For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sridevi Drama Company: ఇక మీదట సుధీర్ 'బావ' అంటూ షాకిచ్చిన శ్రీముఖి, వర్షని కిడ్నాప్ చేసిన బాబు!

  |

  ఈటీవీలో మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్‌ వారి 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కామెడీ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోకి హైప్ తీసుకురావడంతో కోసం జబర్దస్త్ బ్యాచ్ తో పాటు, డీ డ్యాన్సర్స్ ను కూడా రంగంలోకి దించింది. ఎప్పుడు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లతో ఈ ఎపిసోడ్స్ లాగిచ్చేస్తోంది. సుడిగాలి సుధీర్‌ చేసిన ఎపిసోడ్ కి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో సుధీర్ నే హోస్ట్ గా కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో పలు పలు ఆసక్తికర అంశాలు కనిపించాయి. ఆ వివరాల్లోకి వెళితే

  సరికొత్త థీమ్ తో

  సరికొత్త థీమ్ తో


  నిజానికి శ్రీదేవి డ్రామా కంపెనీ నీ అనే ఈ కామెడీ షో లో ప్రతి వారం ఒక సరికొత్త థీమ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. ఎపిసోడ్ చేసే సమయానికి ఏ ఆర్టిస్ట్ ఖాళీగా ఉంటే ఆ ఆర్టిస్టు చేత కామెడీ చేయిస్తూ సందడి చేస్తున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు ఢీ షోలో సందడి చేస్తున్న దీపికా పిల్లి, రష్మి, భాను లాంటి వాళ్లను కూడా అవసరమైనప్పుడు వాడేస్తున్నారు. తాజా ప్రోమో ప్రకారం ఈ షోలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది.

  వర్షం కురిపిస్తామని నమ్మించి

  వర్షం కురిపిస్తామని నమ్మించి


  ఎప్పటిలాగే ఈవెంట్స్ కోసం వెతుక్కుంటూ ఉండగా ఒక ఊరి వాళ్లు వర్షాలు కురిపించాలని అంటే ఏం చేయాలి అని సుధీర్ అండ్ కో ని అడుగుతారు. శ్రీదేవి డ్రామా కంపెనీతో ఒక ఈవెంట్ చేయిస్తే వర్షాలు కురుస్తాయని సుధీర్ అండ్ కో వాళ్ళని నమ్మిస్తారు. ఆ ఊరి వాళ్ళు అది నిజమేనని ఈవెంట్ ఇవ్వడంతో అక్కడ ఈవెంట్ చేయాడానికి సుధీర్ అండ్ కో వెళతారు.

  మీ అందరికీ ఇక బావ

  మీ అందరికీ ఇక బావ


  ఇక ఈ ఎపిసోడ్లో శ్రీముఖి ఒసేయ్ రాములమ్మ పాటతో ఎంట్రీ ఇచ్చింది. తనదైన జోష్ తో డాన్స్ వేసి అందరినీ అలరించింది. ఇక సుధీర్ ని ఉద్దేశించి ఆయన ఇక మీదట మీ అందరికీ బావ అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో సుధీర్ ముందు నేను మీకు బావ ఏంటండీ అని కాస్త సిగ్గు పడినట్లు అనిపించినా తర్వాత ఆమెతో కలిసి కాలు కదిపారు..

  వర్ష కిడ్నాప్

  వర్ష కిడ్నాప్

  ఇక ఈ వారం ప్రోమోలో ఎప్పటి లాగా ఇమ్మానియేల్, వర్ష మధ్య ఎక్కువగా ఎలాంటి ట్రాక్ చూపించలేదు. కానీ వర్షని బాబు అలాగే మరికొందరు కలిసి కిడ్నాప్ చేయించినట్లుగా ప్రోమో చూపించారు. ఇక ఎప్పుడు ఇలాగే నరేష్ తన బాడీగార్డ్ కామెడీతో కాసేపు ఆకట్టుకున్నాడు. అలాగే డీ నుంచి బున్నీ మాస్టర్ తదితరులు తమ డ్యాన్స్ లతో అలరించారు.

  Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu

  స్పెషల్ అట్రాక్షన్ గా పవన్


  షో మొత్తం మీద ప్రత్యేక ఆకర్షణగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ స్కెచ్ నిలిచింది.. పవన్ కళ్యాణ్ అచ్చం వకీల్ సాబ్ లో ఉన్నట్లు గానే ఒక ఆర్టిస్ట్ స్కెచ్ వేసి చూపించారు. ఇక అలాగే శ్రీముఖి స్కెచ్ వేసి చూపించమని సుధీర్ ని అడగగా మరో చిత్రం వ్యంగ్యంగా చూపి గీసి చూపిస్తాడు సుధీర్. అలా మొత్తం మీద ఈ వారాంతంలో విడుదల కాబోయే ఈ ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  Sridevi Drama Company is a comedy show planned by etv. in the latest promo sreemukhi says sudigali sudheer is her bava. The latest promo contains some more comedy by jabardasth artists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X