సుడిగాలి సుధీర్ పెళ్లిపై రోజా సెటైర్లు.. రష్మితో లవ్ ట్రాకా? రైల్వే ట్రాకా? అంటూ
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ లో చిన్న చిన్న స్కిట్లు చేసుకుంటూ ప్రేక్షకులకు పరిచయమైనా సుడిగాలి సుధీర్ సినిమాలు చేస్తూ.. ఇప్పుడు షోలకు హోస్ట్ లగా చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. సుడిగాలి సుధీర్ పేరు వినగానే ప్రేక్షకుల మైండ్‌లో ముందుగా గుర్తుకు వచ్చేది ఒక్కటే - పెళ్లి వార్త. వయసు నలభై దాటుతున్నా, ఆయన పెళ్లి మాత్రం ఇంకా నిత్య నూతనంగానే మారింది. ముఖ్యంగా తన కో యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్‌లో ఉన్నారనే రూమర్స్ ఏళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
ఈ రూమర్స్‌పై స్పందించిన ప్రతిసారి సుధీర్, రష్మీ ఇద్దరూ ఒకే మాట చెబుతుంటారు. 'సారీ బాస్... మేం జస్ట్ ఫ్రెండ్సే. అలాంటిది ఏం లేదు. స్క్రీన్‌పై మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి డైరెక్టర్లు అలా చూపిస్తున్నారు. ఇది అంతా జస్ట్ ఫన్ కోసం మాత్రమే' అని స్పష్టత ఇస్తూనే ఉన్నారు. అయినా ఈ జంటపై నడుస్తున్న పెళ్లి చర్చ మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే.. బుల్లితెరపై రష్మీ-సుధీర్ జంట కనిపిస్తే చాలు ప్రేక్షకులకు కనువిందే. సుధీర్ రష్మీ వెనక పడటం, రష్మీ ఛీ కొడుతూనే సిగ్గు పడటం లాంటి సీన్లు ఎన్నిసార్లు రిపీట్ అయినా బోర్ కొట్టకుండా అలరిస్తూనే ఉంటాయి. అందుకే వీరిద్దరూ చిన్న తెరపై జంటగా కనిపిస్తే ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు.

ఇక కొందరు అభిమానులు అయితే రియల్ లైఫ్‌లో కూడా ఈ జంట కలిసి ఏడడుగులు వేయాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు.'స్క్రీన్‌పైనే కాదు.. నిజ జీవితంలో కూడా మీరు జంటగా ఉంటే బాగుంటుంది' అంటూ తమ మనసులో మాట బయటపెడుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నటి, మాజీ మంత్రి రోజా చేసిన సెటైర్లు సుడిగాలి సుధీర్ పెళ్లి టాపిక్‌ను మరోసారి హాట్ టాపిక్‌గా మార్చాయి. ఒక టీవీ ప్రోగ్రామ్‌లో సుధీర్ మ్యారేజ్ విషయం ప్రస్తావనకు రాగానే రోజా సరదాగా వేసిన పంచ్ డైలాగ్స్ స్టూడియో మొత్తాన్ని నవ్వులతో నింపాయి.
అసలేం జరిగిందంటే.. సంక్రాంతి పండగ సందర్భంగా జీ తెలుగు ఛానెల్ నిర్వహిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో వినోదానికి కొదవ లేకుండా పోతోంది. చాన్నాళ్ల తర్వాత శేఖర్ మాస్టర్‌తో కలిసి జీ తెలుగు సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు రోజా. ఈ కార్యక్రమానికి ప్రదీప్ మాచిరాజుతో పాటు సుధీర్ హాజరవడంతో సందడి మరింత పెరిగింది. ఎప్పటినుంచో చర్చలో ఉన్న సుడిగాలి సుధీర్ పెళ్లి టాపిక్, రోజా సెటైర్లతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇన్ డైరెక్ట్ గా సుధీర్-రష్మీ గౌతమ్‌ల గురించి వస్తున్న ప్రేమ, పెళ్లి వార్తలపై స్పందించారు రోజా. తాను ఈ విషయాన్ని అడిగి అడిగి అలసిపోయానని అన్నారు.
ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌లో సుడిగాలి సుధీర్ పెళ్లి అంశం మరోసారి నవ్వుల పండగగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి రోజా స్టేజ్‌పై సుధీర్‌ను ఉద్దేశించి, మీ పెళ్లి గురించి ఇండస్ట్రీలోనే కాదు ఫ్యాన్స్ కూడా ఏమనుకుంటున్నారో మీకు తెలుసా అని అడుగుతూ ఓ వీడియోను ప్లే చేశారు. ఆ వీడియోలో ఓ లేడీ ఫ్యాన్ మాట్లాడుతూ, 'సుధీర్ లవ్ ట్రాక్ చూసి చూసి ఇప్పటికే తమ వీధిలో నలుగురికి ట్రాక్ వచ్చిందని సరదాగా వ్యాఖ్యానించింది. జీ తెలుగులో వచ్చే సీరియల్ ట్రాక్స్ అయినా కొన్నాళ్లకే ఆగిపోతాయేమో కానీ, మీ లవ్ ట్రాక్ మాత్రం రైల్వే ట్రాక్‌లా ఆగకుండా కొనసాగుతూనే ఉంటుందని సెటైర్లు వేసింది. ఈ ట్రాక్‌లన్నీ ఆగాలంటే ఒకటే మార్గం... త్వరగా పెళ్లి చేసుకోవడమే'అంటూ నేరుగా సుధీర్‌కు సలహా ఇచ్చింది.
ఈ వీడియో చూసిన స్టేజ్‌పై ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అంతటితో ఆగని రోజా, అదే వేదికపై ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి ఫ్యాన్స్ ఏమంటున్నారో కూడా చూపించారు. మరో లేడీ ఫ్యాన్ తన కొడుకును చూపిస్తూ వీడియోలో మాట్లాడుతూ, తాను చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రదీప్ షోలను చూస్తున్నానని, ఆ తర్వాత తాను పెరిగి పెద్దయ్యానని, పెళ్లి కూడా అయిపోయిందని, ఇప్పుడు తన కొడుకు కూడా స్కూల్‌కు వెళ్తూ మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాడని చెప్పింది. అయినా మీరు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదని, మీరు ఎప్పుడు సార్ పెళ్లి చేసుకునేది అని ప్రశ్నించింది.
ఈ ఫ్యాన్స్ వీడియోలు స్టేజ్‌పై నవ్వుల రచ్చను సృష్టించాయి. సుడిగాలి సుధీర్, ప్రదీప్‌ల రియాక్షన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎప్పటినుంచో చర్చలో ఉన్న సుధీర్ పెళ్లి టాపిక్, ఫ్యాన్స్ మాటల్లో వినిపించడంతో ఈ సెగ్మెంట్ ప్రోగ్రామ్‌లో హైలైట్‌గా మారింది. ప్రస్తుతం ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, "లవ్ ట్రాక్ కాదు... రైల్వే ట్రాక్" అనే డైలాగ్‌తో మరింత చర్చకు దారి తీస్తున్నాయి. 40 ఏళ్ల పైబడినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో సుధీర్ మ్యారేజ్ టాపిక్ ఎప్పుడూ చర్చలోనే ఉంటుంది. రష్మీ గౌతమ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం టీఆర్పీ కోసం సృష్టించిన కథలేనని సుధీర్, రష్మీ ఇద్దరూ ఇప్పటికే ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











