రాత్రికి దెయ్యంతో అయినా ఓకే.. అమ్మాయిలతో సుడిగాలి సుధీర్ పులిహోర!
జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. మ్యాజిక్ చేసుకుంటూ కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్ జబర్దస్త్ స్టేజికి చేరుకొని ఆనతి కాలంలో నే స్టార్ కమెడియన్ గా మారాడు. తనదైన కామెడీతో, వ్యక్తిత్వంతో హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
ఇక షో ఏదైనా సుధీర్ లేకపోతే దానికి పస లేనట్టే అనేంత లా అభిమానులకు దగ్గర అయ్యాడు. ఇక స్టార్ రేంజ్ రావడంతోనే సుధీర్ .. హీరోగా మారాడు. గాలోడు సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. సినిమాలు చేసినా షోస్ ను వదిలే ప్రసక్తే లేదు అన్నట్లు ఇప్పుడు ఒకపక్క షోస్, ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో సర్కార్ 4.

ఆహా ఓటీటి లో విజయవంతమైన ఈ గేమ్ షోను మూడు సీజన్స్ వరకు ప్రదీప్ ఎంతో అద్భుతంగా నడిపాడు. ఇక నాలుగో సీజన్ బాధ్యతలు సుధీర్ తీసుకున్నాడు. సుధీర్ ఉన్న చోట ఎంటర్ టైన్మెంట్ కు లోటే ఉండదు.. ఆ మాటను మరోసారి రుజువు చేశాడు. ప్రతి ఎపిసోడ్ లో వచ్చిన సెలబ్రిటీలను తనదైన కామెడీతో నవ్విస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
తాజాగా సర్కార్ 4 కొత్త ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ లో లవ్ మీ సినిమా టీమ్ సందడి చేసింది. హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య, రవి క్రిష్ణ, సిమ్రాన్ చౌదరి పాల్గొన్నారు. ఇక అమ్మాయిలతో సుధీర్ కలిపే పులిహోర కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి.
క ఈ సినిమాలో దెయ్యంతో ప్రేమ అనగానే దెయ్యంతో కూడా నాకు ఓకే అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక దెయ్యం తో కూడా పులిహోర కలుపుతూ.. సర్ ఈ నైట్ కు రమ్మని చెప్పండి అంటూ నవ్వులు పూయించాడు. అనంతరం రవికృష్ణతో ఒక ఆట ఆడుకున్నాడు. ఈ రియాలిటీ షో ప్రోమ అందర్నీ ఆకట్టుకొంటున్నది.
ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. సుధీర్ అన్న తోపు దమ్ముంటే ఆపు.. అన్న ఏ షోలో ఉంటే అక్కడ ఎంటర్ టైన్మెంట్ పక్కా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం సుధీర్.. గోట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











