For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో ఛానెల్‌లోకి సుడిగాలి సుధీర్: హాట్ బ్యూటీతో కలిసి రచ్చ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే!

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు టెలివిజన్ ఆల్‌రౌండర్ సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకున్న అతడు.. భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం పెంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సుధీర్.. ఈటీవీని వీడి మాటీవీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఒక్క షోకే పరిమితమైన అతడు.. చాలా రోజులుగా బుల్లితెరపై కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సుడిగాలి సుధీర్.. మరో ఛానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

   జబర్ధస్త్‌గా సుధీర్ ప్రయాణం

  జబర్ధస్త్‌గా సుధీర్ ప్రయాణం

  మ్యాజిక్‌లు చేసుకుంటూ కెరీర్‌ను మొదలు పెట్టిన సుధీర్.. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షోలోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ఆరంభంలోనే తనదైన శైలిలో మెప్పించిన అతడు.. ఆ తర్వాత కొద్ది రోజులకే టీమ్ లీడర్ అయిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్నాడు. అంతేకాదు, రష్మీతో లవ్ ట్రాక్‌తో మరింత పాపులర్ అయిపోయాడు.

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

   సినిమాల్లోనూ... హీరోగా బిజీ

  సినిమాల్లోనూ... హీరోగా బిజీ

  బుల్లితెరపై సుదీర్ఘమైన ప్రయాణంలో తనదైన టాలెంట్లతో సత్తా చాటుకున్న సుడిగాలి సుధీర్ సినిమాల్లోనూ రాణించాడు. ఈ క్రమంలోనే హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాల్లో నటించాడు. కానీ, ఇవి అతడికి హిట్‌ను మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు సుధీర్ 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' వంటి సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

  ఈటీవీని వదిలేసి అందులో

  ఈటీవీని వదిలేసి అందులో

  జబర్ధస్త్ షో ద్వారా ఈటీవీలోనే తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో కమెడియన్‌గా, హోస్టుగా ఎన్నో కార్యక్రమాలను, ఈవెంట్లను కూడా చేశాడు. అలాంటిది కొద్ది రోజుల క్రితమే ఈ ఛానెల్‌ నుంచి తప్పుకున్నాడు. అంతేకాదు, ఆ వెంటనే స్టార్ మాలోకి వెళ్లిపోయాడు. దీంతో సుడిగాలి సుధీర్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

  యాంకర్ రష్మీ హాట్ షో: పై భాగాలు కనిపించేలా అందాల ప్రదర్శన

  షో అవడంతో సుధీర్ మిస్

  షో అవడంతో సుధీర్ మిస్

  స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్‌కు.. అక్కడి వాళ్లు స్పెషల్ ఈవెంట్ ద్వారా ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అతడు 'సూపర్ సింగర్ జూనియర్' షోకు అతడు యాంకర్‌గా చేశాడు. అలాగే ఈ షోకు అనసూయ భరద్వాజ్ కూడా హోస్టుగా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ సీజన్ ముగిసిన తర్వాత సుడిగాలి సుధీర్ బుల్లితెరపై కనిపించకుండా వెళ్లిపోయాడు.

  జబర్ధస్త్ రీఎంట్రీ అంటూ

  జబర్ధస్త్ రీఎంట్రీ అంటూ

  'సూపర్ సింగర్ జూనియర్' సీజన్ పూర్తైన తర్వాత సుడిగాలి సుధీర్ స్టార్ మాలో ఏ షోలోనూ కనిపించలేదు. దీంతో అతడు జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అప్పటి జడ్జ్ రోజా ఇందుకు అతడికి సహాయం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ, దీనిపై సుధీర్ తరపు నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

  శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!

  మరో ఛానెల్‌లోకి సుధీర్

  చాలా రోజులుగా బుల్లితెరపై కనిపించకుండా వెళ్లిన సుడిగాలి సుధీర్.. ఇప్పుడు జీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహించబోతున్న 'జీ కుటుంబం అవార్డ్స్ - కిర్రాక్ పార్టీ' అనే ఈవెంట్‌ను అతడు హోస్ట్ చేయబోతున్నాడు. సుధీర్‌తో పాటు ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖి కూడా సందడి చేస్తుంది. ఈ ప్రోమో తాజాగా వచ్చింది.

  భారీగానే తీసుకున్నాడు

  భారీగానే తీసుకున్నాడు

  సుడిగాలి సుధీర్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా లేకున్నా అతడి డిమాండ్ మాత్రం ఎప్పటికీ తగ్గదనే చెప్పాలి. అందుకే ఇప్పుడు జీ తెలుగులో రాబోయే ఈవెంట్‌కు కూడా ఈ స్టార్ కమెడియన్ కమ్ యాంకర్ భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడట. అంతేకాదు, శ్రీముఖి కంటే అతడు డబుల్‌ చార్జ్ చేశాడని అంటున్నారు. మొత్తానికి సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు.

  English summary
  Telugu Actor and Comedian Sudigali Sudheer Recently Entered into Star Maa. Now He Hosts Zee Telugu Kutubam Awards 2022.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X