For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినీ నటితో ఓంకార్‌కు రిలేషన్: సుడిగాలి సుధీర్‌ షాకింగ్ కామెంట్స్.. ఆ మాటతో ఇరుక్కున్న కమెడియన్

  |

  తెలుగు బుల్లితెరపై తనదైన శైలి కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ.. చాలా కాలంగా హవాను చూపిస్తూ దూసుకెళ్తున్నాడు టెలివిజన్ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడు. ఈ ఉత్సాహంతోనే సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా తనదైన టైమింగ్‌తో అలరిస్తున్నాడు. ఇలా వెండితెరపై, బుల్లితెరపై తన ప్రయాణాన్ని సాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సుడిగాలి సుధీర్ ఓ షోలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఇంద్రజ, ఓంకార్‌ రిలేషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  అక్కడి నుంచి మొదలు.. ప్రమోషన్‌తో

  అక్కడి నుంచి మొదలు.. ప్రమోషన్‌తో

  పలు టీవీ ఛానెళ్లలో మ్యాజిక్‌లు చేసుకుంటూ తన కెరీర్‌ను ప్రారంభించాడు సుధీర్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో అందులోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆ షోలో చేస్తోన్న సమయంలోనే అసాధారణమైన టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా మామూలు ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి గెటప్ శ్రీను, రాంప్రసాద్, సన్నీలతో కలిసి అద్భుతమైన స్కిట్లతో అలరిస్తున్నాడు. తద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

  SR Kalyanamandapam Twitter Review: ఇద్దరే నిలబెట్టారు.. మూవీ హైలైట్స్ అవే.. అవి లేకుంటే వేరే లెవెల్

  యాంకర్ రష్మీతో లవ్ ట్రాకుతో ఫేమస్

  యాంకర్ రష్మీతో లవ్ ట్రాకుతో ఫేమస్

  జబర్ధస్త్‌ షోలోనే కాదు.. స్పెషల్ ఈవెంట్లలో సైతం తనలోని టాలెంట్లను ఒక్కొక్కటిగా బయట పెట్టిన సుడిగాలి సుధీర్ మంచి ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. అయితే, అతడి పేరు మారుమ్రోగిపోడానికి మాత్రం యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వచ్చిన వార్తలే కారణం. అంతేకాదు, ఆమెను పెళ్లాడబోతున్నాడని జరిగిన ప్రచారంతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఫలితంగా ఒంటరిగా కంటే జంటగా ఫేమస్ అయ్యాడు. ఈ విషయాన్ని సుధీర్ కూడా స్వయంగా చెబుతుంటాడు.

  సినిమాల్లోనూ అడుగు... బ్రేక్ రాలేదు

  సినిమాల్లోనూ అడుగు... బ్రేక్ రాలేదు

  బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో తనదైన టైమింగ్‌తో కామెడీని పండిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లోనూ అడుగెట్టాడు. ఈ క్రమంలోనే 'రేసు గుర్రం', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ అతడికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' వంటి చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.

   మరోసారి అలా మారిన సుడిగాలి సుధీర్

  మరోసారి అలా మారిన సుడిగాలి సుధీర్

  సుదీర్ఘ కాలంగా జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా కడుపుబ్బా నవ్విస్తోన్న సుడిగాలి సుధీర్.. ఆ మధ్య 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. అందులోనూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇలా హోస్టింగ్ కూడా చేస్తూ వచ్చాడు. కానీ, ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ మారాడు. అందులో ప్రత్యేకమైన మేనరిజంతో హోస్టింగ్ చేస్తూ సందడి చేస్తున్నాడు.

  సినీ ప్రియులకు ఇక పండుగే: ఒకేరోజు ఏడు సినిమాలు రిలీజ్.. టాలీవుడ్‌లో తొలిసారి ఈ రేంజ్‌లో!

  వేరే ఛానెల్‌లోకి ఎంట్రీ... ఆ షోలో అలా

  వేరే ఛానెల్‌లోకి ఎంట్రీ... ఆ షోలో అలా

  చాలా ఏళ్లుగా సుడిగాలి సుధీర్ ఈటీవీలోనే కనిపిస్తున్నాడు. అందులోనే షోలు, ఈవెంట్లు చేస్తున్నాడు. అయితే, తొలిసారి అతడు స్టార్ మాలో ప్రత్యక్షం అయ్యాడు. అందులో ప్రసారం అవుతోన్న 'సిక్త్ సెన్స్' షోలో పాల్గొన్నాడు. డైరెక్టర్ కమ్ యాంకర్ ఓంకార్ నిర్వహించే ఈ షోలో ఇంద్రజ కూడా పాల్గొంది. ఇందులో 'నీతో సాయంత్రం.. ఎంతో సంతోషం' అనే పాటకు తనదైన స్టెప్పులతో అలరించాడు సుధీర్. అతడికి ఇంద్రజ కూడా తోడయ్యారు. ఇద్దరూ కలిసి కాసేపు డ్యాన్స్ చేసి సందడి సందడి చేసేశారు.

   ఓంకార్, ఇంద్రజ రిలేషన్‌.. సుధీర్ వల్ల

  ఓంకార్, ఇంద్రజ రిలేషన్‌.. సుధీర్ వల్ల

  సుడిగాలి సుధీర్ నటించిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్' మూవీలో అతడికి ఇంద్రజ తల్లిగా నటించారు. అప్పటి నుంచి ప్రతి షోలోనూ అతడిని తన కొడుకు అని చెబుతుంటారు. అందుకే 'సిక్త్ సెన్స్' షోకు వీళ్లిద్దరూ కలిసి వచ్చారు. ఇందులో ఆట ఆడుతోన్న సమయంలో సుధీర్ ఆమెను, ఓంకార్‌ను రక్త సంబంధీకులుగా కామెంట్స్ చేశాడు. దీంతో కాసేపు ఫన్ కనిపించింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  అరాచకమైన ఫొటోలతో సెగలు రేపుతోన్న యువరాజ్ మాజీ ప్రేయసి.. ఇంత ఘాటుగా ఎవరినీ చూసుండరు!

  Recommended Video

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  సుధీర్ కామెంట్స్.. ఇంద్రజ రియాక్షన్

  సుధీర్ కామెంట్స్.. ఇంద్రజ రియాక్షన్

  'మీ పెద్ద కొడుకు మధ్యలోదే కొట్టమన్నాడు' అని అన్నాడు. అప్పుడు ఆమె 'ఆయన నాకు కొడుకు అని నీకు చెప్పానా' అని ప్రశ్నించింది. దీంతో సుధీర్ 'అంటే ఆయనను నేను అన్నా అంటున్నా కదా. అందుకే కొడుకు అన్నా' అని సమాధానం చెప్పాడు. దీనికి ఇంద్రజ 'మీరు ఎంతో మందిని అన్నయ్య అని పిలుస్తారు. వాళ్లందరూ కొడుకులు అయిపోతారా' అంటూ నవ్వుతూనే అడిగింది. దీంతో సుడిగాలి సుధీర్ తెల్లముఖం ఏసేశాడు. అంతేకాదు, తర్వాత ఆమెను అమ్మా అని పిలుస్తూ దండం పెట్టాడు.

  English summary
  Telugu Actor and a Stand-up comedian Sudigali Sudheer Recently Paticipated in Sixth Sense Season 4. In This Show Sudigali Sudheer Shocking Comments on Indraja and Ohmkar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X