ఎట్టకేలకు ఫిక్సైన సుడిగాలి సుధీర్ పెళ్లి.. అతడికి కాబోయే భార్య ఎవరో తెలిస్తే!

తెలుగు బుల్లితెరపై ప్రయాణాన్ని ప్రారంభించినా.. చాలా తక్కువ సమయంలోనే తనలోని అన్ని టాలెంట్లనూ చూపించుకుని.. బిగ్ సెలెబ్రిటీగా మారిపోయాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా హైలైట్ అయిన అతడు.. కమెడియన్‌గా, యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా, హీరోగా తనలోని ఎన్నో యాంగిల్స్‌ను చూపించాడు.

తద్వారా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి తరచూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక, తాజాగా అతడి మ్యారేజ్ ఫిక్స్ అయినట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలపై మీరే లుక్కేయండి మరి!

Sudigali Sudheer Marriage News Gone Hot Topic In Tollywood

జబర్ధస్త్‌గా సుధీర్ ప్రయాణం
మ్యాజిక్‌లు చేసుకుంటూ కెరీర్‌ను మొదలెట్టిన సుధీర్.. ఎన్నో ఛానెళ్లలో మెజీషియన్‌గా షోలు చేశాడు. ఆ సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడి.. వాళ్ల సాయంతో అందులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారాడు. దీంతో సుడిగాలి సుధీర్ సెన్సేషన్ అయిపోయాడు. ఫలితంగా ఎన్నో షోలలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నాడు.

Sudigali Sudheer Marriage News Gone Hot Topic In Tollywood

సినిమాల్లోనూ... వరుసగానే

తనదైన టాలెంట్లతో సుధీర్ సుదీర్ఘ కాలంగా తిరుగులేని ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా హీరోగా చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' నిరాశ పరిచాయి. కానీ, 'గాలోడు'తో హిట్ కొట్టాడు. ఆ వెంటనే 'కాలింగ్ సహస్రా' చేసినా ఇది సక్సెస్ కాలేదు. ఇప్పుడు సుధీర్ 'గోట్' అనే సినిమాను చేస్తున్నాడు.

Sudigali Sudheer Marriage News Gone Hot Topic In Tollywood

రష్మీ ట్రాక్‌.. ఆమెతోనే పెళ్లి
తక్కువ టైంలోనే స్టార్‌గా మారిన సుడిగాలి సుధీర్ భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో ఓ రేంజ్‌లో ఫేమస్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపించాడు. ఈ మధ్య వీళ్లు పెద్దగా కలవకున్నా చాలా మంది వీళ్లు పెళ్లి చేసుకుంటారని వేచి చూస్తున్నారు.

సుధీర్ పెళ్లి హాట్ టాపిక్‌గా

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో సుడిగాలి సుధీర్ ఒకడు. సుదీర్ఘ కాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సుధీర్ అసలు పెళ్లి చేసుకోనని చెప్పినా ఈ ప్రచారాలు మాత్రం ఆగడం లేదు.

Sudigali Sudheer Marriage News Gone Hot Topic In Tollywood

ఎట్టకేలకు ఫిక్సైన మ్యారేజ్
ఈ మధ్య కాలంలోనే ఎన్నో వేదికలపై సుడిగాలి సుధీర్ ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేశాడు. అయినప్పటికీ తాజాగా అతడి వివాహం గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. బుల్లితెర వర్గాల్లో హల్చల్ చేస్తోన్న సమాచారం ప్రకారం.. సుడిగాలి సుధీర్ వివాహం ఇప్పటికే ఫిక్స్ అయిందట. త్వరలోనే దీనిపై అతడి కుటుంబ సభ్యులు ప్రకటన చేయబోతున్నారని టాక్.

ఆ అమ్మాయితోనే అంటూ

టాలెంటెడ్ గాయ్ సుడిగాలి సుధీర్ పెళ్లి వార్త లీకైన సమయంలోనే అతడికి కాబోయే భార్య వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆమె ఎవరో కాదు.. అతడి బంధువుల అమ్మాయే అని తెలిసింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో చదువుకుంటోందట. అది పూర్తైన వెంటనే వివాహం జరిపిస్తారని సమాచారం. ఈ పెళ్లిని సుడిగాలి సుధీర్ తల్లిదండ్రులే సెట్ చేశారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X