మరో సినిమాను స్టార్ట్ చేసిన సుడిగాలి సుధీర్.. రెమ్యునరేషన్ ఎంతంటే..?
టాలీవుడ్ లో గతంలో కంటే ఎక్కువమంది కమెడియన్స్ హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక బుల్లితెర నుంచి మెల్లగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ నటులు కూడా అప్పుడప్పుడు హీరోగా అడుగులు వేస్తున్నారు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సుడిగాలి సుధీర్ కూడా హీరోగా ఇప్పటికే ఒక ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ సారి కొంత హై బడ్జెట్ లోనే సినిమాను రూపొందించనున్నారట.

సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో
సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో మొదట హీరోగా ఒక ప్రయత్నం చేసినా సుధీర్ ఎంతవరకు సక్సెల్ అయ్యాడో గాని నిర్మాతలు మాత్రం కలెక్షన్స్ పట్ల సంతృప్తి చెందారట. అందుకే ఆ దర్శకుడితేనే మరో కొత్త సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు. మొదటి నుంచి కూడా సుధీర్ రెండవ సినిమాపై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

కరోనా లేకపోయి ఉంటే
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా సక్సెస్ అయిన వారు హీరోగా కొన్నాళ్ల పాటు మాత్రమే ఆ స్టార్ డమ్ ను అనుభవించారు. ఇక బుల్లితెరపై కమెడియన్ గా సక్సెస్ అయిన సుధీర్ హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. కరోనా లేకపోయి ఉంటే ఎప్పుడో ఈ సినిమాను స్టార్ట్ చేసేవారట.

రెమ్యునరేషన్ ఎంతంటే..?
సుడిగాలి సుధీర్ బుల్లితెరపై గట్టిగానే సంపాదించాడు. ఒక షోకి 4లక్షలకు పైగా పారితోషికం అందుకునే ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు సినిమాకి ఎంత అందుకుంటున్నాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సుధీర్ మొదటి సినిమాకు 12లక్షల లోపే తీసుకున్నారట. హీరోగా మొదటి సినిమా కాబట్టి పెద్దగా డిమాండ్ చేయలేదట. ఇక ఇప్పుడు కొత్త సినిమాకు 25లక్షల వరకు అందుకుంటున్నట్లు టాక్.
Recommended Video

రిలీజ్ ఎప్పుడంటే..
కొత్త సినిమాకు సంబంధించిన లాంచ్ ఈవెంట్ శనివారం సింపుల్ గా పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. ఇక సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని మొదటిపెట్టి పరిస్థితులు చక్కబడిన తరువాత సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











