For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో పాపులర్ అవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారానో.. మరో సాధనం ద్వారానో తమ తమ టాలెంట్లను బయట పెట్టుకుంటూ చాలా మంది భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. ఇంతటి పోటీ ప్రపంచంలో గ్లామర్ ఫీల్డులో రాణించాలంటే ప్రత్యేకమైన టాలెంట్లు ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై ఈ మధ్య ఎంతో మంది కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు.

  వాళ్లందరి పోటీని తట్టుకుని నిలబడడంతో పాటు టెలివిజన్‌ రంగంలో స్టార్‌గా వెలుగొందుతున్నాడు సుడిగాలి సుధీర్. చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న అతడి రెమ్యూనరేషన్ వివరాలు తాజాగా లీకయ్యాయి. ఇంతకీ సుధీర్ ఏ షోకు ఎంత తీసుకుంటున్నాడు? అతడి నెలవారీ, సంవత్సర ఆదాయం ఎంత?

  మ్యాజిక్‌లతో మొదలు... జబర్ధస్త్‌గా కెరీర్

  మ్యాజిక్‌లతో మొదలు... జబర్ధస్త్‌గా కెరీర్

  ఇప్పుడు స్టార్‌గా వెలుగొందుతోన్న సుధీర్.. మ్యాజిక్‌లు చేసుకుంటూ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఛానెళ్లలో తన ప్రతిభను చూపించుకున్నాడు. ఇలా స్పెషల్ ప్రోగ్రామ్‌లతో ఫుల్ బిజీ అవుతోన్న సమయంలో జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడ్డాడు. అలా ఆ షోలో చేస్తోన్న సమయంలోనే అసాధారణమైన టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు.

  ఫలితంగా మామూలు ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను కూడా పొందాడు. అప్పటి నుంచి గెటప్ శ్రీను, రాంప్రసాద్, సన్నీలతో కలిసి అద్భుతమైన స్కిట్లతో అలరిస్తున్నాడు. అలా కెరీర్‌ను జబర్ధస్త్‌గా సాగిస్తున్నాడు.

  అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

  ఆమె వల్ల రెట్టించిన సుడిగాలి సుధీర్ క్రేజ్

  ఆమె వల్ల రెట్టించిన సుడిగాలి సుధీర్ క్రేజ్

  బుల్లితెరపైకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్.. యాక్టింగ్, డ్యాన్స్, పాటలు, మ్యాజిక్‌లు ఇలా ఎన్నో రకాల టాలెంట్లను చూపిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వీటి ద్వారానే అతడు పాపులర్ అయ్యాడు. అయితే, అతడి పేరు మారుమ్రోగిపోడానికి మాత్రం యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వచ్చిన వార్తలే కారణం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని జరిగిన ప్రచారంతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఫలితంగా రష్మీ కారణంగా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు.

  సినిమాల్లోనూ సత్తా.. హీరోగా మారాడుగా

  సినిమాల్లోనూ సత్తా.. హీరోగా మారాడుగా

  అద్భుతమైన టాలెంట్‌తో పని చేస్తున్న షోలు అన్నింట్లోనూ సందడి చేస్తూ టాప్ కమెడియన్‌గా కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. చాలా కాలం క్రితమే సినిమాల్లోనూ అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే 'రేసు గుర్రం', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు.

  ఇవన్నీ అతడికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ యంగ్ టాలెంటెడ్ గాయ్ 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' వంటి చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు.

  టాప్‌ను అమాంతం పైకి లేపిన విష్ణుప్రియ: అందాలు కనిపించేలా ఘాటు ఫోజులతో రచ్చ

  శ్రీదేవి వల్ల మళ్లీ మారిపోయిన కమెడియన్

  శ్రీదేవి వల్ల మళ్లీ మారిపోయిన కమెడియన్

  ఎన్నో ఏళ్లుగా జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా కడుపుబ్బా నవ్విస్తోన్న సుడిగాలి సుధీర్.. ఆ మధ్య 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. అందులోనూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇలా హోస్టింగ్ కూడా చేస్తూ వచ్చాడు. కానీ, ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ మారాడు. అందులో ప్రత్యేకమైన మేనరిజంతో హోస్టింగ్ చేస్తూ సందడి చేస్తున్నాడు. దీంతో అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

  సుడిగాలి సుధీర్ జబర్ధస్త్ రెమ్యూనరేషన్

  సుడిగాలి సుధీర్ జబర్ధస్త్ రెమ్యూనరేషన్

  సుడిగాలి సుధీర్‌కు ఎన్నో ఛానెళ్ల నుంచి రకరకాల షోలలో చేసే అవకాశాలు వస్తున్నాయి. కానీ, అతడు మాత్రం జబర్ధస్త్‌ షోను వీడడం లేదు. దీనికి కారణం అందరి కంటే ఈ స్టార్ కమెడియన్‌కే నిర్వహకులు ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్‌గా ఇస్తుండడమే అని తెలుస్తోంది.

  తాజా సమాచారం ప్రకారం... ఒక్కో ఎపిసోడ్‌కు సుధీర్‌ టీమ్‌ మొత్తానికి కలిపి జబర్ధస్త్‌ నిర్వహకులు రూ. 5 లక్షలు ఇస్తున్నారట. అలా ఒక నెలకు ఈ కమెడియన్ ఒక్కడే రూ. 5 - 6 లక్షల వరకూ సంపాదిస్తున్నాడట. ఇది షో మొత్తంలోనే అత్యధిక మొత్తం అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

  కాలేజ్‌ టైమ్‌లో అలాంటి పనులు.. ఆ ఉద్దేశం లేకపోయినా: నిరుపమ్ భార్య మంజుల షాకింగ్ కామెంట్స్

  మిగిలిన షోలకు సుడిగాలి సుధీర్ వేతనం

  మిగిలిన షోలకు సుడిగాలి సుధీర్ వేతనం

  సుడిగాలి సుధీర్ ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు 'ఢీ' అనే డ్యాన్స్ షోలో మెంటర్‌గా, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్‌గా చేస్తున్నాడు. వీటి ద్వారా కూడా ఈ కమెడియన్ బాగానే సంపాదిస్తున్నాడని తెలుస్తోంది. 'ఢీ' షోకు గానూ సుడిగాలి సుధీర్ ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 1.50 లక్షలు అందుకుంటున్నాడట. అలాగే, శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు గానూ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకూ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ రెండు షోలు ద్వారా నెలకు రూ. 10 లక్షలు ఆర్జిస్తున్నాడని సమాచారం. స్పెషల్ ఈవెంట్లకు సంపాదన అధనంగా వస్తుంది.

  సినిమాలకు సుధీర్ ఎంత తీసుకుంటాడు?

  సినిమాలకు సుధీర్ ఎంత తీసుకుంటాడు?

  బుల్లితెరపై షోల ద్వారా నెలకు దాదాపు రూ. 20 లక్షలు వరకూ సంపాదిస్తోన్న సుడిగాలి సుధీర్.. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. కమెడియన్‌గా చేసే చిత్రాలకు రోజుకు ఇంత అని వసూలు చేస్తున్నాడట. ఇలా ఆర్టిస్టుగా చేసిన సినిమాలకు.. ఆయా ప్రాజెక్టులను బట్టి చార్జ్ చేస్తున్నాడట. సుమారు చిన్న సినిమాలకు రూ. 2 - 3 లక్ష వరకూ తీసుకుంటాడట. ఇక, హీరోగా చేసే సినిమాలకు మాత్రం ఏకంగా రూ. 30 - 40 లక్షలు వెనకేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన అతడు.. ఇప్పుడు ఏకంగా రెండు మూడు చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు.

  Intinti Gruhalakshmi August 27th Episode: లాస్య గురించి నిజం తెలుసుకున్న నందూ.. శృతికి కొండత కష్టం

  Recommended Video

  Sridevi Soda Center : కథలో నిజాయితీ ఉంటే.. ఎవ్వడూ ఏం చెయ్యలేడు Director Karuna Kumar
  సుడిగాలి సుధీర్ ఆస్తులు.. ఆదాయం ఇలా

  సుడిగాలి సుధీర్ ఆస్తులు.. ఆదాయం ఇలా

  సుడిగాలి సుధీర్‌కు హైదరాబాద్‌లో రెండు ఇళ్లులు ఉన్నాయని అతడే ఇటీవల జరిగిన ఓ షోలో చెప్పాడు. ఈ రెండింటి విలువ దాదాపు రూ. 2 - 3 కోట్లు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికీ వీటికి ఈఎంఐలు కడుతున్నాడని సమాచారం. ఇక, అన్ని షోలకు కలిపి సుడిగాలి సుధీర్ ఒక ఏడాదికి రూ. 2 - 3 కోట్లు ఆదాయాన్ని అందుకుంటున్నాడట. అలాగే, సినిమాల ద్వారా కూడా రూ. 1 - 1.50 కోట్లు సంపాదిస్తున్నాడట. మొత్తంగా సుమారుగా ఒక సంవత్సరానికి ఈ స్టార్ కమెడియన్ కమ్ యాంకర్ కమ్ హీరో రూ. 4 - 5 కోట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడని సమాచారం.

  English summary
  Telugu Actor and a Stand-up comedian Sudigali Sudheer Doing So Many Shows and Movie. Now His Shows and Movies Remuneration Details Leaked.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X