రష్మీని వదలనంటున్న సుడిగాలి సుధీర్.. ఛాన్సే లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్
యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. ఈ జోడీ కనిపిస్తే చాలు బుల్లితెర ఆడియన్స్‌కి అదో కిక్కు. వీళ్లిద్దరి మధ్య నడిచే కెమిస్ట్రీ, పంచు డైలాగులు, ఒకరిపై ఒకరు కొంటె చూపులు.. ఒక్కటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా హైలైటే. ఇక రష్మీ-సుధీర్ మధ్య లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి నడుమ ఏదో నడుస్తోందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో రష్మిని మాత్రం వదలను అని సుడిగాలి సుధీర్ చెప్పడం జనాల్లో ఆసక్తిరేకెత్తించింది. ఇంతకీ సుధీర్ ఏమన్నాడు? దాని అర్థం ఏంటి? వివరాల్లోకి పోతే..

రష్మీ - సుధీర్ ప్రేమ, డేటింగ్!
రష్మీ - సుధీర్‌ను యూట్యూబ్ జోడీగా పిలుస్తుంటారు. సామాన్య ప్రజలే కాదు.. చాలా మంది ఫ్రెండ్స్ కూడా వాళ్లను ఇలాగే అంటుంటారు. టీవీ షోలలో కూడా ఇదే తరహా పిలుపుతో ఏడిపిస్తుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరిపై యూట్యూబ్ చానెళ్లలో వచ్చినన్ని రూమర్లు మరే జోడీపై రాకపోవడమే. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.

టాపిక్ వచ్చిందంటే అది సూపర్ డూపర్ హిట్
దీంతో రష్మీ - సుధీర్ జోడీ కనిపిస్తే చాలు.. అందరి కళ్లు వాళ్ళ లవ్ ట్రాక్ పైనే పడుతుంటాయి. ఏ స్టేజ్ షో అయినా గానీ, ఏ టీవీ ప్రోగ్రామ్ అయినా గానీ ఈ ఇద్దరి కెమిస్ట్రీ గురించి టాపిక్ వచ్చిందంటే అది సూపర్ డూపర్ హిట్ అన్నటుగా మారాయి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఓ జబర్దస్త్ ఎపిసోడ్‌లో రష్మీ-సుధీర్ జోడీని టార్గెట్ చేసేశారు జబర్దస్త్ కమెడియన్.

జబర్దస్తీ చేసిన సుధీర్
సెప్టెంబర్ 27న ప్రసారం కాబోయే జబర్దస్త్ షో తాలూకు ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఇందులో రష్మీ, సుధీర్ జోడీ లపై షూట్ చేసిన సన్నివేశాలు హైలైట్
బాగా అవుతున్నాయి. బుల్లితెరపై రొమాంటిక్ జోడీగా పేరుతెచ్చుకున్న వీళ్ళు ఈ ప్రోమోలో మాములుగా హంగామా చేయలేదు. పైగా రష్మీని ఉద్దేశిస్తూ సుడిగాలి సుధీర్ చేసిన కామెంట్స్ స్పెషల్ కిక్ ఇస్తున్నాయి.

టార్గెట్ చేసిన జబర్దస్త్ కమెడియన్
ఓ స్కిట్‌లో భాగంగా కాలేజీ ఆడపిల్లలను ర్యాగింగ్ చేస్తూ ఈ ప్రోమో వీడియోలో కనిపించాడు సుడిగాలి సుధీర్. అయితే సుధీర్ ఆగడాలు చూసిన చమ్మక్ చంద్ర రంగంలోకి దిగి రష్మీని చెల్లెమ్మా అని పిలువ్ అంటూ ఫోర్స్ చేశాడు. దీంతో సుధీర్ ఫీలింగ్స్ చూసి ఆ పక్క రష్మీ జబర్దస్తీగా నవ్వేసింది.
పగలబడి నవ్విన నాగబాబు
చమ్మక్ చంద్ర చేసిన ఫోర్స్ భరించలేక రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడు కున్నాడు సుధీర్. మిగితావాళ్ళందిరినీ వదిలేస్తా సార్, ఆవిడను మాత్రం నాకొదిలేయండి సార్ అన్నాడు. చమ్మక్ చంద్ర ఊరుకుంటాడా? మిగితావాళ్లను వదిలేసినా పర్వాలేదు.. ఆమెను మాత్రం చెల్లెమ్మ అని పిలువ్ అందంతో ఒక్కసారిగా పగలబడి నవ్వాడు నాగబాబు. సెప్టెంబర్ 27న ప్రసారం కాబోయే జబర్దస్త్ షో చూస్తే మీరూ ఇలాగే నవ్వుకోవచ్చు.

గతంలో రష్మీ, సుధీర్ పెళ్లి
రష్మీ, సుధీర్ జోడీకి ఉన్న క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్తగా వాళ్లపై స్కిట్స్ రెడీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే గతంలో ఓ కార్యక్రమంలో వేదికపై రష్మీ, సుధీర్ పెళ్లి కూడా చేసేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











