For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెచ్చిపోయిన సుడిగాలి సుధీర్: రష్మీ, దీపికతో అసభ్య ప్రవర్తన!

  |

  తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలతో సమానంగా పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ టాలెంటెడ్ బాయ్ సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ షో ద్వారా పరిచయమైన ఈ కుర్రాడు.. అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఫేమస్ అయిపోయాడు. తద్వారా యూత్‌లో క్రేజ్‌ను సంపాదించడంతో పాటు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో రష్మీ, దీపికను బలవంతంగా హగ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే...

   బుల్లితెర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

  బుల్లితెర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

  మెజీషియన్‌గా సుడిగాలి సుధీర్ తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. ఇలా చాలా కాలం పాటు తన మ్యాజిక్‌లతో కొన్ని షోలు కూడా చేశాడు. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి బెస్ట్ కమెడియన్‌గా పేరొందాడు. అంతేకాదు, యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపును అందుకున్నాడు. అలాగే, సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా సత్తా చాటుతున్నాడు.

  రష్మీ ట్రాకుతో మరింత పాపులర్

  రష్మీ ట్రాకుతో మరింత పాపులర్

  ఎన్నో టాలెంట్లు ఉన్న సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. దీనికి అతడికి తెలిసిన విద్యలే కాదు.. యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలు కూడా కారణమని చెప్పొచ్చు. ఆమెను ప్రేమిస్తున్నాడని.. పెళ్లి చేసుకోబోతున్నాడని వచ్చిన పుకార్లు సుధీర్‌ను ఫేమస్ చేశాయి. వీళ్ల బంధం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది.

  అలాంటి పాత్రలు.. ప్లేబాయ్‌ పేరు

  అలాంటి పాత్రలు.. ప్లేబాయ్‌ పేరు

  జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ రష్మీతో మాత్రమే కాదు.. పలువురు యాంకర్లతోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే జబర్ధస్త్ స్కిట్లలో అతడిని అమ్మాయిలా పిచ్చోడిలా చూపిస్తున్నారు. దీంతో సుడిగాలి సుధీర్ అంటే ప్లేబాయ్ అనేలా ఫేమస్ అయ్యాడు. వీటి వల్ల అతడిపై చెడు ముద్ర కూడా పడుతోన్న విషయం తెలిసిందే.

   అందులో వాళ్లతో కలిసి సందడి

  అందులో వాళ్లతో కలిసి సందడి

  సుడిగాలి సుధీర్ ప్రస్తుతం పలు షోలలో పని చేస్తున్నాడు. అందులో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ' కూడా ఒకటి. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అనే పేరిట వస్తున్న 13వ సీజన్‌లో హైపర్ ఆదితో కలిసి కింగ్స్ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే, క్వీన్స్ టీమ్‌లో రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా ఉన్నారు. వీళ్లతో కలిసి సుడిగాలి సుధీర్ తెగ సందడి చేస్తూ కామెడీని పంచుతున్నాడు.

   రెచ్చిపోయిన యంగ్ కమెడియన్

  రెచ్చిపోయిన యంగ్ కమెడియన్

  వచ్చే బుధవారం ప్రసారం కానున్న ‘ఢీ' షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో హైపర్ ఆదితో కలిసి సుడిగాలి సుధీర్ తనదైన శైలి కామెడీతో రచ్చ చేశాడు. అదే సమయంలో ఓ ప్రేమలేఖను కూడా రాశాడు. దీన్ని యాంకర్ ప్రదీప్ చదివి వినిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే లేడీ మెంటర్లు రష్మీ గౌతమ్, దీపిక పిల్లితో కలిసి సుడిగాలి సుధీర్ రెచ్చిపోయాడు.

  ఇద్దరినీ బలవంతంగా లాగేశాడు

  ఈ ప్రోమో ప్రారంభంలో సుడిగాలి సుధీర్.. యాంకర్ రష్మీ గౌతమ్, దీపిక పిల్లిని బలవంతగా హగ్ చేసుకున్నట్లు చూపించారు. ఈ ఘటనతో ఆ అమ్మాయిలిద్దరూ షాక్ అయిన దృశ్యాలు కనిపించాయి. అలాగే, పక్కనే ఉన్న హైపర్ ఆది.. జడ్జ్‌లు పూర్ణ, ప్రియమణి, గణేష్ మాస్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Jabardasth Comedian, Tollywood Actor Sudigali Sudheer Huged Anchor Rashmi Gautam and Deepika Pilli in DHEE 13 - Kings vs Queens Show. This Promo Video Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X