Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రష్మీతో సుధీర్ రొమాన్స్.. అంత మంది ఉన్నా మైమరచిపోయిన జంట.. ఫామ్‌లో ఉన్నాడన్న యాంకర్
టాలీవుడ్ హీరోయిన్ కమ్ యాంకర్ రష్మీ గౌతమ్ - జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదేళ్లుగా వీళ్లపై వచ్చినన్ని రూమర్స్ మరే జంటపై వచ్చి ఉండవు. జంటగా షోలు చేయడం.. అప్పుడప్పుడు స్పెషల్ షోలు చేయడంతో వీళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరూ ఓ షోలో అదిరిపోయే రేంజ్లో రొమాన్స్ చేశారు.
రష్మీ - సుధీర్.. యూట్యూబ్ జోడీ
రష్మీ - సుధీర్‌ను యూట్యూబ్ జోడీగా పిలుస్తుంటారు. సామాన్య ప్రజలే కాదు.. చాలా మంది ఫ్రెండ్స్ కూడా వాళ్లను ఇలాగే అంటుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరిపై యూట్యూబ్ చానెళ్లలో వచ్చినన్ని రూమర్లు మరే జోడీపై రాకపోవడమే. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.
క్లారిటీ ఇచ్చారు కానీ...
ఒకవైపు సుధీర్.. మరోవైపు రష్మీ తమ మధ్య ఏమీ లేదని ఎన్నో సార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో పలుమార్లు వీళ్లకు ఇదే తరహా ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడే దీనిపై స్పష్టత ఇచ్చారు. ఒకానొక సందర్భంలోనైతే రష్మీ ఓ నెటిజన్‌తో గొడవ కూడా పెట్టుకుంది. అయినా, వీళ్లపై వచ్చే పుకార్లు ఆగడం లేదు.
రష్మీ లేకపోతే నేను లేను
ప్రముఖ చానెల్లో ప్రసారమయ్యే ‘ఢీ' షోలో సుధీర్ తమ బంధంపై ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. ‘రష్మీ అనే అమ్మాయి లేకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. సుధీర్ అంటే నా టాలెంట్ గురించి మాట్లాడరు. సుధీర్ - రష్మీ అంటారు. ఈ అమ్మాయి నా లైఫ్‌లో లేకపోతే నాకు లైఫే లేదు. ఆమె ప్రభావం నాపై ఎంతో ఉంది' అని చెప్పుకొచ్చాడు.
రొమాంటిక్ డ్యాన్స్
అదే షోలో వచ్చే వారం జరగబోయే ఎపిసోడ్ గురించి సదరు చానెల్ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో రష్మీ - సుధీర్ తొలిసారి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. ‘పరువం వానగా నేడు కురిసేనులే' అంటూ సాగే పాటలో మైమరచిపోయి ఆడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రొమాన్స్ పండించారు. దీంతో అంతా షాక్‌కు గురవుతున్నారు.
ఫామ్‌లో ఉన్నాడు
ఈ డ్యాన్స్ తర్వాత యాంకర్ ప్రదీప్ ‘ఏంటీ.. ఎప్పుడూ లేని విధంగా ఇలా చేశారు' అని అనగానే రష్మీ దీనికి సమాధానం చెబుతూ.. ‘హానెస్ట్‌గా చెప్పాలంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. సుధీర్ నుంచి నేను ఇది ఊహించలేదు. కుర్రాడు నిజంగా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు' అని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ నవ్వేశారు.