మామూలు ఆటగాడు కాదు... సుధీర్‌తో జాగ్రత్త.. నటికి మహిళా నిర్మాత హెచ్చరిక
తెలుగులో టాప్ కామెడీ షోగా దూసుకెళ్తున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్. బెజవాడకు చెందిన సుధీర్... తొలుత మేజిక్ షోలు, చిన్నా చితకా ఈవెంట్స్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ ప్రస్థానంలో ఎన్నో అవనామాలు, ఛీత్కారాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. తనతో పాటు తన స్నేహితులు రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, సన్నీలకు కూడా అండగా నిలిచి వారిని కూడా పై స్థాయికి తీసుకొచ్చాడు.
మేజిషియన్ నుంచి హీరోగా
జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం రావడం సుధీర్ జీవితాన్ని మలుపు తిప్పింది. తన స్కిట్లకు ప్రేక్షకుల ఆదరణ, కామెడీ టైమింగ్, మంచితనం సుధీర్‌కు యువతలో ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో ఆయనకు సినిమాలలో అవకాశాలు కూడా క్యూకట్టాయి. అంతేకాదు ఏకంగా సినిమాలలో హీరోగా నటించే స్థాయికి ఎదిగాడు. యూత్‌లో క్రేజ్ దృష్ట్యా సుధీర్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటంతో పాటు వివాదాలకు దూరంగా ఉండే సుడిగాలి సుధీర్‌పై ఓ స్టార్ ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

కొత్త షోకు యాంకర్‌గా సుధీర్
సినిమాలలో నటిస్తూనే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు సుడిగాలి సుధీర్. ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ 2 పార్టీతో పాటు జీ తెలుగులో సరిగమప లిటిల్ ఛాంప్స్, ఆహా ఓటీటీలో కొన్ని షోలను అద్భుతంగా నడిపిస్తున్నాడు. త్వరలో జీ తెలుగులో ఆట కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. మెగా డాటర్ నిహారిక కొణిదెల, సీనియర్ నటి రాధిక, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
ఆ నటికి సుధీర్ రికమెండేషన్
త్వరలో ప్రసారం కానున్న ఆట కార్యక్రమం లాంచింగ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర నటిని ఫ్లర్ట్ చేస్తున్న సుడిగాలి సుధీర్‌పై నిహారిక కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుల్లితెర నటి కావ్యశ్రీ ఈ షోలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో రావడం రావడంతోనే ఆకట్టుకున్నారు కావ్య. నీ గురించి రికమెండ్ చేసి మరి తీసుకొచ్చాను.. ఎలాగైనా నాకు మంచి పేరు తీసుకురావాలని అంటాడు సుధీర్. ఆ మాటలతో కావ్య నవ్వుకుంటుంది. తర్వాత కావ్య వ్యక్తిగత వివరాలను స్క్రీన్‌పై ప్రదర్శించి ఒక్కొక్కటి చదువుతుంటాడు సుధీర్.
అన్నీ ఆటలు సుధీర్‌వే
ముద్దుపేరు నడిచే తాజ్ మహాల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్ అని చెబుతుండగా.. అవన్నీ హానీమూన్ డెస్టినేషన్స్ అని నిహారిక చెప్పడంతో అంతా నవ్వేస్తారు. అలాగే కావ్యశ్రీకి మల్టీటాలెంటెడ్ మేజిషియన్‌తో వివాహ యోగం అని చెప్పడంతో పాయింట్‌కి వచ్చారని రాధిక సెటైర్లు వేసింది. ఇంత మంచి ప్లేయర్‌ని తీసుకొచ్చానని మీకు చెబుతున్నా అని సుధీర్ అంటుండగా.. ఆవిడ ప్లేయర్ అంటున్నావు కానీ ఆటలన్నీ నువ్వే ఆడుతున్నావని నిహారిక సెటైర్ వేసింది. ఆ తర్వాత టాస్క్‌లో కొంచెం చూసి డబ్బులు పెట్టాలని సుధీర్ సలహాలు ఇస్తుండగా.. నెక్ట్స్ టైం నువ్వు వెళ్లి పెట్టు అంటూ నిహారిక పంచ్ వేయడంతో నేనేం మాట్లాడను అంటూ దండం పెట్టేస్తాడు సుధీర్. ఆ తర్వాత కావ్యతో కలిసి సుధీర్ డ్యాన్స్ వేయడంతో ప్రోమో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. మరి కావ్యతో సుధీర్ ఎలా పులిహార కలిపాడు. ఇందులో ఇంకా ఎవరెవరు కంటెస్టెంట్స్ ఉన్నారు? తెలియాలంటే ఫిబ్రవరి 5వ తేదీన జీ తెలుగులో ఆట గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











