Sudigali Sudheer: పెళ్లిపై సుధీర్ సంచలన ప్రకటన.. కాబోయే భార్యను పరిచయం చేస్తూ!

సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర, సినీ అభిమానులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ కుర్రాడు చాలా కాలంగా తనదైన టాలెంట్లతో అటు షోలలోనూ.. ఇటు సినిమాల్లోనూ సత్తా చాటుతున్నాడు. మరీ ముఖ్యంగా యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్, మ్యాజిక్ ఇలా ఎన్నో రకాల విద్యలను చూపిస్తూ అబ్బురపరుస్తున్నాడు. తద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నాడు.

ఇక, చాలా కాలంగా సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు తన వివాహం గురించి.. చేసుకోబోయే అమ్మాయి గురించి సంచలన ప్రకటన చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

జబర్ధస్త్‌గా మారిన సుధీర్ కెరీర్

జబర్ధస్త్‌గా మారిన సుధీర్ కెరీర్

మ్యాజిక్‌లు చేసుకుంటూ కెరీర్‌ను ప్రారంభించిన సుధీర్.. ఎన్నో ఛానెళ్లలో మెజీషియన్‌గా పబ్లిక్ షోలు చేశాడు. ఆ సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో.. వాళ్ల సాయంతో అందులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే తన స్టామినాను చూపించుకున్నాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చి ప్రోత్సహించారు.

రష్మీ ట్రాక్‌తో మరింత ఫేమస్

రష్మీ ట్రాక్‌తో మరింత ఫేమస్

అనతి కాలంలోనే అదరగొట్టిన సుడిగాలి సుధీర్ భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ లవర్సే అని అంతా భావిస్తోన్న విషయం తెలిసిందే.

సినిమాల్లోనూ సత్తా... వరుసగా

సినిమాల్లోనూ సత్తా... వరుసగా

తన కామెడీతో సుధీర్ సుదీర్ఘ కాలంగా తిరుగులేని ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు. అలాగే హీరోగానూ మారి చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' నిరాశ పరిచాయి. ఇప్పుడు సుధీర్ హీరోగా 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' వంటి మూవీలు చేస్తున్నాడు.

యాంకర్‌గా రీఎంట్రీ.. స్పెషల్

యాంకర్‌గా రీఎంట్రీ.. స్పెషల్

కొన్నేళ్ల క్రితం సుడిగాలి సుధీర్ 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. దీంతో హోస్టుగానూ తన మార్క్‌ను చూపించి అలరించాడు. కానీ, ఆ షోతో యాంకరింగ్‌ను ఆపేశాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. అందులో తనదైన శైలిలో హోస్టింగ్ సూపర్ సూపర్ అనిపించుకుంటున్నాడు.

కమెడియన్ తండ్రికి వివాహం

కమెడియన్ తండ్రికి వివాహం

రాబోయే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. గతంలో జరిగిన వాటి మాదిరిగానే ఈ ఎపిసోడ్ కూడా ఎంతో సందడిగా సాగినట్లు ప్రోమోలో చూపించారు. అయితే, ఈ ఎపిసోడ్‌లో బుల్లెట్ భాస్కర్ తండ్రికి మళ్లీ పెళ్లి చేయబోతున్నట్లు చూపించారు. ఆయనతో పాటు కమెడియన్ల తండ్రులు దీనికి ఎంట్రీ ఇచ్చారు.

సుధీర్ పెళ్లిపై ఆయన ప్రశ్న

ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం సందడిగా సాగింది. అలాగే, కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను కూడా చూపించారు. ఇక, ఆఖర్లో బుల్లెట్ భాస్కర్ తండ్రి సుధీర్‌తో 'మీ నాన్నతో ఇప్పుడే ఫోన్‌లో మాట్లాడాను. మావాడు టీవీలోనే పెళ్లి చేసుకుంటున్నాడు. నిజంగా ఎప్పుడు చేసుకుంటాడు? ఇండస్ట్రీ అమ్మాయిని చేసుకుంటాడా? బయట అమ్మాయిని చేసుకుంటాడా అని అడిగారు' అని చెప్పారు.

పెళ్లి తేదీ.. అమ్మాయి గురించి

పెళ్లి తేదీ.. అమ్మాయి గురించి

బుల్లెట్ భాస్కర్ తండ్రి అడిగిన వెంటనే సుడిగాలి సుధీర్ స్పందించాడు. 'ఇంత మంది ఫాదర్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి.. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద చెప్పబోతున్నా. నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానంటే' అంటూ సిగ్గు పడుతూ స్టేజ్ కింద వైపు వెళ్లాడు. దీంతో అసలు అతడు ఏం చెప్పాడు అన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచి ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X