అషు రెడ్డి దుబాయ్ సీక్రెట్స్.. బయటపెట్టిన సుడిగాలి సుధీర్.. అక్కడ ఏం చేసేదంటే?

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు అషు రెడ్డి ఎంతగానో పరిచయమైంది. డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ క్రమంగా బుల్లితెరపై అవకాశాలు అందుకుంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస ఇంటర్వ్యూలు చేసి మరింతగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ద్వారా మరింతగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అటు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ ఉంది. ఫోకస్ అనే చిత్రంతో వెండితెర పైన కూడా మెరిసింది.

ప్రస్తుతం పలు టీవీ షోలో మెరుస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అషు రెడ్డి ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో యాంకర్ గా వ్యవహరిస్తోంది. అషు రెడ్డి తో పాటు బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్, యంగ్ బ్యూటీ స్రవంతి చొక్కారపు కూడా తోటి యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రాం ను మరింత జోష్ గా రన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ టెలివిజన్ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ అషు రెడ్డికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు.

Sudigali Sudheer revealed secrets about Bigg Boss fame Ashu Reddy

ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రాం కు బుల్లితెర సెలబ్రిటీలు హాజరవుతూ సందడి చేస్తూ ఉంటారు. కాగా తాజా ఎపిసోడ్ కు ఈటీవీ లో ప్రసారమయ్యే మనసంతా నువ్వే, ఝాన్సీ డైలీ సీరియల్స్ కు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. తమ ఎనర్జీని ఈ షోలో చూపించారు. సరదాగా ఆటలు ఆడుతూ, తమ హిడెన్ టాలెంట్ ను బయట పెడుతూ బుల్లితెర ప్రేక్షకులకు, తమ అభిమానులకు మరింత ఎంటర్టైన్మెంట్ ను అందించారు. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ కూడా తనదైన శైలిలో జోకులు వేస్తూ అందరిని నవ్వించారు.

అయితే అషు రెడ్డి గురించి సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. అషు రెడ్డి చిన్న పాప అంటూ సీరియల్ నటుడు ఒకరు సుడిగాలి సుధీర్ తో చెబుతాడు. అందుకు సుధీర్ స్పందిస్తూ ఆమె చిన్న పాపా ఏంటి, ఆమె దుబాయ్ సీక్రెట్స్ తెలిస్తే అందరూ షాక్ అవుతారంటూ బదులిస్తాడు. ఇంతకీ ఆ దుబాయ్ సీక్రెట్స్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫుల్ వీడియో మే 4న ఆదివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఈటీవీ చానల్లో ప్రసారం కానుంది.

ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ అషు రెడ్డి గురించి ఇంకెలాంటి విషయాలు చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. లేదంటే సరదాగా ఆమెపై ఫన్నీ కామెంట్స్ చేశారా అనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఇక అషు రెడ్డి టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. తన గురించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో నిర్మొహమాటంగా పంచుకుంటూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది. రీసెంట్ గానే తన కు జరిగిన బ్రెయిన్ సర్జరీ వీడియోను కూడా పంచుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వీడియో చూసిన అందరూ అషురెడ్డిపై సానుభూతి చూపించారు. ఇక అషు రెడ్డి ఆ మధ్య తరచుగా దుబాయ్ ఈవెంట్స్ కు వెళ్తూ సందడి చేస్తూ కనిపించింది. ఇక ఆ విషయాన్ని సుడిగాలి సుధీర్ గుర్తు చేసినట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా ఫ్యామిలీ స్టార్స్ తాజా ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X