Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. నిమిషాల్లోనే భారీ స్పందన

బుల్లితెర ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని పేరు సుడిగాలి సుధీర్. టెలివిజన్ రంగంలో సీరియల్ హీరోల కంటే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. యాంకర్ గా, కమెడియన్ గా రాణిస్తూనే మరోవైపు వెండితెరపై హీరోగా తానేంటో నిరూపించుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు. బుల్లితెరపై సూపర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన సుధీర్ సినిమాల్లో హీరోగా పర్వాలేదనిపించుకున్నాడు. ఇటీవల గాలోడు మూవీతో అంతకుముందు సినిమాలకంటే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అనతి కాలంలోనే : బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది కుర్రాళ్లు పరిచయం అయ్యారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. బుల్లితెరపై సూపర్ హిట్ అయిన కామెడీ షో జబర్ధస్త్ ద్వారా పరిచయమైన సుధీర్.. సుడిగాలి సుధీర్ గా మారి అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు.

sudigali-sudheer-

హీరోగా ప్రయత్నాలు : జబర్దస్త్ కమెడియన్ గా సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ బుల్లితెరపై ఆద్యంతం ఎంటర్టైన్ చేశాడు. స్మాల్ స్క్రీన్ పై సుధీర్ తనదైన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తోపాటు అప్పుడప్పుడు డ్యాన్స్ లతో అదరగొట్టేశాడు. ఇటు బుల్లితెరపై తనదైన శైలీలో ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే త్రీమంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్, వాంటెడ్ పండుగాడ్ చిత్రాలు చేశాడు.

sudigali-sudheer-

టైటిల్ ప్రకటన : ఇక గతేడాది నవంబర్ 18న విడుదలైన సుధీర్ గాలోడు చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం జోరు చూపించింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ కెరీర్ లో SS4గా వస్తున్న ఈ సినిమాకు టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. మే 20న సుధీర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను రివీల్ చేశారు.

sudigali-sudheer-

పాగల్ డైరెక్టర్ : సుడిగాలి సుధీర్ SS4గా వస్తున్న సినిమాకు GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) అని ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు విశ్వక్ సేనే పాగల్ మూవీ డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మంచి కాన్సెప్టుతో గోట్ సినిమా తెరకెక్కుతోందని, గోట్ టైటిల్ ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన మేకర్స్ తెలిపారు.

తమిళ హాట్ బ్యూటీ : ఇక గోట్ సినిమాలో సుధీర్ సరసన హీరోయిన్ గా తమిళ హాట్ బ్యూటి దివ్య భారతిని తీసుకున్న విషయం తెలిసిందే. మహాతేజ క్రియేషన్స్, లక్కీ మీడియా సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు రామా నాయుడు స్టూడియోలో మే 12న నిర్వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X