖర్చు పెట్టినా అలాగే ఉన్నావు కదా' అంటూ సెటైర్ వేయడంతో నవ్వులు పూశాయి. ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిహారిక, సుధీర్ మధ్య జరిగిన సరదా మాటల యుద్ధం, ఇతరుల ఫన్నీ సమాధానాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











