సెలెబ్రిటీలకే షాకిచ్చిన సుడిగాలి సుధీర్: అతడేం చేశాడో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు!

తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది ఆర్టిస్టులుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపుతో పాటు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. తక్కువ టైంలోనే సెలెబ్రిటీగా మారిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుధీర్ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ వరుస షోలతో సందడి చేస్తోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో ఈ కమెడియన్ కమ్ యాంకర్ ఊహించని పని చేసి అందరికీ షాకిచ్చాడు. ఇంతకీ సుధీర్ ఏం చేశాడు? ఆ వివరాలేంటో మీరే చూడండి!

జబర్ధస్త్‌గా మారిన సుధీర్ కెరీర్

జబర్ధస్త్‌గా మారిన సుధీర్ కెరీర్

మెజీషియన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. ఆ తర్వాత టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి తనదైన స్కిట్లతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. మొత్తానికి కెరీర్‌ను మాత్రం సుధీర్ జబర్ధస్త్‌గా నడుపుకున్నాడు.

వరుస సినిమాలు... ఇప్పుడివే

వరుస సినిమాలు... ఇప్పుడివే

కమెడియన్‌గా, మెంటర్‌గా, యాంకర్‌గా బుల్లితెరపై సత్తా చాటిన సుధీర్.. ఎన్నో సినిమాల్లోనూ మంచి పాత్రలను పోషించాడు. అదే సమయంలో హీరోగానూ మారి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవి అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. ఇప్పుడు సుధీర్ ‘కాలింగ్ సహస్రా', ‘గాలోడు' వంటి సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు.

ఈటీవీని వదిలిన కమెడియన్

ఈటీవీని వదిలిన కమెడియన్

జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సుడిగాలి సుధీర్ ఈటీవీలోనే పలు కార్యక్రమాల్లో సందడి చేశాడు. అయితే, ఇటీవలే లైఫ్ ఇచ్చిన షో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజలు పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్న అతడు.. దానికి కూడా గుడ్‌బై చెప్పేశాడు. అంతేకాదు, మొత్తంగా అతడు ఈటీవీలో ప్రసారం అయ్యే అన్ని షోల నుంచి తప్పుకున్నాడు.

అందులో అనసూయతో రచ్చ

అందులో అనసూయతో రచ్చ

ఈటీవీకి గుడ్‌బై చెప్పేసిన సుడిగాలి సుధీర్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి అడుగు పెట్టాడు. అందులో ప్రసారం అవుతోన్న ‘సూపర్ సింగర్ జూనియర్' షోకు అతడు యాంకర్‌గా చేస్తున్నాడు. అలాగే ఈ షోకు అనసూయ భరద్వాజ్ కూడా హోస్టుగా చేస్తోంది. ఇందులో లెజెండరీ సింగర్లు చిత్ర, మనో జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇది శని, ఆదివారం ప్రసారం అవుతోంది.

సుధీర్ కామెడీ హైలైట్‌ చేస్తూ

సుధీర్ కామెడీ హైలైట్‌ చేస్తూ

తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పిల్లల సింగింగ్ టాలెంట్‌ను గుర్తించేందుకు తీసుకొచ్చిన ‘సూపర్ సింగర్ జూనియర్' షో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇందులో ప్రతి వారం ఏదో ఒక కొత్త థీమ్‌ను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే వారం ‘పల్లెటూరుకు, పట్నం జోరుకి మధ్య రసవత్తర పోరు' అనే కాన్సెప్టును తీసుకొచ్చారు. ఇందులో సుధీర్ కామెడీని హైలైట్ చేశారు.

చిత్రతో కలిసి పాడిన సుధీర్

సూపర్ సింగర్ జూనియర్ షోలో భాగంగా వచ్చే వారం జరగనున్న ‘పల్లెటూరుకు, పట్నం జోరుకి మధ్య రసవత్తర పోరు'లో పిల్లలు తమదైన పాటలతో అలరించారు. వాళ్లను ప్రోత్సహించేలా ఇందులో యాంకర్ సుడిగాలి సుధీర్ కూడా పాట పాడాడు. ఇందులో జడ్జ్‌గా చేస్తోన్న లెజెండరీ సింగర్ చిత్రతో కలిసి అతడు ‘అందం హిందోళం' అనే పాటను అద్బుతంగా ఆలపించాడు.

Recommended Video

Ott చేస్తున్న దారుణం, పైరసీ ను ఎలా పెంచుతుంది అంటే? *Entertainment | Telugu OneIndia
సుధీర్‌కు స్టాండింగ్ ఓవేషన్

సుధీర్‌కు స్టాండింగ్ ఓవేషన్


‘సూపర్ సింగర్ జూనియర్' షోలో లెజెండరీ సింగర్‌తో కలిసి సుడిగాలి సుధీర్ పాడిన పాటతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అంతలా అతడు తన గాత్రంతో అలరించాడు. దీంతో పిల్లలందరూ వచ్చి సుధీర్‌ను గట్టిగా హత్తుకుని కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత చిత్ర కోరిక మేరకు సెట్‌లో ఉన్న వాళ్లందరూ అతడికి స్టాండిగ్ ఓవేషన్ ఇచ్చి మరీ అభినందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X