ఎన్టీఆర్, సుమలకు షాక్ ఇచ్చిన సుడిగాలి సుధీర్.. వాళ్ళని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో!

తెలుగు బుల్లితెర స్టార్స్ కి తెలుగు సినిమా హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరీ ముఖ్యంగా తెలుగు టెలివిజన్లో అలరించే వారిలో జబర్దస్త్ నటులు ముందుంటున్నారు. తాజాగా నాన్ ఫిక్షనల్ క్యారెక్టర్లు అంటే సీరియల్స్ లో పాత్రధారులు కాకుండా వివిధ షోలకు యాంకర్లుగా, హోస్టులుగా, జడ్జీలుగా వ్యవహరిస్తున్న వారి లిస్టులో సుడిగాలి సుధీర్ ఎన్టీఅర్, సుమాలను దాటి టాప్ ప్లేస్లో నిలిచాడు. ఆ వివరాల్లోకి వెలితే

ఒక ప్రముఖ మీడియా సంస్థ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ని బట్టి కొన్ని సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సర్వేలో సెప్టెంబర్ నెలలో టాప్ ఫైవ్ ని సెలెక్ట్ చేసింది. ఇక ఈ లిస్ట్ లో టాప్ ఫైవ్ లో ముందుగా సుదీర్ నిలవగా ఆ తర్వాతి స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు, తర్వాత సుమ, ఆ తర్వాత యాంకర్ ఓంకార్ తర్వాతి స్థానంలో హైపర్ ఆది నిలిచారు.

 సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్

ముందుగా టాప్ ప్లేస్ లో సుడిగాలి సుధీర్ నిలిచాడు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్ వెలుగులోకి వచ్చాడు. సుధీర్ మొదట్లో మెజీషియన్ గా అనేక చోట్ల షోలు చేస్తూ ఉండేవాడు. అనుకోకుండా జబర్దస్త్ లో అవకాశం రావడంతో తన టాలెంట్ నిరూపించుకుని ఒక పక్క జబర్దస్త్ లో టీం లీడర్ గా వ్యవహరిస్తూ మరో పక్క డీ లాంటి ప్రతిష్టాత్మక డ్యాన్స్ షోకి ఒక టీం మెంబర్ గా వ్యవహరిస్తూ, శ్రీ దేవి డ్రామా కంపెనీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఓఆర్ మాక్స్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఆయనకు మోస్ట్ పాపులర్ లిస్ట్ లో మొదటి స్థానం దక్కింది.

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్

ఇక ఈ లిస్ట్ లో రెండో స్థానం దక్కించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. సినిమాల్లో సత్తా చాటిన నందమూరి తారక రామారావు బుల్లితెర మీద కూడా సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఇప్పుడు ప్రసారం అవుతూ ఉండడంతో ఆయన కూడా ఈ లిస్టులో రెండో స్థానాన్ని సంపాదించారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు వరుసలో సుడిగాలి సుధీర్ ఉండడం ఆసక్తికరంగా మారింది..

 సుమ

సుమ

యాంకర్ సుమ టెలివిజన్ చరిత్రలో సుదీర్ఘ కాలం యాంకర్ గా కొనసాగుతున్న వ్యక్తులలో ఒకరు గా నిలిచిపోతారు. తనదైన టైమింగ్ లో తనదైన పంచులతో సుమ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక పక్క టెలివిజన్ షోలతో బిజీగా ఉంటూనే మరొక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఈవెంట్ లు కూడా చేస్తూ ఆమె రెండు చేతులా సంపాదిస్తూ ఉంటుంది. ఆమె ఈ లిస్టు లో క్యాష్ షో కారణంగా మూడవ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

ఓంకార్

ఓంకార్

ఇక యాంకర్ ఓంకార్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అనేక డాన్స్ షో లు అలాగే పిల్లలకు సంబంధించిన మాయాద్వీపం షో ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో దర్శకుడిగా మరికొన్ని సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం సిక్స్త్ సెన్స్ షో, కామెడీ చేస్తున్నాడు. అలాగే సూపర్ డాన్స్ అనే ఒక రియాలిటీ షో కూడా ఒక సీజన్ పూర్తయింది. ఇక ఈ లిస్ట్ లో ఆయనకు సిక్స్త్ సెన్స్ షో కారణంగా నాలుగో స్థానం లభించింది

Recommended Video

Sudigali Sudheer,Getup Srinu Comedy At Most Eligible Bachelor Wrop Up Party
 హైపర్ ఆది

హైపర్ ఆది

ఇక ఈ లిస్ట్ లో ఐదో స్థానం దక్కించుకున్నాడు హైపర్ ఆది. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆది నటన మీద మక్కువతో ఒక షార్ట్ ఫిలిం చేసి, అనతి కాలంలోనే ఒక జబర్దస్త్ టీం లీడర్ గా ఎదిగాడు. అలాగే డీ షోలో సుడిగాలి సుధీర్ తో పాటు ఒక మెంటర్ గా వ్యవహరిస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ లిస్టులో ఆయనకు ఐదో స్థానం జబర్దస్త్ కారణంగా లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X