సుడిగాలి సుధీర్ నిజంగా అలాంటోడేనా? జబర్దస్త్ యాంకర్ కామెంట్స్ వైరల్
Sudigali Sudheer- Anchor Soumya Rao: నటుడు, కమెడియన్‌గా బుల్లితెర నుంచి వెండితెర వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు స్టేజ్ షోలు చేసే మెజీషియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుధీర్‌కు, జబర్దస్త్ షో ఇచ్చిన బ్రేక్ అతని జీవితాన్నే మార్చేసింది. 'సుడిగాలి' అనే పేరు మాత్రమే కాదు, భారీ ఫ్యాన్‌బేస్ కూడా అదే షో ద్వారా వచ్చిందని చెప్పాలి. కమెడియన్‌గా మొదలైన ప్రయాణం ఇప్పుడు హీరో స్థాయికి చేరడం ఆయనకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల్లో ఏ ఎపిసోడ్ చూసినా కామెంట్స్‌లో కనిపించే కామన్ పేరు సుడిగాలి సుధీర్. సింగర్, డాన్సర్, యాంకర్, కమెడియన్, హీరో... ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన సుధీర్‌పై అభిమానుల్లో అపారమైన అభిమానం ఉంది. అయితే ఇటీవల జబర్దస్త్ షో నుంచి ఆయన బయటకు రావడం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది.

ఇలాంటి సమయంలో సుధీర్ గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ చేసినది ఎవరో కాదు... ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్‌గా పని చేసిన సౌమ్య రావు (Anchor Soumya Rao). అనసూయ భరద్వాజ్ స్థానంలో కొద్ది కాలం జబర్దస్త్ యాంకర్‌గా వ్యవహరించిన సౌమ్య రావు, భాషా సమస్యలు, ట్రోల్స్ కారణంగా తక్కువ కాలంలోనే షో నుంచి తప్పుకున్నారు.
అప్పటి నుంచి ఇతర షోల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌమ్య రావు తన కెరీర్, జబర్దస్త్ షో అనుభవాలు, అలాగే సహ ఆర్టిస్టులపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్ గురించి ఆమె మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్వ్యూలో ముందుగా జబర్దస్త్ షోలో తరచూ వినిపించే రష్మి-సుధీర్ జోడీ గురించి ప్రశ్నించగా, సౌమ్య రావు స్పష్టత ఇచ్చారు. 'నాకు వాళ్లిద్దరి గురించి అంతగా తెలియదు. నిజానికి నేను ఎప్పుడూ వాళ్లను జోడీగా చూసినట్టూ, భావించినట్టూ లేదు' అని ఆమె చెప్పారు. రష్మితో తనకు పెద్దగా పరిచయం లేదని, అయితే సుధీర్ మాత్రం అప్పుడప్పుడు కలిసే వాడని తెలిపారు. 'సోలోగా ఉన్నప్పుడు మాత్రమే సుధీర్‌ను కలిసేదాన్ని. వాళ్ల మధ్య రిలేషన్ ఏంటో నాకు తెలియదు' అంటూ స్పష్టంగా చెప్పి రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
అనంతరం సుధీర్ స్వభావం గురించి అడిగిన ప్రశ్నకు సౌమ్య రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'షోల్లో, స్కిట్లలో సుధీర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తారు. కానీ బయట మాత్రం ఆయన చాలా సింపుల్. అమ్మాయిలతో అలా ప్రవర్తించినట్టు నేను ఎప్పుడూ చూడలేదు. ఎక్కడైనా ఎదురైతే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్... అంతే. ఎప్పుడూ ఆటిట్యూడ్ చూపించలేదు. చాలా కామ్ అండ్ డీసెంట్ పర్సన్' అంటూ సుధీర్‌ను ప్రశంసించారు. ఆన్ స్క్రీన్ ఇమేజ్‌కు, ఆఫ్ స్క్రీన్ వ్యక్తిత్వానికి ఎంత తేడా ఉంటుందో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది.
ఇదే ఇంటర్వ్యూలో తన కెరీర్ విషయంపైనా సౌమ్య రావు ఓపెన్‌గా మాట్లాడారు. జబర్దస్త్ తర్వాత తనకు మంచి సినిమా అవకాశాలు రావాల్సిందని యాంకర్ ప్రశ్నించగా, 'ఆఫర్లు వచ్చాయి. కానీ అవన్నీ ఎక్స్‌పోజ్ క్యారెక్టర్స్, డాన్సర్ రోల్స్, ఐటెం సాంగ్స్ లాంటివే. నాకు నచ్చిన విధంగా మాత్రం ఏవీ లేవు' అని ఆమె వెల్లడించారు. 'నన్ను ఏ యాంగిల్ నుంచి చూస్తే వాళ్లకు ఐటెంగా కనిపిస్తున్నానో నాకు అర్థం కావడం లేదు' అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాదు, అభ్యంతరకమైన సన్నివేశాలు, ఇమిటేటెడ్ సీన్స్ చేయాలని కూడా ఆఫర్లు వచ్చాయని చెప్పారు. 'అలాంటి పాత్రలకు ఎక్కువ పేమెంట్ ఇస్తామని చెప్పినా, నేను అంగీకరించలేదు. నాకు ఇష్టం లేని పనులు చేయడం కన్నా అవకాశాలు వదులుకోవడమే మంచిదని అనిపించింది' అంటూ తన నిర్ణయంపై క్లారిటీ ఇచ్చారు.
గతంలో సుధీర్, హైపర్ ఆది గురించి సౌమ్య రావు మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభ దశలో సుధీర్, హైపర్ ఆది తనకు ఎంతో సపోర్ట్ చేశారని కూడా సౌమ్య రావు వెల్లడించింది. 'కొత్త ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఇతర షోలకూ రికమెండ్ చేసి, ప్రోత్సహించారు. వాళ్లిద్దరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని' అంటూ భావోద్వేగంగా మాట్లాడింది.
ముఖ్యంగా సుధీర్ గురించి మాట్లాడుతూ, 'అతను చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇచ్చాడు' అని చెప్పింది. మొత్తానికి.. సుడిగాలి సుధీర్‌పై ఉన్న 'ఆన్ స్క్రీన్ ఇమేజ్'కి, నిజ జీవితంలో ఉన్న వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందని సౌమ్య రావు చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, సుధీర్ అభిమానుల్లో మరింత పాజిటివ్ ఇమేజ్‌ను పెంచుతున్నాయి.


Click it and Unblock the Notifications











