ఆమెను ఐదేళ్లు ప్రేమించాను.. లెటర్ కూడా రాశా.. రష్మీ కనెక్ట్ అయింది: సీక్రెట్ చెప్పిన సుధీర్

By Manoj

సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో ఒకడు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ టాలెంటెడ్ యాక్టర్.. బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒక పక్క టీవీ షోలు చేస్తూ.. మరోవైపు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే, కొన్ని సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సుధీర్ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేశాడు.

సాఫ్ట్‌వేర్‌గా మారిన జబర్ధస్త్ కమెడియన్

సుడిగాలి సుధీర్‌గా ఫేమస్ అయిన ఈ యంగ్ కమెడియన్.. హీరోగా నటించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్'. శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై పారిశ్రామికవేత్త కే శేఖర్‌ రాజు నిర్మించిన ఈ సినిమాను రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల తెరకెక్కించాడు. ఇందులో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Recommended Video

#CineBox : Ileana D'Cruz Missed Out 2 Golden Chances With Salman Khan In These Two Films !
ఐదేళ్లు ప్రేమించా.. లెటర్ కూడా రాసిచ్చా

ఐదేళ్లు ప్రేమించా.. లెటర్ కూడా రాసిచ్చా

హీరో అవుతున్న నేపథ్యంలో సుడిగాలి సుధీర్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రముఖ కమెడియన్ అలీ షోకు గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా కొన్ని రహస్యాలు చెప్పాడు. ‘నేను ఐదేళ్లు ఒక అమ్మాయిని ప్రేమించా. ఒకసారి లెటర్ కూడా రాసిచ్చాను. అప్పుడు ఆమె పడిపోయింది' అని అతడు తెలిపాడు. ఈ ప్రోమో తాజాగా విడుదలైంది.

దీపిక, ప్రియాంక వద్దు రష్మీనే కావాలి

దీపిక, ప్రియాంక వద్దు రష్మీనే కావాలి

ఇదే షోలో.. దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రాలో ఎవరిని హగ్ చేసుకుంటావు అని అలీ.. సుధీర్‌ను చిలిపిగా ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా అతడు ‘నేను వాళ్లిద్దరినీ హగ్ చేసుకోను. నన్ను ఎవరైతే అడుగుతారో వాళ్లను రష్మీ లేదా అని అడుగుతాను' అని చెప్పాడు. దీంతో అక్కడున్న వారందరూ రష్మీ, సుధీర్ అంటూ కేకలు పెట్టారు.

రష్మీ నాకు అలా కనెక్ట్ అయింది

రష్మీ నాకు అలా కనెక్ట్ అయింది

ఈ షోలో అలీ.. సుధీర్‌ను రష్మీకి సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగాడు. మీ ఇద్దరి మధ్య ఏముంది అని అడిగిన ప్రశ్నకు.. ‘ఏడేళ్ల నుంచి మా గురించి అనుకుంటున్నారు. జబర్ధస్త్‌లో ఆమె మీద పంచులు వేయడం.. తర్వాత ‘ఢీ'లో కంటిన్యూ అవడంతో మా ఇద్దరి మధ్య ఏదో ఉందనేది అందరికీ కనెక్ట్ అయిపోయింది' అని సుధీర్ సమాధానం ఇచ్చాడు.

రష్మీ వల్లే పెళ్లి కావట్లేదంటూ కామెంట్

రష్మీ వల్లే పెళ్లి కావట్లేదంటూ కామెంట్

గతంలో ఓ ఇంటర్వ్యూలో సుధీర్ తనకు రష్మీ వల్లే పెళ్లి కావడం లేదని చెప్పి బాంబు పేల్చాడు. ‘రష్మీతో లవ్ అని వార్తలు వస్తున్నాయి. మా మధ్య అటువంటిది ఏమీ లేదు. వాస్తవానికి ఈ పుకార్ల వల్ల నాకు పెళ్లి కూడా అవడం లేదు. నిజానికి రష్మీ నాకు మంచి ఫ్రెండ్. స్కిట్లు పండడానికి, అందరినీ నవ్వించడానికి మా మధ్య ఏదో ఉందని రాస్తుంటారు' అని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X