జబర్ధస్త్‌‌కు సుధీర్ టీమ్ షాక్: ఇలా జరుగుతుందని అనుకోలేదు.. మమ్మల్ని క్షమించండంటూ ఏడుస్తూ!

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారం అవుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. సుదీర్ఘ కాలంగా టెలివిజన్‌ రంగంలో హవాను చూపిస్తోన్న ఈ కార్యక్రమం.. అప్పటికీ ఇప్పటికీ ఒకే రకమైన ప్రేక్షకాదరణను అందుకుంటూ ముందుకెళ్తోంది. తద్వారా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సైతం అందుకుంటోంది. దీంతో కొన్ని రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటోంది. ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో వచ్చినప్పటికీ అవన్నీ దీని ప్రభావానికి తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. అంతలా ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో జబర్ధస్త్ ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షో నుంచి సుడిగాలి సుధీర్ టీమ్ తప్పుకుంది. ఆ వివరాలు మీకోసం!

ఎంతో మందిని స్టార్లుగా చేసిన షో

ఎంతో మందిని స్టార్లుగా చేసిన షో

తెలుగులో తిరుగులేని షోగా వెలుగొందుతూ.. చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లు వెలుగులోకి వచ్చారు. వాళ్లే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్లుగా వెలుగొందుతున్నారు. అలాగే, కొన్ని వందల మందికి ఈ షో ద్వారా జీవనోపాధి లభిస్తోంది. అందుకే దీనికి మంచి పేరు దక్కింది.

నాగబాబు.. రోజాకు మరింత ఫేమ్

నాగబాబు.. రోజాకు మరింత ఫేమ్

చాలా కాలంగా నెంబర్ వన్ కామెడీ షోగా సాగుతోన్న జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. వీళ్లిద్దరి నవ్వులు, స్కిట్ల మధ్యలో వేసే పంచులు బాగా పేలేవి. అందుకే ఈ ఇద్దరికీ ఫాలోయింగ్ పెరిగింది.

వాళ్లిద్దరి ఫాలోయింగ్ పెంచేసింది

వాళ్లిద్దరి ఫాలోయింగ్ పెంచేసింది

ఈ షో వల్ల ఆర్టిస్టులు, జడ్జ్‌లు మాత్రమే కాదు.. ఇందులో యాంకర్లుగా చేస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌ కెరీర్‌కు కూడా ఈ షో ఓ రేంజ్‌లో బూస్టును ఇచ్చిందనే చెప్పాలి. ఇందులోకి రాకముందు పెద్దగా పరిచయం కాని ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.. దీని పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన గుర్తింపును అందుకున్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను భారీగా అందుకున్నారు.

జబర్ధస్త్‌లో ఆ టీమ్ చాలా స్పెషల్

జబర్ధస్త్‌లో ఆ టీమ్ చాలా స్పెషల్

సుదీర్ఘమైన జబర్ధస్త్ షో ప్రయాణంలో ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులుగా వచ్చి.. బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్‌లు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంతో టాలెంట్ ఉన్న ఈ ముగ్గురు ఒకే టీమ్‌గా ఉంటూ నవ్వులు పూయిస్తున్నారు. తద్వారా షో చరిత్రలోనే ఉత్తమమైన టీమ్‌గా పేరును కూడా సంపాదించుకున్నారు.

 సుడిగాలి సుధీర్ వెళ్లున్నాడంటూ

సుడిగాలి సుధీర్ వెళ్లున్నాడంటూ

జబర్ధస్త్ షో ద్వారా విశేషమైన గుర్తింపుతో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. అద్భుతమైన టైమింగ్‌తో పాటు అదిరిపోయే హావభావాలతో సత్తా చాటుతోన్న అతడు.. నెంబర్ వన్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు షో నుంచి వెళ్లిపోతున్నాడని చాలా రోజులుగా ఓ వార్త బుల్లితెర వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది.

జబర్ధస్త్ నుంచి సుధీర్ టీమ్ ఔట్

వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఆరంభంలో ఎంతో ఫన్‌ను చూపించారు. ఇక, చివర్లో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులు కలిసి అదిరిపోయే స్కిట్ చేశారు. ఆ తర్వాత ముగ్గురూ స్టేజ్ మీదకొచ్చి డ్యాన్సులు కూడా చేశారు. అనంతరం ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Recommended Video

PSPK 27 : Nidhhi Agerwal To Star Opposite Pawan Kalyan In Periodic Drama
 క్షమించండి అంటూ ఏడుస్తూనే

క్షమించండి అంటూ ఏడుస్తూనే

ముందుగా శ్రీను మాట్లాడుతూ 'చాలా రోజుల నుంచి ముగ్గురం కలిసి జబర్ధస్త్‌కు.. ఇకపై జబర్ధస్త్ నుంచి మేము' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత రాంప్రసాద్ 'మేము ఏదో ఇంటర్వ్యూ ఇచ్చి చెబుదామనుకున్నాం. ఇలా స్టేజ్ మీద చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. మమ్మల్ని క్షమించండి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు..' అంటూ షోను వీడారు. దీంతో రోజా షాకైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X