సుడిగాలి సుధీర్‌‌పై హీరో సీరియస్... స్టార్ యాంకర్‌కు ఊహించని పనిష్మెంట్

జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌కు ఆ తర్వాత సినీ రంగంలోనూ సత్తా చాటాడు. ఏకంగా హీరోగా మారి పలు చిత్రాల్లో నటించాడు. సినిమాల్లోనే నటిస్తూనే తనకు ఎంతో పేరు తెచ్చిన బుల్లితెరను వదిలిపెట్టకుండా యాంకర్‌గా అలరిస్తున్నాడు సుధీర్. పలు ఛానెల్స్‌తో పాటు ఓటీటీలోనూ మెస్మరైజ్ చేస్తున్నాడు.

గత కొన్నిరోజులుగా జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్యాన్స్ రియాలిటీ షో ఆటకు సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. మెగా డాటర్ నిహారిక, సీనియర్ నటి రాధిక, కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌లతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు విష్ణుప్రియ, సమీరా భరద్వాజ్, కావ్యశ్రీ తదితరులతో కలిసి ఈ డ్యాన్స్‌ షోను నడిపిస్తున్నాడు సుధీర్. తాజాగా ఆట గ్రాండ్ ఫినాలే ముగిసింది. దీనికి సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sudigali Sudheer Shines in Aata Grand Finale as Sai Dharam Tej s Entry Goes Viral

గ్రాండ్ ఫినాలే చాప్టర్ 2లో ఆట టైటిల్ విన్నర్‌కి టైటిల్ అందజేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నాడని చెప్పగానే సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇస్తాడు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ.. నన్ను డ్యాన్స్ షోకి రమ్మని చెప్పినందుకు థ్యాంక్స్. రాధిక గారిని నా చిన్నప్పటి నుంచి చూస్తునే ఉన్నా. రఘు మాస్టర్ నా ఫేవరెట్ మాస్టర్.. నా ఫస్ట్ సినిమా నుంచి చాలా సపోర్ట్‌గా ఉన్నాడు. మా తల్లి, బంగారం.. ఏ విషయంలోనైనా నీ వెనుక నేనుంటా.. నేను సపోర్ట్ చేస్తానని నిహారికకు అందరి ముందు చెప్పారు సాయిథరమ్ తేజ్.

నిహారిక గారి గురించి మా అందరికీ తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పమని సుడిగాలి సుధీర్ అడగ్గా.. నిహారిక, వైష్ణవ్ క్లాస్‌మేట్స్. నిహారిక ఎంత బాగా చదివేదంటే స్కూల్ మొత్తం షేక్ అయిపోయేది. నిహారిక వస్తుంటే చదువుల తల్లి వస్తుందని ఫీల్ అయ్యేవాళ్లు అనుకున్నారా? కాదు మేం ఫీల్ అయ్యేవాళ్లం. టెక్ట్స్ బుక్ యాజ్ టీజ్‌గా దింపేది.. అంటే చిట్టీలు రాసేదని చెబుతాడు సాయి. మధ్యలో నిహారిక జోక్యం చేసుకుంటూ.. బావా నేను లైఫ్‌లో చెయ్యేత్తి చిట్టిలు పెట్టడమా అంటూ చెప్పబోతుండగా.. మీరు మాట్లాడొద్దని సుధీర్ అంటుండగా.. నువ్వు నా ఇమేజ్ నాశనం చేసేలా ఉన్నావని సీరియస్ అవుతుంది నిహరిక. దాంతో అమ్మా.. తల్లి ఏం చేయొద్దు రా ఈ ఎపిసోడ్‌కి డబ్బులు కట్ చేద్దామని చెబుతాడు సాయిధరమ్ తేజ్. ఆ మాటలతో సుధీర్ షాక్ అవుతాడు.

నేను లైఫ్‌లో చిట్టీలు పెట్టింది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కోసమే అని నిహారిక చెబుతుండగా.. మల్టీపుల్ ఛాయిస్‌ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చేశారని సుధీర్ పంచ్ వేస్తాడు. సాయి గారు రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉందని సుధీర్ చెబుతాడు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆడుకున్నా.. అందుకని నా మీద బాగా పెట్టుకున్నాడు పగ అని అంటుంది నిహారిక. మీరంటే మాలాంటి వారందరికీ ఒక విషయంలో అసూయగా ఉందని చిన్నప్పుడు సాయిధరమ్ తేజ్‌తో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోని చూపిస్తాడు సుధీర్. చిన్నప్పుడు మా అమ్మా షాపింగ్‌కి వెళ్తూ మా మావయ్యని చూసుకోమని చెప్పింది. నాతో ఆడుకుంటూ ఆయనకి నిద్ర రావడంతో కాళ్లతో మావయ్య లాక్ చేశాడని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

రఘు మాస్టర్ మాట్లాడుతూ.. నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. నేను రీసెంట్‌గా రాబోతోన్న మూవీలో కూడా వర్క్ చేశాను. సాంగ్ కూడా ఫినిష్ అవ్వాలి.. నా లైఫ్‌లో నేను కోరుకునేది మా తేజ్ డార్లింగ్ అంచెలంచెలుగా ఎదగాలి. ఆయన ఎప్పుడూ డౌన్ టూ ఎర్త్ .. ఎందుకంటే అది బ్లడ్‌లోనే ఉందంటూ సాయితేజ్‌ని హత్తుకున్నాడు రఘు మాస్టర్. తర్వాత నిహారిక వచ్చి సాయితేజ్‌ని హత్తుకుంటుంది. ఆ వెంటనే విష్ణుప్రియ.. పెద్ద బొకే తీసుకొచ్చి సాయిధరమ్ తేజ్‌కి ఇస్తుంది. ఆ వెంటనే రెండు పువ్వులు తీసి సుధీర్ చెవిలో పెడుతుంది నిహారిక. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సాయిథరమ్ తేజ్‌పై మెగాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X