'నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో..' సుధీర్-కావ్య కెమిస్ట్రీ మామూలు కాదు...

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ మంచి రేటింగ్స్ సాధిస్తున్న షో 'సర్కార్'. ఈ షో మరోసారి సరికొత్త ఎపిసోడ్‌తో ముందుకొస్తోంది. తాజాగా సర్కార్ సీజన్ 6 (Sarkaar Season 6) తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో సుడిగాలి సుధీర్ - కావ్య శ్రీ మధ్య కనిపించిన కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గత సీజన్‌లో కావ్యశ్రీ పాల్గొన్న ఎపిసోడ్‌కు మంచి స్పందన రావడంతో, ఈసారి కూడా ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఈ ఎపిసోడ్‌లో కావ్యతో పాటు ప్రేరణ, తేజస్వీని గౌడ, అలాగే యాంకర్ నిఖిల్ కూడా పాల్గొని సందడి చేశారు. అయితే అందరి దృష్టి మాత్రం సుధీర్-కావ్య జంటపైనే. ప్రోమో ప్రారంభం నుంచే చాలా ఫన్నీగా సాగింది. 'హైర హైర హైరబ్బా' పాటకు సుధీర్, కావ్య కలిసి చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను అలరిస్తోంది. డ్యాన్స్‌తో మొదలైన ఈ ఎపిసోడ్‌లో, తర్వాతి సన్నివేశాలు మరింత ఎంటర్‌టైనింగ్‌గా మారాయి. సుధీర్ తన స్టైల్‌లో సరదాగా మాట్లాడుతూ, 'హోస్టింగ్ లైట్‌గా చేసినా సరిపోతుంది... మిగతా టిప్స్ అన్నీ ఇంట్లో నేనే ట్రైన్ చేస్తా' అని చెప్పడం, దానికి కావ్య సిగ్గుపడటం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశంగా మారింది.

Star actress Trisha s Chennai home targeted in bomb threat police launch investigation

ఇక ఈ ప్రోమోలో ప్రధాన హైలైట్‌గా నిలిచింది సుధీర్-కావ్య మధ్య జరిగిన సరదా సంభాషణలు. 'మన్మథుడు భూమికొస్తే స్వయానా అవుతాడు సుధీర్ బయానా' అంటూ కావ్య చెప్పగా, వెంటనే సుధీర్ తనదైన స్టైల్‌లో 'అవుతాడు కాదు అయ్యాడు ఆల్రెడీ... మన్మథుడు అన్నిచోట్లా ఉండలేక నన్ను పుట్టించాడు' అంటూ పంచ్ డైలాగ్‌తో నవ్వులు పూయించాడు. ఈ సంభాషణలతో ఇద్దరి మధ్య ఉన్న ఫన్ బాండింగ్ స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక గేమ్ సెగ్మెంట్స్‌లో కూడా వీరి కెమిస్ట్రీ మరింత బాగా హైలైట్ అయింది. 'క్లూ అడగండి' అని సుధీర్ చెప్పగానే, 'సుధీర్ గారు క్లూ ప్లీజ్' అంటూ కావ్య క్యూట్‌గా అడగడం... దానికి సుధీర్ ఫ్లాట్ అవడం ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇదే సమయంలో ఇతర గెస్ట్‌లతో కూడిన సరదా క్షణాలు కూడా ప్రోమోలో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తేజస్విని గౌడ ఇచ్చిన కౌంటర్లు, కావ్య ఇచ్చిన సరదా రిప్లైలు ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

ప్రోమో చివర్లో వచ్చిన సీన్ అయితే మరింత ఆసక్తిని రేకెత్తించింది. 'మీకు ఇష్టమైన సినిమా డైలాగ్ చెప్పండి' అని సుధీర్ అడగగా, కావ్య చెప్పిన డైలాగ్ అందరినీ షాక్‌కు గురి చేసింది. 'నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు.. కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతాను' అంటూ సుధీర్ గతంలో చెప్పిన డైలాగ్‌ను రిపీట్ చేయడం ఈ ఎపిసోడ్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ సీన్‌తో సుధీర్ కూడా ఆశ్చర్యానికి గురైనట్లు ప్రోమోలో కనిపించింది.

ఇటీవల కాలంలో సుధీర్‌తో వివిధ షోలలో కనిపిస్తున్న కావ్యశ్రీ, తన ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒకవైపు డ్యాన్స్ షోలలో మెంటార్‌గా వ్యవహరిస్తూనే, మరోవైపు టాక్ షోలలో కూడా తన చురుకుదనాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో సుధీర్‌తో ఆమె కెమిస్ట్రీపై సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 'ఈ జంట బాగుంది', 'ఇద్దరి మధ్య మంచి కనెక్షన్ ఉంది' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మరోవైపు, గతంలో నిఖిల్ మలియక్కల్ తో ఉన్న సంబంధం ముగిసిన తర్వాత కావ్య తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వరుస షోలతో బిజీగా ఉంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ మార్పు కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇలా 'సర్కార్ సీజన్ 6' తాజా ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ముఖ్యంగా సుధీర్-కావ్య మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఫన్ మూమెంట్స్, డైలాగ్స్ అన్ని ఈ ఎపిసోడ్ హైలెట్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X