సుడిగాలి సుధీర్ కొత్త లవ్ ట్రాక్.. ఏకంగా పెళ్లైన యాంకర్‌తో ఆ పనికి రెడీ
ఏ భాషలో అయినా సినిమా హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ, తెలుగులో మాత్రం కొందరు బుల్లితెర నటులకు కూడా మంచి క్రేజ్ లభిస్తోంది. అలా సెన్సేషన్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. అన్ని విభాగాల్లోనూ తనదైన టాలెంట్లతో సత్తా చాటిన ఈ కుర్రాడు.. అనతి కాలంలోనే స్టార్‌గా మారిపోయాడు. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఓ టీవీ షోలో చేస్తున్నాడు. ఈ సందర్భంగా పెళ్లైన లేడీ యాంకర్‌తో అతడు ప్రవర్తించిన తీరు హైలైట్ అవుతోంది. అసలేం జరిగిందో మీరే చూడండి!
కమెడియన్ నుంచి స్టార్‌గా
మ్యాజిక్‌లు చేసుకుంటూ కెరీర్‌ను ఆరంభించిన సుడిగాలి సుధీర్.. జబర్ధస్త్ షోలోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే తనదైన కామెడీతో అలరించిన అతడు.. ఆ తర్వాత టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. దీనికితోడు యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. మొత్తానికి ఈ షో ద్వారా సుధీర్ స్టార్‌డమ్ అందుకుని సుదీర్ఘ కాలం ప్రభావాన్ని చూపించాడు.

మూవీల్లో.. హీరోగా ఎంట్రీ
బుల్లితెరపై తనదైన మార్కును చూపించిన సుడిగాలి సుధీర్.. ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రలను పోషించాడు. అదే సమయంలో హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవి అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. కానీ, 'గాలోడు'తో కెరీర్ బెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో మరింత జోష్‌తో దూసుకుపోతోన్నాడు.
ఆ సినిమాతో వస్తున్నాడు
'గాలోడు'తో హీరోగా సక్సెస్‌ను అందుకున్న సుడిగాలి సుధీర్ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇలా ఇటీవలే 'కాలింగ్ సహస్ర' అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఈ మూవీ అనుకున్న విధంగా ఆడలేదు. ఫలితంగా సుధీర్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఇక, ఇప్పుడు ఈ టాలెంటెడ్ గాయ్ 'GOAT' అనే సినిమాలో నటిస్తున్నాడు. అది త్వరలోనే విడుదల కాబోతుంది.

ఓటీటీ, టీవీలోకి రీఎంట్రీ
ఈ మధ్య కాలంలో సినిమాలపై మాత్రమే ఫోకస్ చేస్తూ టెలివిజన్ రంగానికి గ్యాప్ ఇచ్చిన సుడిగాలి సుధీర్.. ఇప్పుడు ఆహా ఓటీటీలో 'ఫ్యామిలీ స్టార్స్' అనే షోను హోస్ట్ చేస్తున్నాడు. దీనితో పాటు ఈటీవీలో 'ఫ్యామిలీ స్టార్స్' అనే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టేశాడు. వీటితో పాటు మరికొన్ని షోలను చేయడానికి సుడిగాలి సుధీర్ రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రియల్ జోడీలతో జాలీగా
సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతోన్న 'ఫ్యామిలీ స్టార్స్' షోను చేస్తున్నాడు. ఇందులో రాబోయే ఎపిసోడ్ కోసం బుల్లితెరపై ఫేమస్ అయిన సెలెబ్రిటీలు తమ జంటలతో కలిసి వచ్చారు. వీళ్లతో కలిసి సుడిగాలి సుధీర్ తనదైన రీతిలో సందడి చేశాడు. అంతేకాదు, పంచ్‌లు, సెటైర్లు వేస్తూ ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చేసింది.
స్రవంతితో క్రేజీ కామెంట్
'ఫ్యామిలీ స్టార్స్' తాజా ప్రోమోలో సుడిగాలి సుధీర్.. యాంకర్ స్రవంతితో ట్రాక్ మొదలుపెడుతున్నట్లుగా కామెంట్లు చేశాడు. 'నువ్వు ప్యాకప్ అయిన తర్వాత కలవవు', 'నేను చెప్పింది వినాలి' అంటూ నాటీగా మాట్లాడాడు. దీనికి స్రవంతి కూడా బాగానే ప్రతిస్పందించింది. దీంతో ఇప్పుడు వీళ్లిద్దరి ట్రాక్‌పై బుల్లితెర వర్గాల్లో జోరుగా కామెంట్లు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











