సుధీర్‌తో ప్రతీ రోజు అలా.. సీక్రెట్ రివీల్ చేసిన రష్మీ గౌతమ్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్‌ల మధ్య లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇది జబర్దస్త్ తదితర షోల కోసమే క్రియేట్ చేశామని మొత్తుకున్నా జనం వినే పరిస్ధితుల్లో లేరు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ నిజమేనా అనిపించే రేంజ్‌లో వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ వర్కవుట్ అయ్యింది. సుధీర్ - రష్మి ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో వీరి మధ్య నిజంగానే ప్రేమాయణం సాగుతోందని, అందుకే ఇద్దరూ పెళ్లి చేసుకోవడం లేదనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. చాలాకాలం తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై అడుగుపెట్టిన సుధీర్ రష్మితో కలిసి సందడి చేశాడు.
సాధారణ మేజిషియన్‌గా చిన్నాచితకా షోలు చేసుకుంటూ ప్రస్ధానం ప్రారంభించిన సుడిగాలి సుధీర్ జీవితాన్ని జబర్దస్త్ మార్చేసింది. వేణు టీమ్‌లో కనిపించిన అతను.. తన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్నాడు. తన ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సన్నీలతో కలిసి స్పెషల్ టీమ్‌గా మారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ సమయంలో యాంకర్ రష్మి గౌతమ్‌తో లవ్ ట్రాక్ సుధీర్‌కి యూత్‌లో సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. జబర్దస్త్‌లో చేస్తుండగానే పలు ఛానెల్స్‌లో అవకాశాలు అందుకున్నాడు సుధీర్.

ఆ తర్వాత సినీరంగం నుంచి కూడా సుధీర్‌కు పిలుపొచ్చింది. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, కాలింగ్ సహస్ర తదితర సినిమాలలో హీరోగా నటించి సత్తా చాటాడు. సినిమాలలో బిజీ అవుతున్నా.. తనకు జీవితాన్ని ఇచ్చిన బుల్లితెరను వదిలిపెట్టకుండా యాంకరింగ్‌తో పాటు పలు షోలలో నటిస్తూనే ఉన్నాడు. కానీ 40కి చేరువ అవుతున్నప్పటికీ ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తడం లేదు. అటు రష్మీ గౌతమ్ కూడా తన షోలు, సామాజిక సేవలో మునిగి తేలుతూ పెళ్లి గురించి వదిలేసింది. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం తను నటించిన గాలోడు సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి హీరోయిన్ గెహనాతో కలిసి సందడి చేశాడు సుధీర్.
సుధీర్ చాలా రోజుల తర్వాత రావడంతో ఇంద్రజ తను హత్తుకుని ఎమోషనల్ అయ్యింది. అంత బాధపడతంటే అమ్మని వదిలి వెళ్తావా అంటూ సుధీర్‌పై ఇమ్మాన్యుయేల్ ఫైర్ అయ్యాడు. అయ్యగారే నెంబర్ వన్ అని చెప్పి పంపించిందే మీరు అంటూ ఇమ్మాన్యుయేల్‌కు కౌంటర్ ఇచ్చింది ఇంద్రజ. చానాళ్ల తర్వాత ఇక్కడికి రావడం హ్యాపీగా ఉందని చెబుతూ.. నువ్వు సర్‌ప్రైజ్ కావడం లేదేంటీ అని రాంప్రసాద్‌ను అడుగుతాడు సుధీర్. దేనికిరా సర్‌ప్రైజ్ రాత్రి కలిశాం కదా? అని రాంప్రసాద్ చెప్పడంతో సుధీర్ ఖంగుతింటాడు. నువ్వు సర్‌ప్రైజ్ కావడం లేదా అని రష్మినీ అడగ్గా.. రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటాం కదా? సర్‌ప్రైజ్ దేనికి అని కౌంటర్ వేస్తుంది రష్మి.
తర్వాత హీరోయిన్ గెహనాని పిలిచి సినిమాలో ఓ సీన్ చేయమని చెబుతుంది రష్మి. ఆ వెంటనే మాకు ఈ సీన్ రష్మితో చూడాలనిపిస్తోందని ఇమ్మాన్యుయేల్ అడుగుతాడు. ఇద్దరినీ పెట్టి ఒకళ్లకి ప్రపోజ్ చేయాలంటే చాలా కష్టం అంటాడు సుధీర్. కానీ స్మాల్ స్క్రీన్ మీద ఏదైనా చేయాలన్నా.. ప్రపోజ్ చేయాలన్నా రష్మీగారితోనే. ఆవిడ ముందు నేను ప్రపోజ్ చేయడం నాకు సిగ్గుగా ఉందని అంటాడు సుధీర్. ఏం పర్లేదు నేను పర్మిషన్ ఇస్తున్నానని అంటుంది రష్మి. 70 ఎంఎం స్క్రీన్ మీద మా హీరోయిన్ గెహనా.. స్మాల్ స్క్రీన్ మీద మీరు నా హీరోయిన్ అని సుధీర్ చెప్పగా.. రష్మీ కన్నీటి పర్యంతమవుతుంది. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ.. నువ్వు ఏడస్తే నేను చచ్చిపోతానని సుధీర్ అనడంతో రష్మీ ఇంకా బాధపడుతుంది. దాంతో ఆమెను స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఓదారుస్తాడు సుధీర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సుధీర్- రష్మీలు పెయిర్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications


