నిహారికతో సుడిగాలి సుధీర్ పులిహోర.. దెబ్బకు అడ్రస్ కూడా చెప్పిన సెన్సేషనల్ బ్యూటీ

జబర్దస్త్ కామెడీ షోతో మొదలైన తన కెరీయర్ ను ప్రారంభించిన సుడిగాలి సుధీర్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. తన టాలెంట్ తో టెలివిజన్ రంగంలో స్టార్ గా ఎదిగారు. జబర్దస్త్ తో కొన్నేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. మరోవైపు హీరోగా కూడా వెండితెరపైన మెరిసి మాస్ ఆడియెన్స్ ను మెప్పించగలిగారు. ఇక ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినప్పటికీ బుల్లితెరపై తెగ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో సర్కార్ సీజన్ 5 గేమ్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎన్ఎంతో సుడిగాలి సుధీర్ కన్వర్జేషన్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా సెన్సేషన్ గా..
2016లో సోషల్ మీడియాలో అడుగు పెట్టిన నిహారిక ఎన్ఎం అతి తక్కువ సమయంలో సంచలనంగా మారింది. ఇండియన్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. డిఫరెంట్ పర్సనాలిటీస్, సెలబ్రెటీస్, సోషల్ ఇష్యూస్ పై తనదైన శైలిలో వీడియోలు క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంది. టైప్స్ అనే సిరీస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆమె యూట్యూబ్ క్రియేటర్స్ గ్లోబల్ అంబాసిడర్ గా ఎంపికవడం విశేషం. సోషల్ అవేర్ నెస్ కలిగించేందుకు ప్రస్తుతం పని చేస్తోంది. ఇక 2022లో వరల్డ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ అండ్ బ్లాగర్స్ అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. ఇమే 1997లో చెన్నైలో జన్మించింది.

Sudigali Sudheer Interesting Converstion with Niharika NM

సర్కార్ 5 ఎపిసోడ్ 8లో..
సర్కార్ టీవీ గేమ్ షో ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తోంది. 2021లో ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రారంభమైంది. ప్రస్తుతం 5వ సీజన్ కొనసాగుతోంది. సర్కార్ సీజన్ 1, సర్కార్ సీజన్ 2, సర్కార్ సీజన్ 3 వరకు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించారు. సర్కార్ సీజన్ 4 నుంచి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సర్కార్ సీజన్ 5 సీజన్ ను కూడా సుధీరే నడిపిస్తున్నారు. కాగా సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ 8కి సంబంధించిన ఎపిసోడ్ తాజాగా విడుదలైంది.

ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. సీజన్ 5లో ఇప్పటి వరకు వచ్చిన 7 ఎపిసోడ్స్ కంటే 8వ ఎపిసోడ్ ఫన్ ఫిల్డ్ గా ఉంది. గెస్ట్ లు నిహారిక కొణిదెల, నవీదీప్, రితికతో పాటు ఇండియాస్ టాప్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎన్ఎం కూడా హాజరయ్యారు. ఇక సుడిగాలి సుధీర్ నిహారికతో మాట్లాడిన తీరు ఆకట్టుకుంటోంది. సుడిగా గాలి సుధీర్ కు ఆమె ఇచ్చిన కౌంటర్స్ కూడా నవ్వులు పూయించాయి. ఇక సుధీర్ కాస్తా అత్యుత్సాహంతో మీది ముంబైనా, చైన్నైయా అని అడిగితే.. వైజాగ్ అని బదులిస్తుంది. వైజాగ్ లో ఎక్కడ అంటూ సుడిగాలి సుధీర్ ఆరా తీయడం ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ ఎపిసోడ్ లో నిహారిక అట్రాక్షన్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X