సుడిగాలి సుధీర్ చెమటలు పట్టించిన హామీదా.. దిమ్మతిరెగేలా శోభాశెట్టి పులిహోర!

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ ఉన్న చోట ఎంటర్ టైన్మెంట్ కు కొదువే లేదు. ప్రస్తుతం సుధీర్ ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క షోస్ తో బిజీగా ఉన్నాడు. సర్కార్ సీజన్ 4 కు సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. మూడు సీజన్స్ కు ప్రదీప్ యాంకరింగ్ చేశాడు. అప్పుడు అసలు ఇలాంటి షో ఒకటి ఉందని చాలామందికి తెలియదు. కానీ, సుధీర్ వచ్చాక సీజన్ మొత్తం మారిపోయింది.

ఆటగాడు మారాడు.. ఆట మారింది అన్న డైలాగ్ తోనే సుధీర్ మంచి హైప్ తెచ్చాడు. ఇక తన కామెడీ టైమింగ్ తో, పంచ్ లతో షో మొత్తాన్ని తన వైపుకు తిప్పేసుకుంటాడు. ఇప్పుడు సర్కార్ సీజన్ 4 లో కూడా అదే జరుగుతుంది. ఇప్పటివరకు 9 ఎపిసోడ్స్ ను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న సర్కార్ షో.. తాజాగా పదో ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఈసారి ఈ షోకు నలుగురు హాట్ బ్యూటీస్ వచ్చారు.

sudigali sudheer sarkar season 4 latest episode promo viral in social media

సాధారణంగా ఒక అమ్మాయి వస్తేనే సుధీర్ ను ఆపడం కష్టం.. అలాంటిది నలుగురు అందమైన అమ్మాయిలు వస్తే ఆగుతాడా.. ? ప్రతి ఎపిసోడ్ లో అమ్మాయిలకు పులిహోర కలిపి చెమటలు పట్టించే సుధీర్ కు ఈ ఎపిసోడ్ లో ఈ నలుగురు అమ్మాయిలు చెమటలు పట్టించారు. మరి వారు ఎవరో చూద్దాం.

సర్కార్ 10వ ఎపిసోడ్ లో నలుగురు అందమైన అమ్మాయిలు సందడి చేశారు. వారే స్రవంతి, శుభ శ్రీ, హమీదా, శోభా శెట్టిలను చూసి సుధీర్ కవితలతో రెచ్చిపోయాడు. ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా పులిహోర మొదలుపెట్టాడు. ఎంతో మంది చచ్చిపోతారు పాము కుట్టి.. ఇప్పుడొస్తుంది శోభా శెట్టి.. నిన్ను ఇంత అందంగా పుట్టించినందుకు శుభ శ్రీ.. ఆ దేవుడికి ఇవ్వాలి పద్మ శ్రీ.. దేవకన్యలు తిరుగుతారు భూమ్మీద.. దానికి సాక్ష్యమే హమీదా.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వాటికి పొంగిపోయిన నలుగురు అమ్మాయిలు సుధీర్ ను శభాష్ అని మెచ్చుకున్నారు.

ఇక షో అంతా హమీదా.. సుధీర్ కు సైట్ కొడుతూనే ఉంది. ఏది మాట్లాడినా అతడిని వెళ్లి హాగ్ చేసుకోవడంతో సుధీర్ ఉబ్బితబ్బిబిపోయాడు. ఇక ప్రోమో చివర్లో సుధీర్ పై శుభ శ్రీ వేసిన పంచ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎండకు తిరిగితే తగిలేది వడగాలి.. మా అమ్మాయిల గుండె చప్పుడు సుడిగాలి అంటూ శుభ శ్రీ అనగానే ఆడియెన్స్ కేరింతలు కొట్టారు.

ఆహా ఇది కదా మనకు కావాల్సింది.. అమ్మాయిలందరికి సుధీర్ అన్న చెమటలు పట్టిస్తే.. ఈ అమ్మాయిలు.. సుధీర్ కే చెమటలు పట్టించారు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఎపిసోడ్ జూన్ 21 తేదీన స్ట్రీమింగ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నవ్వుల ప్రోమోపై మీరు కూడా ఒక లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X