సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
జబర్దస్త్ తో పాపులర్ అయిన సుడిగాలి సుదీర్ తాజాగా తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తూ షోలలో వేసే పంచులపై రియాక్ట్ అయ్యారు. తనపై జరిగే నెగిటివ్ ప్రచారం గురించి సుధీర్ ఏమన్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లకు మంచి గుర్తింపు దక్కింది. అందులో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. ఆయనకు ఈ షో ద్వారానే బుల్లితెర ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఉమెన్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. సుధీర్ ఏ షోలో కనిపించినా దాని టిఆర్పి రేటింగ్ హైలో ఉండే రేంజ్ కు ఎదిగిపోయాడు ఈ కమెడియన్ కం హీరో.

ఇక సుడిగాలి సుధీర్ అంటే పడి చచ్చే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే సినిమాలు మాత్రం ఊహించిన సక్సెస్ ను తెచ్చి పెట్టలేకపోయాయి. దీంతో ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర షోలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు సుధీర్.
అయితే ఇప్పటిదాకా వచ్చిన ప్రతి షోలో సుధీర్ పై వేసే పంచులు కడుపుబ్బా నవ్వించాయి. అయితే కొన్నిసార్లు స్కిట్లలో బాడీ షేమింగ్ లేదా వెక్కిరింపు వంటి పంచ్ లను బాగానే ఎదుర్కొన్నాడు సుధీర్. అలాగే అమ్మాయిలతో ముడి పెడుతూ ఆయనపై దారుణమైన కామెంట్స్ చేసేవారు.

అందులో భాగంగానే రష్మీ, సుధీర్ ప్రేమలో ఉన్నారు అనే రూమర్ బయటకు వచ్చింది. జబర్దస్త్ స్కిట్ లో వీళ్లు చేసే వీర లెవెల్ యాక్టింగ్ కూడా దానికి ఒక కారణమైంది. షోకు మంచి టిఆర్పి రేటింగ్ తీసుకురావడానికి, జనాల్లో ఆసక్తిని పెంచడానికి జబర్దస్త్ లో యాంకర్ రష్మీ, సుధీర్ మధ్య ఏదో ఉంది అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇక వీళ్లిద్దరు కూడా అందులో జీవించేయడంతో నిజంగానే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారేమో అని ప్రేక్షకులు కూడా భ్రమపడ్డారు.
అయితే ఎన్నోసార్లు బయట అది జస్ట్ స్కిట్ వరకే పరిమితం అని ఇటు సుధీర్, అటు రష్మీ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా వీళ్ళిద్దరి గురించి ఏ రూమర్ వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఇదొక ఎత్తతే సుధీర్ అమ్మాయిల పిచ్చోడు అన్నట్టుగా స్కిట్లలో వాడే డైలాగులు మరొక ఎత్తు. మారి అవన్నీ సుధీర్ ను బాధ పెట్టవా? అనే డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది.

తాజాగా తనపై జరిగే నెగెటివిటీ, తను బ్యాడ్ అనిపించేలా షోలలో కొందరు వేసే పంచ్ లపై సుడిగాలి సుధీర్ స్పందించారు. అది కేవలం ప్రేక్షకులను నవించడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని, అయితే అందులో కొంత నిజం ఉండొచ్చు కానీ పూర్తిగా అయితే నిజం కాదని వెల్లడించారు. తానసలు వాటిని పెద్దగా పట్టించుకోనని, అది జస్ట్ స్కిట్ వరకు మాత్రమే పరిమితమని క్లారిటీ ఇచ్చాడు సుధీర్.
కాగా గత ఏడాది సుధీర్ కాలింగ్ సహస్ర అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఈ ఏడాది జనవరిలో ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా ఓటీటీలో మాత్రం కాలింగ్ సహస్ర మూవీ ఫరవాలేదు అన్పించింది.


Click it and Unblock the Notifications











