ఆడిషన్స్ పేరిట సుధీర్ పాడు పనులు: ప్రొడ్యూసర్ ముందే అలా.. పిచ్చ కొట్టుడు కొట్టారంటూ మేటర్ లీక్

సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా అతడు తెలుగు బుల్లితెరపై తన హవాను చూపిస్తున్నాడు. సాదాసీదా ఆర్టిస్టుగా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కమెడియన్.. అనతి కాలంలోనే ఊహించని రీతిలో గుర్తింపును అందుకున్నాడు. ఫలితంగా బిగ్ సెలెబ్రిటీగా ఎదిగిపోవడంతో పాటు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ ఆడిషన్స్ పేరుతో పాడు పనులు చేశాడు. అది ఎలా బయటకు వచ్చిందో చూద్దాం పదండి!

ఎన్నో టాలెంట్ల ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

ఎన్నో టాలెంట్ల ఆల్‌రౌండర్‌గా గుర్తింపు

మ్యాజిక్‌లు చేస్తూ తన కెరీర్‌ను ఆరంభించాడు సుధీర్. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ కమెడియన్ అయిపోయాడు. అలా బుల్లితెరపై స్థిరపడిపోయిన అతడు.. ఆ తర్వాత యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి.. హీరోగానూ మారాడు. దీంతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు.

 రష్మీ ట్రాక్ వల్ల ఊహించని పాపురారిటీ

రష్మీ ట్రాక్ వల్ల ఊహించని పాపురారిటీ

సుడిగాలి సుధీర్ స్టార్‌డమ్‌ను అందుకోడానికి అతడిలోని ప్రతిభ కారణం అయితే... భారీ స్థాయిలో పాపులారిటీ దక్కడానికి మాత్రం అతడి వ్యవహార శైలినే కారణం అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడన్న వార్తలు అతడిని మరింతగా హైలైట్ చేశాయి. అందుకే తన ఎదుగుదలకు ఆమెనే ప్రధానం కారణం అంటూ చెబుతాడు సుధీర్.

 ప్లేబాయ్‌గా పేరు... అలాంటి పాత్రలతో

ప్లేబాయ్‌గా పేరు... అలాంటి పాత్రలతో

సుడిగాలి సుధీర్ రష్మీతో మాత్రమే కాదు.. పలువురు యాంకర్లతోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే జబర్ధస్త్ స్కిట్లలో అతడిని అమ్మాయిలా పిచ్చోడిలా చూపిస్తున్నారు. దీంతో సుడిగాలి సుధీర్ అంటే ప్లేబాయ్ అనేలా ఫేమస్ అయ్యాడు. అదే సమయంలో తనపై తానే పంచులు వేసుకుంటూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు.

కమెడియన్ మళ్లీ హోస్టు అయ్యాడుగా

కమెడియన్ మళ్లీ హోస్టు అయ్యాడుగా

ఎంతో కాలంగా జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా కడుపుబ్బా నవ్విస్తోన్న సుడిగాలి సుధీర్.. ఆ మధ్య 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇలా హోస్టింగ్ కూడా చేస్తూ వచ్చాడు. కానీ, ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా మారిపోయాడు.

 ప్రొడ్యూసర్ ముందే అలాగ చేశానంటూ

ప్రొడ్యూసర్ ముందే అలాగ చేశానంటూ

ప్రతి వారం తనదైన శైలి హోస్టింగ్‌తో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నాడు సుధీర్. ఇందులో భాగంగానే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం తన క్యారెక్టర్‌పై తానే షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో సుధీర్.. ఓ ప్రొడ్యూసర్ ముందే ఆడిషన్స్ చేస్తోన్న సమయంలో పాడు పనులు చేశానని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేశాడు.

ఆడిషన్స్ పేరిట సుధీర్ పాడు పనులు

శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ఆరంభంలో 'ఇంత ఆలస్యంగా వచ్చావెందుకు' అంటూ ఇమాన్యూయేల్ ప్రశ్నిస్తాడు. దీనికి అతడు.. 'హీరో ఆడిషన్స్ ఉంటే వెళ్లొచ్చా' అంటూ బదులిస్తాడు. అప్పుడు ఇమ్మూ 'అక్కడందరూ క్లాప్స్ కొట్టారా' అని అడుగుతాడు. దీనికి సుధీర్.. 'క్లాప్స్ కొట్టలేదు.. నన్ను కొట్టారు. ఎందుకంటే.. ప్రొడ్యూసర్ మీకు బాగా ఏదొస్తే అది చేయమన్నాడు' అనగా ఏదో మ్యూజిక్ వేశారు.

Recommended Video

Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
నరకంలో కూడా నరుకుడు గురించేనా

నరకంలో కూడా నరుకుడు గురించేనా

ఆ మ్యూజిక్ వేయగానే సుడిగాలి సుధీర్ పాడు పనులు చేశాడని అర్థం వచ్చింది. దీంతోపాటు అతడి మేనరిజం కూడా అలాగే కనిపించింది. దీని తర్వాత ఇమాన్యూయేల్ 'ఇలాగే చేస్తే నువ్వు నరకానికే వెళ్తావు' అంటాడు. అప్పుడు సుధీర్.. 'స్వర్గం కంటే నరకంలోనే ఎక్కువ అమ్మాయిలు ఉంటారు' అంటాడు. దీనికి ఇమ్మూ.. 'నరకంలో కూడా నీ నరుకుడు గురించేనా' అని పంచేస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X