రష్మీ ఎప్పటికీ నా గుండెల్లోనే.. అసలు విషయం చెప్పేస్తూ సుధీర్ ఎమోషనల్!
బుల్లితెరపై యాంకర్ రష్మీ సుధీర్ గిల్లికజ్జాలు గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అనసూయ ఎప్పుడైతే జబర్దస్త్‌ను వీడి బయటకు వెళ్లిందో అప్పుడు రష్మీ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇంటర్ ఇచ్చిన కొన్నాళ్ళకు సుధీర్‌ల కథ తెరపైకి వచ్చింది. మొదట్లో ఏమీ లేదు కాదు మెల్లిమెల్లిగా టీఆర్పీ కోసం మొదలైన ఈ ట్రాక్ మొత్తంగా షోను పైకి లేపిందని చెప్పాలి. అయితే వీరు ఇప్పుడు వేర్వేరు చానెళ్లకు షోలు చేస్తున్నారు. ఈ క్రమంలో సుధీర్ తాజాగా రష్మీ గుర్నిచ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రష్మిని ఇన్వాల్వ్ చేస్తూ
ఒకానొక సమయంలో జబర్దస్త్ అంటే రష్మీ- సుధీర్.. రష్మీ సుధీర్ అంటే జబర్దస్త్ అనేలా వీరిద్దరి ప్రేమ వ్యవహారం హైలైట్ అయింది. ఈ ఇద్దరి క్రేజ్ అలా ఉండడం వలన వరుసగా స్పెషల్ ఈవెంట్‌లలో కూడా వీరినే హైలెట్ చేసేవారు. దీంతో రష్మీ సుధీర్ మధ్య లవ్ ట్రాక్ అంటూ కొన్నేళ్లుగా సోషల్ మీడియా ఊదరగొట్టింది. సుధీర్ జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు రష్మిని ఇన్వాల్వ్ చేస్తూ చేసే స్కిట్లు బాగానే పేలేవి.

వార్తలు ఆగవు
అలా కొన్ని సంవత్సరాలుగా వీరి స్కిట్లు, వీరి కెమిస్ట్రీ వర్కవుట్ అవుతూనే ఉంది. సుధీర్ జబర్దస్త్ లోనే ఉంటె అది ఇంకా ఉందేమో కానీ సుధీర్ ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాడు. అయితే తమ మధ్య ఉన్న సంబంధం గురించి రష్మీ, సుధీర్ గురించి ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ప్రేమ లేదని, తాము ఏది చేసినా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకే అని చెప్పుకొచ్చారు. తెరపై మాత్రమే అలా మేం నటిస్తాం.. కానీ నిజ జీవితంలో మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా వారి గురించి వార్తలు ఆగవు.

ప్రత్యేక అతిథులు
ఈ టీవికి పూర్తిగా దూరమైన సుడిగాలి సుధీర్ స్టార్ మా, జీ తెలుగు వంటి ఛానల్స్ లో సందడి చేస్తున్నారు. ఇక తాజాగా జీ తెలుగులో ఫాదర్స్ డే సందర్భంగా దిల్ సే షోను ప్రత్యేకంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ కి పక్కా కమర్షియల్ నుంచి గోపీచంద్, రష్మీ ఖన్నా, డైరెక్టర్ మారుతి అలాగే రాజీవ్ కనకాల, సింగర్ శైలజ, ఆమె భర్త శుభలేఖ సుధాకర్ చాలా మంది ప్రత్యేక అతిథులు వచ్చారు.

పిన్ని ఏది బాబాయ్
తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే చాలా సందడిగా ప్లాన్ చేసినట్లు క్లారిటీ వచ్చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ కి సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కూడా వేదికపైకి వచ్చారు. అలా వచ్చిన వాళ్లలో ఏడేళ్ల ఓ బుడతడు సుధీర్ ని బాబాయ్ అంటూ సంబోధించాడు. సుధీర్ కు చిన్న గిఫ్ట్ ఇచ్చిన ఆ బుడతడు రష్మీ పిన్ని ఏది బాబాయ్ అని అమాయకంగా అడిగాడు.

సోషల్ మీడియాలో వైరల్
ఆ ప్రశ్నకు సుధీర్ ఎమోషనల్ అవుతూ సమాధానం చెప్పాడు. రష్మీ నా గుండెల్లో ఉంటుంది నాన్నా బయటకు కనిపించదు అని చెప్పుకొచ్చారు. రష్మీ గురించి సుధీర్ చెప్పిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











