For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మీ వల్లే సమస్యలు.. లవ్ ఫెయిలైంది.. పెళ్లి కూడా కావట్లేదు: సుధీర్ షాకింగ్ కామెంట్స్

    |
    Sudigali Sudheer Sensational Comments On Rashmi Gautam || Filmibeat Telugu

    తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్ - జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదేళ్లుగా వీళ్లపై వచ్చినన్ని రూమర్స్ మరే జంటపై వచ్చి ఉండవు. జంటగా షోలు చేయడం.. అప్పుడప్పుడు స్పెషల్ షోలు చేయడంతో వీళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్.. రష్మీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    వీళ్లపై వచ్చినన్ని ఎవరిపైనా రాలేదు

    వీళ్లపై వచ్చినన్ని ఎవరిపైనా రాలేదు

    రష్మీ - సుధీర్‌ను యూట్యూబ్ జోడీగా పిలుస్తుంటారు. సామాన్య ప్రజలే కాదు.. చాలా మంది ఫ్రెండ్స్ కూడా వాళ్లను ఇలాగే అంటుంటారు. టీవీ షోలలో కూడా ఇదే తరహా పిలుపుతో ఏడిపిస్తుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరిపై యూట్యూబ్‌ చానెళ్లలో వచ్చినన్ని రూమర్లు మరే జోడీపై రాకపోవడమే. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.

    ఇద్దరూ వివరణ ఇచ్చినా ఆగలేదు

    ఇద్దరూ వివరణ ఇచ్చినా ఆగలేదు

    ఒకవైపు సుధీర్.. మరోవైపు రష్మీ తమ మధ్య ఏమీ లేదని ఎన్నో సార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో పలుమార్లు వీళ్లకు ఇదే తరహా ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడే దీనిపై స్పష్టత ఇచ్చారు. ఒకానొక సందర్భంలోనైతే రష్మీ ఓ నెటిజన్‌తో గొడవ కూడా పెట్టుకుంది. అయినా, వీళ్లపై వచ్చే పుకార్లు ఆగడం లేదు. దీని కోసం ప్రత్యేకంగా లైవుల్లోకి వచ్చి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేసినా విఫలం అయ్యాయి.

    రష్మీ లేకపోతే నేను లేను

    రష్మీ లేకపోతే నేను లేను

    ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ‘ఢీ' షోలో సుధీర్ ఇటీవల తమ బంధంపై స్పందించాడు. ‘రష్మీ అనే అమ్మాయి లేకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. సుధీర్ అంటే నా టాలెంట్ గురించి మాట్లాడరు. సుధీర్ - రష్మీ అంటారు. ఈ అమ్మాయి నా లైఫ్‌లో లేకపోతే నాకు లైఫే లేదు. ఆమె ప్రభావం నాపై ఎంతో ఉంది' అని చెప్పుకొచ్చాడు. అలాగే, ‘రష్మీకి నాకు ఏడు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. కానీ, ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకున్నది లేదు. రీసెంట్‌గా నాలుగైదు రోజుల క్రితం రెండున్నర గంటలు మాట్లాడుకున్నాం. అది కూడా మా ప్రొఫెషన్ గురించే' అని వెల్లడించాడు.

    రష్మీ వల్లే పెళ్లి కావట్లేదంటూ బాంబు పేల్చాడు

    రష్మీ వల్లే పెళ్లి కావట్లేదంటూ బాంబు పేల్చాడు

    ఇక, తాజాగా ఇంటర్వ్యూలో సుధీర్ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ‘రష్మీతో లవ్ అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. నేను కూడా దానికి ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చాను. మా మధ్య అటువంటిది ఏమీ లేదు. వాస్తవానికి ఈ పుకార్ల వల్ల నాకు పెళ్లి కూడా అవడం లేదు (నవ్వుతూ). నిజానికి రష్మీ నాకు మంచి ఫ్రెండ్. స్కిట్లు పండడానికి, అందరినీ నవ్వించడానికి మా మధ్య ఏదో ఉందని రాస్తుంటారు' అని పేర్కొన్నాడు.

    నా లవ్ ఫెయిల్ అయింది

    నా లవ్ ఫెయిల్ అయింది

    గతంలోనే తన ప్రేమ విఫలమైందని చెప్పిన సుధీర్.. తాజాగా మరోసారి దానిపై క్లారిటీ ఇచ్చాడు. ‘నా లవ్ ఫెయిల్ అయ్యింది. అందుకే అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. అందుకే లవ్ రిలేషన్‌ వైపు వెళ్లాలనుకోవడం లేదు. నాకు అమ్మాయిల్లో ఫ్రెండ్స్ కూడా లేరు. నేను వాళ్లతో మాట్లాడను. నా క్యారెక్టర్ గురించి నా కుటుంబానికి బాగా తెలుసు. సో నేనెవరినీ నమ్మించాల్సిన అవసరం లేదు' అని అతడు వివరించాడు.

    English summary
    Actress Rashmi Gautam, who is known for anchoring on TV show Jabardasth, has opened up on her wedding and link up with Sudigali Sudheer and said that she would prefer to have a baby first and then marry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X