ఆ షోలోకి సుధీర్ రీఎంట్రీ: మరోసారి వాళ్లతో కలిసి రచ్చ.. అంతలోనే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా తనదైన స్టైల్స్, కామెడీ, యాక్టింగ్, సింగింగ్, మ్యూజిక్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు. అదే సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో మజాను పంచుతోన్నాడు. అంతా సవ్యంగా సాగిపోతోన్న సమయంలో సుధీర్ బుల్లితెరకు దూరంగా వచ్చేశాడు. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశ చెందుతోన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా సుధీర్ ఓ షోలోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు చూపించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!

జబర్ధస్త్ షోతో మొదలైన కెరీర్
మ్యాజిక్ షోలు చేసుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తోన్న సుధీర్.. వేణు ద్వారా జబర్ధస్త్ షోలోకి అడుగు పెట్టాడు. అందులో ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత టీమ్ లీడర్‌గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి తనదైన స్కిట్లతో ప్రేక్షకులకు మజా పంచాడు. అంతేకాదు, యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. మొత్తానికి ఈ షో అతడి కెరీర్ మారింది.

సినిమాల్లో సత్తా.. హీరోగా హిట్
బుల్లితెరపై చాలా కాలం పాటు సత్తా చాటిన సుడిగాలి సుధీర్.. ఎన్నో సినిమాల్లోనూ నటించాడు. అదే సమయంలో హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవి అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. అయితే, గత ఏడాది 'గాలోడు' మూవీతో వచ్చి హిట్‌ను కొట్టాడు. ఇక, ఇప్పుడు 'కాలింగ్ సహస్ర' మూవీలో నటిస్తున్నాడు.

ఆ షోలు అన్నింటికీ దూరంగా
జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి సుడిగాలి సుధీర్ ఈటీవీలోనే చాలా షోలలో ఆర్టిస్టుగా, యాంకర్‌గా సదండి చేశాడు. అయితే, తనకు లైఫ్ ఇచ్చిన షో నుంచి ఆ మధ్య తప్పుకున్నాడు. అయితే, కొన్ని రోజలు పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్న అతడు.. దానికి కూడా గుడ్‌బై చెప్పేశాడు. అంతేకాదు, మొత్తంగా అతడు ఈటీవీ నుంచి తప్పుకుని అందరికీ షాక్ ఇచ్చాడు.

అప్పటి నుంచి మొత్తం గ్యాప్
ఈటీవీ నుంచి బయటకు వచ్చేసిన సుడిగాలి సుధీర్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో ప్రసారం అయిన 'సూపర్ సింగర్ జూనియర్' షోకు అతడు యాంకర్‌గా చేశాడు. దీనితో పాటు పలు ఈవెంట్లు కూడా చేశాడు. అలా అక్కడ కూడా తన సత్తాను చూపిస్తూ ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ, సుధీర్ మాత్రం ఖాళీగానే ఉంటోన్నాడు.

సుధీర్ రీఎంట్రీ కోసం చూస్తూ
స్టార్ మాలోకి వెళ్లిన తర్వాత కేవలం ఒకే ఒక్క కార్యక్రమంలో కనిపించిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత అక్కడ పెద్దగా హడావిడి చేయలేకపోయాడు. దీంతో మరోసారి జబర్ధస్త్ షోలోకి వస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, దీనిపై ఎవరూ స్పందించడం లేదు. అయితే, సుధీర్ అభిమానులు మాత్రం అతడి రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు.

ఆ షోలోకి సుడిగాలి సుధీర్
ఈ మధ్య కాలంలో ఒక్క షోలోనూ కనిపించని సుడిగాలి సుధీర్.. సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అతడు తనదైన రీతిలో నవ్విస్తూ, గేమ్స్ ఆడుతూ సందడి చేసేశాడు.
ట్విస్ట్ ఇస్తూ ఫ్యాన్స్‌కు షాక్
తాజాగా విడుదలైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమోలో ఇంద్రజ 'శ్రీదేవి డ్రామా కంపెనీలోని చాలా మంది ఆర్టిస్టులు.. తమ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులను ఈ స్టేజ్ మీదకు పిలిచి థ్యాంక్స్ చెప్బబోతున్నారు' అని చెప్పింది. ఇందుకోసమే ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను.. సుధీర్‌ను పిలిచినట్లు తెలిసింది. అయితే, అతడు ఈ ఒక్క ఎపిసోడ్‌కే ఉంటాడని కూడా తెలిసింది.


Click it and Unblock the Notifications











