సుధీర్‌కు కరోనా.. కానీ ఎందరిలోనో గుబులు.. టోటల్ డ్యామేజ్!!

సుడిగాలి సుధీర్‌కు కరోనా పాజిటివ్ అనే వార్తలు సోషల్ మీడియా, మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. అయితే సుధీర్‌కు కరోనా పాజిటివ్ అని ఎవ్వరూ అధికారికంగా ప్రకటించడం లేదు గానీ సుధీర్‌తో పాటు ఇంకొంత మంది హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. సుధీర్ ఒక్కడికి కరోనా రావడంతో ఎంతో మంది చిక్కుల్లో పడ్డారట. ఎన్నో ఈవెంట్లు, షోలు అన్నీ కూడా గందరగోళంలో పడ్డాయట.

సుధీర్‌కు కరోనా..

సుధీర్‌కు కరోనా..

అసలే ఇప్పుడంతా పండుగ వాతావరణం నెలకొంది. దీనికి తోడు పండుగ వేళ బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లతో నానా హంగామా మొదలైంది. ఇప్పటికే ప్రోమోలతో దంచికొడుతున్నారు. ఈ టీవీ, స్టార్ మా, జీ తెలుగు పోటీలు పడుతున్నాయి. అయితే సుధీర్‌కు కరోనా సోకడంతో అన్నీ ఈవెంట్లలోనూ భయాందోళనలు నెలకొన్నాయట.

అక్కా ఎవరే అతగాడు ఈవెంట్..

అక్కా ఎవరే అతగాడు ఈవెంట్..

ఈటీవీలో దసరా ఈవెంట్‌గా అక్కా ఎవరే అతగాడులో సుధీర్ పాల్గొన్నాడు. ఈ షూటింగ్ జరుగుతుండగానే సుధీర్‌కు కరోనా సోకిందని కొన్ని వార్తలు బయటకు వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే ఆ ఈవెంట్‌లో పాల్గొన్న అందరికీ ఇబ్బందే.

మళ్లీ ఢీ షోకు బ్రేక్..

మళ్లీ ఢీ షోకు బ్రేక్..

అక్కా ఎవరే అతగాడు ఈవెంట్‌లో రష్మీ, వర్షిణి, శేఖర్ మాస్టర్ ఇలా అందరూ ఉన్నారు. వీరు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. అలా ఢీ షోకు కూడా బ్రేకులు వేయాల్సింది. అసలే శేఖర్ మాస్టర్ మొన్నీమధ్య కరోనా నుంచి కోలుకుని మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టాడు.

ఎక్స్ ట్రా జబర్దస్త్..

ఎక్స్ ట్రా జబర్దస్త్..

రష్మీ, రాం ప్రసాద్ ఇలా మిగతా జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు సైతం గందరగోళానికి గురవుతున్నారట. వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇలా ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు అంతరాయం కలగొచ్చనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

#HBDSudigaliSudheer : Sudigali Sudheer Next Film with Rashmi Gautam
దీపావళి ఈవెంట్లు..

దీపావళి ఈవెంట్లు..

సుధీర్ లేనిదే ఏ పండుగకు ఈవెంట్లు జరగవు. అలాగే వచ్చే దీపావళికి కూడా ఏవో స్పెషల్ ఈవెంట్లు ప్లాన్ చేశారట. సుధీర్‌ను లీడ్‌గా పెట్టి ప్లాన్ చేసిన ఆ ఈవెంట్లలో ఇప్పుడు భారీ మార్పులు తప్పేలా కనిపిస్తున్నాయట. ఇక ఇవి కాకుండా వెబ్ సిరీస్, సినిమా ప్రాజెక్ట్‌లు కూడా షెడ్యూల్స్ మార్చుకునేలా కనిపిస్తోందట. ఇలా ఒక్క సుధీర్ వల్ల ఇంత గందరగోళం నెలకొందంటే.. బుల్లితెరపై అతని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుధీర్ కరోనా బారిన పడ్డాడని వార్తలు వచ్చిన క్షణం నుంచి.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X