అసలు సమస్య అదే... సుడిగాలి సుధీర్, రష్మితో బిగ్ బాస్ నిర్వాహకుల చర్చలు?

Recommended Video

Bigg Boss Telugu 3 Have Reportedly Approached Sudigali Sudeer And Rashmi Gautam

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సారి ఇందులో కంటెస్టెంట్లుగా అడుగు పెట్టే సెలబ్రేటీలు ఎవరు? అనే విషయంలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. రకరకాల రూమర్స్ సైతం వినిపిస్తున్నాయి. తాజాగా షో నిర్వాహకులు జబర్దస్త్, ఢీ షోల ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్, రష్మిలను సంప్రదించినట్లు తెలుస్తోంది.

జబర్దస్త్, ఢీ షో కారణంగా సుధీర్, రష్మిలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే రూమర్స్ కూడా హల్ చల్ చేశాయి. ఈ వార్తలకు బలం ఇచ్చే విధంగా ఇద్దరూ ఆయా షోల్లో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, ఇతర టీమ్ మెంబర్స్ కూడా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందనే విధంగా కామెంట్స్ చేయడం తెలిసిందే. గతంలో ఢీ షోలో ఓ స్కిట్టులో భాగంగా ఈ ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు.

వీరు ఉంటే బిగ్ బాస్ రేటింగ్ టాప్ లేచిపోతాయ్

వీరు ఉంటే బిగ్ బాస్ రేటింగ్ టాప్ లేచిపోతాయ్

సుధీర్, రష్మి ఉంటే ఎంత సందడిగా, ఎంత వినోదంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇలాంటి జంట బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో ఉంటే రేటింగ్స్ టాప్ లేచిపోవడం ఖాయం. అందుకే వీరిని ఎలాగైనా ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఇద్దరినీ ఒప్పించడం పెద్ద సవాలు

ఇద్దరినీ ఒప్పించడం పెద్ద సవాలు

అయితే ఈ ఇద్దరినీ ‘బిగ్ బాస్' షోకు తీసుకురావడం అంత సులభం ఏమీ కాదు. వీరు టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. వీరి డేట్స్ అడ్జెస్ట్ చేస్తూ 90 రోజుల పాటు సాగే బిగ్ బాస్ రియాల్టీ షోకు తీసుకురావడం అంటే నిర్వాహకులు భారీగా రెమ్యూనరేషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇది కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవచ్చే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ వారు ఒప్పుకుంటారా?

ఇంతకీ వారు ఒప్పుకుంటారా?

బిగ్ బాస్, ఢీ లాంటి షోలలో ఒకరితో ఒకరు సరదాగా గొడవ పడుతూ రష్మి, సుధీర్ పాపులర్ అయ్యారు. అయితే వారి గొడవలు కేవలం ఆ షో వరకు మాత్రమే పరిమితం. వ్యక్తిగతంగా వారు చాలా క్లీన్ ఇమేజ్ కలిగిన వ్యక్తులు. బిగ్ బాస్ 3 లాంటి షోలకు వచ్చి రియల్‌గా గొడవ పడటానికి వారు ఇష్టపడక పోవచ్చే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి వీరిని ఒప్పించడంలో బిగ్ బాస్ తెలుగు 3 నిర్వాహకులు ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3

క్రికెట్ వన్డే వరల్డ్ కప్ టెర్నమెంట్ ముగిసిన అనంతరం ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' ప్రారంభించేందకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఈ సారి షోను నాగార్జున హోస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X