14 ఏళ్లు ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరిని పెళ్లాడింది... షాకింగ్‌గా సుడిగాలి సుధీర్ బ్రేకప్‌ స్టోరీ

సాధారణ కుటుంబంలో పుట్టి సెలబ్రిటీగా ఎదిగారు సుడిగాలి సుధీర్. స్టేజ్‌పై చిన్న చిన్న మ్యాజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకునే రేంజ్‌కు చేరుకున్నారు. గాడ్ ఫాదర్ లేకపోయినా కృషి, పట్టుదల, ప్రతిభ ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ప్రూవ్ చేశారు సుధీర్. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ద్వారా పరిచయమైన ప్రతిభావంతుల్లో సుధీర్ కూడా ఒకడు. తన మిత్రులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి మనోడు చేసిన స్కిట్స్ కడుపుబ్బా నవ్వించాయి. కమెడియన్‌గా, యాంకర్‌గా, హీరోగా కెరీర్‌లో టాప్ పొజిషన్‌కు చేరుకున్న సుధీర్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు తరచుగా మ్యారేజ్ ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు.

విజయవాడకు చెందిన సుధీర్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చేశాడు. కుటుంబ ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా ఖచ్చితంగా పనిచేయాల్సిన స్థితిలో రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్న జాబ్ సంపాదించాడు. ఫిల్మ్ సిటీకి వచ్చిన ప్రేక్షకులను లైవ్ షోలో చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్‌తో అలరించాలి. ఇందుకు నెలకు 8 వేలు జీతం ఇచ్చేవారు, అస్సలు సెలవులు ఉండేవి కావు. ఇంటికి వెళ్లడానికి కూడా వీలుండేది కాదు.. కానీ జీతం వచ్చినప్పుడు ఒకసారి ఇంటికి వెళ్లాలని అనుకునేవాడు. తల్లిదండ్రులు, తమ్ముడికి బట్టలు కొని అర్ధరాత్రి ఫిల్మ్‌సిటీ బయట లారీలు ఎక్కి విజయవాడ వెళ్లేవాడు. కుటుంబానికి బట్టలు, డబ్బులు ఇచ్చి మళ్లీ ఉదయాన్నే అక్కడ లారీలు ఎక్కి, మధ్యాహ్నం డ్యూటీకి ఫిల్మ్ సిటీకి వచ్చేవాడినని సుధీర్ ఓ షోలో తెలిపారు.

Sudigali Sudheer Opens Up on his 14-Year Love and Breakup Story

ఆ కష్టపడే మనస్తత్వమే సుధీర్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. జబర్దస్త్‌లో అవకాశం సంపాదించిన సుధీర్.. తొలుత వేణు వండర్స్ టీమ్‌లో పనిచేశాడు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో షార్ట్ గ్యాప్‌లోనే టీమ్ లీడర్ స్టాయికి ఎదిగాడు. తన ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్‌లతో సుధీర్ రెచ్చిపోయాడు. ఇక యాంకర్ రష్మి గౌతమ్‌తో లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. జబర్దస్త్‌తో పాటు పలు కార్యక్రమాలలో రష్మి- సుధీర్‌ కలిసి పనిచేశారు. దాంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లుగా వీరికి యువతలో విపరీతమైన క్రేజ్ దక్కింది.

జబర్దస్త్‌లో చేస్తున్న సమయంలోనే సుధీర్‌కు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. హీరో ఫ్రెండ్‌గా, ఇతర చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చాడు. రేసుగుర్రం, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో మెరిశాడు. ఆ తర్వాత ఏకంగా హీరో స్థాయికి ఎదిగాడు సుధీర్. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. తర్వాత త్రీమంకీస్, కాలింగ్ సహస్రా, గాలోడు వంటి సినిమాల్లో హీరోగా నటించి సత్తా చాటుకున్నాడు. సినిమాలతో పాటు బుల్లితెరపై కొన్ని షోలకు యాంకర్‌గా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న సర్కార్ సీజన్ 6లో ఓ టాస్క్‌లో భాగంగా తన ప్రేమకథను చెప్పి ఎమోషనల్ అయ్యాడు.

మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ సుధీర్ చెబుతుండగా నేను అంటూ యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ నువ్వు ఆడావు కదా మళ్లీ ఎందుకు వచ్చావని సుధీర్ ప్రశ్నించగా.. ఈసారి వచ్చింది ఎదురుగా కూర్చొని ఆడటానికి కాదు.. ఆడించడానికి అని చెప్పింది విష్ణు. అమ్మాయిలకు అన్యాయం జరిగితే ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తానేమో, అబ్బాయిలకు అన్యాయం జరిగితే అర సెకను కూడా ఆలోచించను, వాళ్ల కోసం మీసాలు పెంచడానికైనా రెడీ అని చెప్పింది. ఇంతలో ప్రసాద్ బెహ్రా, తిరువీర్, రవిలు ఎంట్రీ ఇస్తారు. వారితో ఓ సినిమా పేరు గెస్ చేయమని సుధీర్ గేమ్ ఆడిస్తుండగా ప్రసాద్ ఫోనులో సెర్చ్ చేస్తూ దొరికిపోతాడు. 50 వేలు ఇస్తాను వదిలేయమని ప్రసాద్ అడగ్గా.. నేను అలాంటోడిని కాదని చెబుతాడు సుధీర్. పోనీ 70 వేలు తీసుకోమని పంచ్ వేస్తాడు.

అనంతరం ఇక్కడున్న ప్రతి ఒక్కరి తొలిప్రేమ ఏంటో చెప్పమని సుధీర్ టాస్క్ ఇస్తాడు. అయితే ముందు మీరు చెప్పండి అని తిరువీర అడుగుతాడు. ఇంతలో విష్ణుప్రియ అందుకుని 14 సంవత్సరాల రిలేషన్‌షిప్ కదా ఎందుకు బ్రేక్ అయ్యిందని ప్రశ్నిస్తుంది. తను వేరేవాళ్లని పెళ్లి చేసుకుని నన్ను వదులుకుంది. దీని గురించి తెలిసి వెళ్లి అడిగితే నేను చాలా సంతోషంగా ఉన్నాను, డోంట్ డిస్ట్రబ్ మీ అని చెప్పింది. ఆ మాటలకు నెక్లెస్ రోడ్‌లో పరిగెడుతున్నా, అరుస్తున్నా, ఏంటేంటో చేస్తున్నా అని సుధీర్ తన బ్రేకప్ స్టోరీని చెప్పడంతో అంతా ఎమోషనల్ అయ్యారు. ఈ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X