షాకింగ్: జబర్ధస్త్‌కు సుడిగాలి సుధీర్ దూరం.. ఆ ఫోన్ కాల్ వల్లే ఈ కఠిన నిర్ణయం.!
బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులుకే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయాడు ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ యంగ్‌స్టర్... తక్కువ వ్యవధిలోనే అద్భుతమైన టాలెంట్‌తో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్‌కు సుధీర్ దూరం అయ్యాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

భారీ సుడిగాలిలా చెలరేగిపోయిన సుధీర్
చాలా కాలం కిందట జబర్ధస్త్ అనే కామెడీ షోలోకి ఎంటర్ అయ్యాడు సుధీర్. వేణు వండర్స్ టీమ్ ద్వారా తెలుగు వారికి పరిచయమైన అతడు.. తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకుని టీమ్ లీడర్ అయిపోయాడు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను దక్కించుకున్నాడు. మరీ ముఖ్యంగా యూత్‌లో భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

సుడిగాలి సుధీర్... బుల్లితెర ఆల్‌రౌండర్
జబర్ధస్త్ ద్వారా కమెడియన్‌గా పరిచయమైన సుధీర్.. ఎన్నో విద్యలతో బుల్లితెర ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నాడు. వాస్తవానికి జబర్ధస్త్‌కు రాకముందు నుంచే మ్యాజిక్‌లు చేయడంలో ఆరితేరిపోయిన అతడు.. ఫేమస్ అయిన తర్వాత మరిన్ని విద్యలు చూపించాడు. కామెడీ, మ్యాజిక్‌లతో పాటు పాటలు పాడతూ, డ్యాన్స్‌లు చేస్తూ అదరగొడుతున్నాడు.

యాంకర్ రష్మీతో ప్రేమాయణం.. వివాహం
సుడిగాలి సుధీర్.. యాంకర్ రష్మీతో ప్రేమాయణం నడుపుతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. వాటిని అటు రష్మీ.. ఇటు సుధీర్ ఎన్నిసార్లు ఖండించినా ఫలితం లేకుండా పోయింది. పైగా కొన్ని స్కిట్ల వల్ల ఆ వార్తలు ఎక్కువైపోయాయి.

అక్కడికి కూడా వెళ్లాడు.. పవన్ పక్కనే
జబర్ధస్త్ షోతో పాటు మరికొన్ని కార్యక్రమాలను హోస్ట్ చేస్తున్నాడు సుధీర్. అదే సమయంలో సినిమాల్లోకీ ఎంట్రీ ఇచ్చాడు. ‘అడ్డా' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన అతడు.. ఇప్పటి వరకు 20కి పైగా చిత్రాల్లో నటించాడు. అందులో ‘రేసుగుర్రం', ‘సర్ధార్ గబ్బర్ సింగ్', ‘సినిమా చూపిస్త మావ', ‘నేను శైలజ', ‘మిడిల్ క్లాస్ అబ్బాయి' మంచి గుర్తింపును తెచ్చాయి.

సుధీర్‌కు రెండు సార్లూ నిరాశ తప్పలేదు
వరుస షోలు.. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే సుడిగాలి సుధీర్‌కు హీరోగా చేసే అవకాశం దక్కింది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో వచ్చిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్' ద్వారా అతడు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ వెంటనే తన స్నేహితులు రాం ప్రసాద్, గెటప్ శ్రీనుతో కలిసి ‘త్రీ మంకీస్' అనే మూవీ చేశాడు. ఈ రెండూ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

జబర్ధస్త్‌కు సుడిగాలి సుధీర్ దూరం
సినిమాలు, టీవీ షోలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లతో కొన్నేళ్లుగా బిజీ బిజీగా గడుపుతున్నాడు సుడిగాలి సుధీర్. ఇలాంటి సమయంలోనే మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని తెలిసింది. ఇందులో భాగంగానే కొన్ని కథలను కూడా విన్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో సుధీర్ జబర్దస్త్‌కు దూరం అయ్యాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది.
Recommended Video

ఆ ఫోన్ కాల్ వల్లే ఈ కఠిన నిర్ణయం.!
సుడిగాలి సుధీర్ జబర్ధస్త్‌కు దూరమైంది ఓ సినిమా కారణంగా అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అతడు ‘కాలింగ్ సహస్ర' అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. అరున్ విక్కిరాలా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ద్వారా సుధీర్ హీరోగా రీలాంఛ్ అవుతున్నాడు. ఈ మూవీ కారణంగానే అతడు జబర్ధస్త్ షోకు కొద్ది రోజుల పాటు దూరం కానున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











