Just In
- 19 min ago
స్టేజ్ మీదే వెంకీకి ఐ లవ్యూ చెప్పేసింది.. ఇంత త్వరగా అది జరగింది.. పాయల్ కామెంట్స్
- 24 min ago
ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్.. వెంకీమామ హంగామా మామూలుగా లేదండోయ్
- 47 min ago
అలా సైరాలో పవన్ కళ్యాణ్ మిస్.. పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్
- 1 hr ago
వెంకటేష్, నాగచైతన్యలకు ధీటుగా మాస్ మహారాజ్.. పోటీ పడి మరీ!
Don't Miss!
- News
Krishna: కృష్ణా పోలీసుల సాహసం: నదిలో దూకిన యువతిని కాపాడిన వైనం
- Finance
భారత ఐటీ నిపుణులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి హెచ్1బీ వీసాల స్వీకరణ
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- Sports
కేరళ అభిమానుల ఆందోళన.. రెండో టీ20లో శాంసన్‌కు చోటివ్వరా!!
- Technology
ఫిక్సల్ ఫోన్లకు Google Recorder App సపోర్ట్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఫేమస్ షోకు జడ్జ్‌గా సుడిగాలి సుధీర్.. వాళ్లను మామూలుగా ఆడుకోలేదు.. యాంకర్ రవి వల్లే!
సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. ప్రముఖ చానెల్లో ప్రసారమయ్యే 'జబర్ధస్త్' షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. యాంకర్ రష్మీతో స్క్రిప్టెడ్ లవ్ ట్రాక్‌తో అతడు మరింత పాపులర్ అయ్యాడు. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని జనాల్లో అనుమానాలు వ్యక్తం అయినప్పటి నుంచి సుధీర్‌కు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే వరుసగా షోలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అంతేకాదు, ఇటీవలే హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే, తాజాగా సుధీర్ ఓ పాపులర్ షోలో జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఇంతకీ ఏంటా షో..? సుధీర్ ఎందుకిలా చేశాడు..? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఈ షో ఎంతో ఫేమస్
బుల్లితెర చరిత్రలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతున్న ‘ఢీ'. ఇప్పటికి పదకొండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందీ షో. మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. ‘ఢీ' ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందుకే ఈ షో అంత పాపులర్ అయింది.

ఈ మధ్య మరొకటి మొదలైంది
ఇప్పటికే పదకొండు సీజన్లు పూర్తి చేసుకున్న ‘ఢీ' షో.. పన్నెండో సీజన్‌ను కూడా ప్రారంభించింది. ‘ఢీ చాంపియన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్లో.. గతంలో ఈ షో ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్స్, కొందరు ఛాంపియన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతోంది. అందుకే గతంలో ఉన్న ఫ్యాన్స్ కంటే ఈ సీజన్‌కు మరింత మంది అభిమానులు వచ్చి చేరుతున్నారు.

ప్రదీప్ వెళ్లాడు.. వాళ్లు వచ్చారు
‘ఢీ' అంటే డ్యాన్స్ షో అనుకుంటే పొరపాటే. ఈ రియాలిటీ షోలో యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, రష్మీ సహా జడ్జులు అందరూ కలిసి స్టేజ్‌పై నవ్వులు పూయిస్తుంటారు. అందుకే ఇది ఆల్‌రౌండ్ షో అయిపోయింది. ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. అయితే, ఇటీవల అతడు ఈ షోకు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో మరో యాంకర్ రవి, వర్షిణి షోలోకి ఎంటర్ అయ్యారు.

రష్మీ చేసిన పనితో సుధీర్ బుక్
ఇక, బుధవారం జరిగిన ఎపిసోడ్లో అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ రౌండ్లో సుధీర్ టీమ్ ఓడిపోయింది. దీంతో మరో టీమ్ లీడర్ అయిన రష్మీ.. అతడికి టాస్క్ ఇవ్వాలి. కానీ, రవి సుధీర్‌కు టాస్క్ ఇచ్చాడు. ‘నేను, వర్షిణి డ్యాన్స్ కంటెస్టెంట్లుగా పర్ఫార్మ్ చేస్తాం.. రష్మీ యాంకరింగ్ చేస్తుంది.. నువ్వు ముగ్గురు జడ్జ్‌లైన శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ గారిని ఇమిటేట్ చేయాలి' అని చెబుతాడు.

మామూలుగా ఆడుకోలేదు
రవి ఇచ్చిన టాస్క్ కారణంగా సుధీర్ జడ్జ్‌ల కుర్చీలో కూర్చున్నాడు. వర్షిణి, రవి డ్యాన్స్ చేయడం.. వాళ్లకు ముగ్గురు జడ్జ్ల్లాగ జడ్జ్మెంట్ ఇవ్వడం చేశాడు. ముందుగా శేఖర్ మాస్టర్‌ను అచ్చు గుద్దినట్లు దింపేసిన సుధీర్.. ఆ తర్వాత ప్రియమణి, పూర్ణలను మాత్రం ఆడుకున్నాడు. వీళ్లిద్దరూ బ్రేక్ సమయాల్లో ఏం చేస్తారో అన్నది సుధీర్ చూపించాడు. దీంతో ఈ టాస్క్ మొత్తం నవ్వులు వెల్లి విరిశాయి. దీంతో ఈ ఎపిసోడ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది.

సుధీర్ తొలి ప్రయత్నం
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్'. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త కే శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల తెరకెక్కించాడు. ఇందులో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ నటిస్తోంది. ఈమె చేస్తున్న పాత్రకు ముందు రష్మీని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సుధీర్ సంప్రదించాడట. అయితే, ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా ఈ ప్రపోజల్‌ను తిరస్కరించిందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.