ఎప్పుడూ పొదల్లోనే... అతనిని ఏ తలుపు ఆపలేదు.. హీరో సీక్రెట్స్ లీక్ చేసిన నటుడు
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ఇలాంటి కోవలోకే వస్తారు సుడిగాలి సుధీర్. మేజిషియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుధీర్.. ఆ తర్వాత స్టాండప్ కమెడియన్‌గా, సినిమాల్లో నటుడిగా మారారు. బుల్లితెరపై పాపులారిటీతో హీరోగా అవకాశం అందుకున్న సుధీర్.. సినిమాలతో పాటు టీవీలోనూ, ఓటీటీలోనూ రాణిస్తున్నారు. స్నేహితులు రాంప్రసాద్, గెటప్ శ్రీను అంటే సుధీర్‌కి ప్రాణం. ఈ క్రమంలోనే ఓ షోలో పాల్గొన్న సుధీర్‌కి సన్మానం చేసే వంకతో అతని సీక్రెట్స్ అన్ని బయటపెట్టేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగువారి ఫేవరెట్ ఓటీటీ సంస్థ ఆహాలో సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న షో సర్కార్ సీజన్ 6. సినీ ప్రముఖులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలతో సుడిగాలి సుధీర్ ఆడించే గేమ్స్, సందడి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. తాజాగా ఎపిసోడ్ 9కి సంబంధించి సుధీర్, విష్ణుప్రియ, రాంప్రసాద్, రోహిణి, ముక్కు అవినాష్, రాకెట్ రాఘవలు సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా ఇటీవల విడుదల చేసింది.

సర్కార్‌లో స్టార్టింగ్ వీడి ఎంట్రీ తర్వాత చాలా బోర్ కొట్టేది. ఇప్పుడు నిన్ను పెట్టడం వల్ల కొంచెం వాడే బెటర్ అనిపిస్తోందని విష్ణుప్రియకు రాంప్రసాద్ సెటైర్ వేశాడు. వాడు లేకపోయినా సరే సర్కార్ సీజన్ 6 మొత్తాన్ని నిన్ను పెట్టి నడిపించేస్తానని రాంప్రసాద్ చెప్పగా విష్ణుప్రియ థ్యాంక్స్ అంటుంది. జోక్ వేసినా నవ్వదేంటీ అంటూ మరో పంచ్ పేలుస్తాడు రాంప్రసాద్. గేమ్‌లో భాగంగా సుధీర్ అడిగే క్వశ్చన్స్‌కి సెలబ్రిటీలు మా వల్ల కాదంటూ దండం పెట్టేస్తారు. ఇలాంటి అన్ ఎడ్యుకేటేడ్ ఫ్రెండ్స్‌ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావంటూ సుధీర్‌పై విష్ణుప్రియ మండిపడుతుంది. అయితే వాడు కూడా అన్ ఎడ్యుకేటేడే అని రాంప్రసాద్ పంచ్ వేయడంతో అంతా నవ్వేస్తారు.
ఓయో అంటే అవినాష్‌కు ఫుల్‌ఫాం తెలియకపోవడంతో సుధీర్ దాని అర్ధం చెబుతాడు. ఇంతలో మేం ఫస్ట్ టైం సింగపూర్ వెళ్లినప్పుడు అని రాంప్రసాద్ ఏదో చెప్పబోతుండగా సుధీర్ కంగారుపడటంతో అంత వరకు వెళ్లనులే మధ్యలోనే ఆపేస్తానని అంటాడు. అనంతరం సెలబ్రిటీలు అందరూ కలిసి సుధీర్‌కి సన్మానం చేస్తారు. ముందు కుర్చీలో కూర్చోబెట్టి.. సుధీర్ గురించి అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చేందుకు ఓ పేపర్‌లో రాసుకొచ్చాడు. సుధీర్ అతనొక పేరు కాదు డోరు.. ఈయన పొదల్లో ఉదయించిన సూర్యుడు. ఆయనకి అలుపు లేదు.. ఆయన్ని ఆపే తలుపు లేదు అనడంతో అంతా నవ్వేస్తారు.
అవినాష్ ప్రతిదానికి అడ్డుపడటంతో వాడిని లాక్ చేద్దామని సుధీర్ బెదిరిస్తాడు. ఆ తర్వాత రాంప్రసాద్, రోహిణిలు కూడా అవినాష్‌ని లాక్ చేయాలని బిడ్స్ వేస్తారు. అవినాష్ రాంగ్ ఆన్సర్ చెప్పడంతో తెలివి తక్కువ దద్దమ్మా కూర్చో అంటూ రోహిణి చిరాకు పడుతుంది. నా దగ్గరున్న 2.21 లక్షలు ఇచ్చేస్తున్నాను, మళ్లీ నాకు 2 నెలల్లో ఇచ్చేయాలని అనడంతో అంతా షాక్ అవుతారు. మరి సర్కార్ సీజన్ 6లో సుధీర్ అండ్ గ్యాంగ్ చేసిన అల్లరి, ఈసారి గేమ్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే


Click it and Unblock the Notifications